మరో అదిరిపోయే బుల్లెట్ బైక్ వచ్చేస్తుంది.. మిమ్మల్ని మైమరపిస్తుంది.. చూడటానికి రెండు కళ్లు చాలవంతే!
భారత్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి కొత్త మోడల్ విడుదల అవుతుందని వార్త వచ్చిందంటే చాలు, దాని డిజైన్, ఫీచర్ల గురించి ఆన్‌లైన్‌లలో వెతుకుంటారు. ఒకప్పుడు ధనవంతులకు మాత్రమే సొంతమైన బుల్లెట్ బైకులను ప్రస్తుతం సాధారణ మధ్యతరగతి వారు సైతం కొనుగోలు చేస్తున్నారు. బుల్లెట్ బైక్‌తో రోడ్లపై డుగ్ డుగ్ అంటూ వెళ్తుంటే ఈ మజాయే వేరుగా ఉంటుంది. ప్రజల నుంచి వస్తున్న ఆదరణను గమనించిన కంపెనీ, తక్కువ ధరలో కొత్త మోడళ్లను లాంచ్ చేస్తూ అన్ని నగరాలు, ప్రాంతాలకు తమ బైకులను విస్తరిస్తుంది. ఈ నేపథ్యంలో కంపెనీ త్వరలో అదిరిపోయే డిజైన్, ఫీచర్లతో 650సీసీ సిరీస్‌లో భాగంగా 'రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650(Royal Enfield Bear 650)' అనే బైకును మార్కెట్లోకి లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650 ను నవంబర్ 5న జరగబోయే EICMA 2024లో విడుదల చేయబోతున్నారు. ధర వివరాలు ఇంకా వెల్లడించలేదు. కాంటినెంటల్ GT 650, ఇంటర్‌సెప్టర్ 650, సూపర్ మెటోర్ 650, షాట్‌గన్ 650 వేరియంట్‌ల తరువాత ఇదే ఇంజిన్ సిరీస్‌లో వస్తున్న ఐదో మోడల్ బేర్ 650. ఇది స్టైలీష్ లుక్‌తో అదిరిపోయే డిజైన్‌తో వస్తుంది.

భారీ 648 cc ఇంజిన్‌తో వస్తున్న ఈ బైక్ ప్యార్లల్ ఆయిల్-కూల్డ్-ట్విన్ ఇంజిన్ 5150 rpm వద్ద 57 nm టార్క్, 7250 గరిష్ట rpm వద్ద 47 bhp గా ఉంటుంది. ఇది ఇంటర్‌సెప్టర్ 650 కంటే దాదాపు ఎక్కువ టార్కును విడుదల చేస్తుంది. బేర్ 650ను తీసుకుని రోడ్లపై వెళ్తుంటే అందరి చూపు కూడా దీనిపైనే ఉంటుంది.
ఈ బైకు ఐదు కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఎక్కువ వేగంతో దూసుకుపోవడానికి 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ను ఇంజిన్‌కు జత చేశారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇతర మోడళ్లతో పోలిస్తే బేర్ 650 భారీగా కనిపిస్తుంది. కానీ తక్కువ బరువును కలిగి ఉంటుందని తెలుస్తోంది. కొత్తగా ఆధునికరించిన బ్రేకులను బైకులో అందించారు. రెండు టైర్లను ఒకే సమయంలో కంట్రోల్ చేయడానికి డ్యూయల్ ఛానల్ ఏబీఎస్(ABS) సిస్టం బాగా ఉపయోగపడుతుంది.

ముఖ్యంగా లాంగ్ రైడ్‌లు చేసే వారికి ఈ బైక్ బెస్ట్ ఆప్షన్. దీనిలో అన్ని లేటెస్ట్ ఫీచర్లే ఉన్నాయి. హ్యాండ్ భాగంలో స్క్రాంబ్లర్ ఇన్‌బిల్డ్ నావిగేషన్ సిస్టమ్‌తో ఫుల్- కలర్ TFT స్క్రీన్‌ను అమర్చారు. దీంతో తెలియని ప్రాంతాలకు వెళ్లడానికి అడ్రస్ టైప్ చేయగానే గూగుల్ మ్యాప్ సహాయంతో చాలా ఈజీగా వెళ్లవచ్చు. మ్యూజిక్ కంట్రోల్స్ వంటి ఫీచర్లు కూడా దీనిలో ఉన్నాయి.
ఎత్తుపల్లాలు ఉన్న ప్రాంతాల్లో కూడా ఎన్‌ఫీల్డ్ బేర్ 650 రయ్ మంటూ దూసుకుపోతుంది. దీని కోసం మెరుగైన సస్పెన్షన్‌ను అందించారు. ముందు యూఎస్‌డీ ఫోర్క్స్, వెనుక భాగంలో కొత్త డ్యూయల్ షాక్-అబ్జార్బర్‌లు ఉన్నాయి. వీటితో పాటు ఇంకా అప్‌డేట్ చేసిన LED లైట్స్, కొత వీల్ సైజ్, ఇతర ఫీచర్లు, మెకానికల్ మార్పులు ఈ బైకులో ఉన్నాయి. టైర్లు కూడా చాలా మందంగా ఉంటాయి.

ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650కి సంబంధించిన ఫొటోలు ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నాయి. ఎన్‌ఫీల్డ్ అభిమానులు ఈ మోడల్ గురించి ఆసక్తికరంగా సెర్చ్ చేస్తున్నారు. యూత్‌ను ఈ బైక్ బాగా అట్రాక్ట్ చేస్తుంది. ధర గురించి ఎలాంటి వివరాలు కంపెనీ వెల్లడించలేదు. లాంచ్ రోజున కంపెనీ అన్ని వివరాలు ప్రకటిస్తుంది. బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత ఈ బైక్ మార్కెట్ లో భారీగా అమ్ముడుపోయే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది.


Click it and Unblock the Notifications








