మార్కెట్లోకి సరికొత్త డుగ్‌ డుగ్‌ బండి వచ్చేసింది.. డిజైన్​ చూస్తే మతిపోతోంది.. వామ్మో ఇది మాములుది కాదు..

బైకుల రారాజు రాయల్ ఎన్‌ఫీల్డ్(Royal Enfield) నుంచి కొత్తగా బేర్ 650(Bear 650)ఇండియా మార్కెట్లోకి విడుదల అయింది. ఇది సరికొత్త ఫీచర్లతో వచ్చింది. ఈ మోడల్ ఇంటర్‌సెప్టర్ 650 నుండి తీసుకోబడింది. బేర్ ఆకట్టుకునే డిజైన్‌తో మార్కెట్లో అమ్మకాల పరంగా కొత్త రికార్డును నెలకొల్పుతుందని కంపెనీ భావిస్తోంది. ఇంటర్‌సెప్టర్ 650 ఇప్పటికే కొనుగోలుకు అందుబాటులో ఉండగా, ఇదే ఇంజిన్ సిరీస్‌లో వస్తున్న బేర్‌ మోడల్‌లో మరిన్ని అదనపు ఫీచర్లు ఉన్నాయి. బేర్ 650 రూ. 3.39 లక్షల(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరతో మార్కెట్లోకి వచ్చింది. లేటెస్ట్ ట్రెండ్‌కు అనుగుణంగా దీనీలో చాలా అప్‌డేట్‌లు ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువ ఇంజిన్‌ను కావాలనుకునే వారికి ఇది చాలా మంచి ఎంపిక అవుతుంది. బేర్ 650 డిజైన్, ఫీచర్ల వివరాలను క్రింది కథనంలో ఇవ్వబడ్డాయి..

డిజైన్: బేర్ 650 డిజైన్ ఎక్కువగా ఇంటర్‌సెప్టర్ 650 లాగా కనిపిస్తుంది. ముందు భాగంలో రౌండ్ షేపులో LED హెడ్‌లైట్, కొత్త డిజైనింగ్‌లో ఇంధన ట్యాంక్‌ను కలిగి ఉంటుంది. టర్న్ ఇండికేటర్‌లు పాత మోడళ్ల మాదిరిగా ఉన్నాయి. దీని లుక్ లగ్జరీ లాంటి ఫీలింగ్‌ను అందిస్తుంది. ఈ బైకు ఐదు కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.

Royal Enfield Bear 650 Launch Details

ఇంజిన్: భారీ 648cc ఇంజిన్‌తో వస్తున్న ఈ బైక్ ప్యార్లల్ ఆయిల్-కూల్డ్-ట్విన్ ఇంజిన్‌తో వచ్చింది. ఇది 5150 rpm వద్ద 57 nm టార్క్‌, 7250rpm వద్ద 47 bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా ఇది ఇంటర్‌సెప్టర్ 650 కంటే దాదాపు ఎక్కువ టార్కును విడుదల చేస్తుంది. భారీ ఇంజిన్‌తో వచ్చినప్పటికి దీని బరువు మాత్రం తక్కువగానే ఉంటుంది.

ఇతర ఫీచర్లు: హ్యాండ్ భాగంలో స్క్రాంబ్లర్ ఇన్​బిల్డ్​ నావిగేషన్ సిస్టమ్​తో ఫుల్- కలర్ TFT స్క్రీన్‌ ఉంది. ఈ బైకులో మరో అదిరిపోయే ఫీచర్ ఏంటంటే, తెలియని ప్రాంతాలకు వెళ్లడానికి అడ్రస్ టైప్ చేయగానే గూగుల్ మ్యాప్ సహాయంతో అడ్రస్ తెలుసుకోడానికి సరికొత్త ఫీచర్‌ను అందించారు. అదనంగా మ్యూజిక్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉంది. ఇంకా మరిన్ని కూడా ఉన్నాయి.

Royal Enfield Bear 650 Launch Engine Price Top Features

ఇంకా అప్‌డేట్ చేసిన బ్రేకు‌లను బైకులో అమర్చారు. ముందు, వెనుక టైర్లను ఒకే సమయంలో కంట్రోల్ చేయడానికి డ్యూయల్ ఛానల్ ఏబీఎస్(ABS) సిస్టం కూడా ఉంది. ఎత్తుపల్లాలు ఉన్న ప్రాంతాల్లో కూడా ఎన్‌ఫీల్డ్ బేర్ 650 రయ్ మంటూ దూసుకుపోతుంది. దీని కోసం మెరుగైన సస్పెన్షన్‌ను అందించారు. ముందు యూఎస్‌డీ ఫోర్క్స్, వెనుక భాగంలో కొత్త డ్యూయల్ షాక్-అబ్జార్బర్‌లు ఉన్నాయి. ఇవన్నీ కూడా లేటెస్ట్‌వే.

మెరుగైన ఆఫ్-రోడ్ కోసం బేర్ 650 ముందు 19-అంగుళాలు, వెనుక 17-అంగుళాల వెనుక చక్రాన్ని కూడా కలిగి ఉంది. 184mm గ్రౌండ్ క్లియరెన్స్‌తో వరదలో సైతం సాఫీగా ప్రయాణిస్తుంది. ఎత్తుపల్లాలు ఉన్న రోడ్లపై కూడా రయ్ మంటూ దూసుకుపోతుంది. దేశంలో ఇప్పటికే రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి వచ్చే బైకులంటే ఎనలేని క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు విడుదల అయిన కొత్త మోడల్ కూడా వినియోగదారులను బాగా ఆకట్టుకునేలా ఉంది.

Royal Enfield Bear 650 Launch

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, November 5, 2024, 17:15 [IST]
English summary
Royal enfield bear 650 launch engine price top features check all details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+