రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి దిమ్మతిరిగే ఎలక్ట్రిక్ బైక్.. క్రేజీ డిజైన్‌తో సూపర్ లుక్.. చూస్తే మతిపోవాల్సిందే!
ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం వేగంగా పెరుగుతుంది. దీంతో ఈవీ స్కూటర్లతో పాటు ఈవీ బైకులు కూడా క్రమంగా మార్కెట్లోకి విడుదల అవుతున్నాయి. ఇప్పటికే బైకుల విభాగంలో బాగా పేరున్న కంపెనీలు కొత్త మోడళ్లను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం ఏథర్, బజాజ్, టీవీఎస్ వంటి అనేక ప్రముఖ కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లను మాత్రమే విక్రయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లగ్జరీ బైకులకు దేశంలో బాగా ప్రాచుర్యం ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైకు త్వరలో విడుదల కాబోతుంది. ఇది నవంబర్ 4న విడుదల అవుతుందని సంబంధిత వర్గాల వారు ఇటీవల పేర్కొన్నారు. రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు చెందిన అనేక మోడళ్లు ప్రస్తుతం దేశంలో చాలా ఫేమస్. అలాంటిది, ఇప్పుడు అదే కంపెనీ నుంచి ఈవీ బైక్ విడుదల అవుతుందని వార్త రావడంతో, బుల్లెట్ అభిమానులు ఈ మోడల్ రాకపై చాలా ఆశలు పెట్టుకున్నారు.
ఎన్‌ఫీల్డ్ నుంచి వస్తున్న ఈవీ బైకుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా బ్యాటరీ పనితీరు, రేంజ్, అదనపు ఫీచర్ల గురించి కస్టమర్లు ఆసక్తిగా ఆన్‌లైన్‌లో వెతుకుతున్నారు. వీటన్నింటికీ నవంబర్ 4న సమాధానం రానుంది. ఎందుకంటే ఆ రోజే రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ కానుంది. మరోవైపు ఈ ఎలక్ట్రిక్ బైకును 2026 ప్రారంభంలో తీసుకురావచ్చని కొన్ని మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. కొద్ది రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుంది.

కానీ లాంచ్‌కు ముందు దీన్ని టెస్ఠింగ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇతర బైక్‌లతో పోలిస్తే రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ స్లిమ్ బాడీతో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ EV నగర రోడ్లలో మాత్రమే రైడింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. లోకల్‌గా ప్రయాణించే వారికి ఇది మంచి ఎంపిక అవుతుంది. ఎన్‌ఫీల్డ్ నుంచి వచ్చిన ఇతర బైక్‌లతో పోలిస్తే దీని లుక్ డిఫరెంట్‌గా ఉంటుంది.
ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ మొత్తం డిజైన్ Electrik01 కాన్సెప్ట్‌పై ఆధారపడి ఉంది. ప్రస్తుత సమాచారం ప్రకారం స్పెయిన్‌లోని బార్సిలోనా నగరంలో తొలిసారిగా రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ టెస్ట్ రన్ ప్రారంభమైంది. ఇది సింగిల్ ఛార్జింగ్‌తో 100 నుండి 160 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని తెలుస్తుంది. రోజువారీ వాడకంతో పాటు, వీకెండ్స్‌లలో తక్కువ దూర రైడింగ్‌లను ఈజీగా చేయవచ్చు.

ఇది అత్యాధునికమైన ఫీచర్లను కలిగి ఉంది. దీని రూపం ఇదే కంపెనీకి చెందిన క్లాసిక్ మోడల్‌గా ఉంది. వృత్తాకార రెట్రో హెడ్‌ల్యాంప్‌లు, క్రోమ్‌తో కూడిన సర్క్యులర్ సైడ్ వ్యూ మిర్రర్స్, సర్క్యులర్ టర్న్ ఇండికేటర్‌లు, సర్క్యులర్ టెయిల్‌ల్యాంప్‌లను ఈ బైకులో ఆశించవచ్చు. ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ భారత మార్కెట్లో రూ. 2.50-3 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు.
ఇదే ధరతో కంపెనీ మార్కెట్లోకి బైకును లాంచ్ చేసినట్లయితే ఏథర్, బజాజ్‌తో పాటు ఓలా వంటి కంపెనీలకు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసిన తర్వాత, రాయల్ ఎన్‌ఫీల్డ్ మరిన్ని మోడళ్లను తీసుకురావాలని చూస్తుంది. దీని తరువాత, రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ఎలక్ట్రిక్ మోడల్‌ను తీసుకురావాలని భావిస్తున్నారు.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.



Click it and Unblock the Notifications








