తొలిసారిగా రాయల్‌ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్‌ బైక్స్ వచ్చేస్తున్నాయ్‌.. క్రేజీ డిజైన్‌, అదిరిపోయే ఫీచర్లతో ఆవిష్కరణ

ప్రపంచంలోనే ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్‌ మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ని (Royal Enfield Electric Bike) ఆవిష్కరించింది. దీనిని రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఫ్లయింగ్ ఫ్లీ సీ6 (Flying Flea C6) పేరుతో మార్కెట్‌లోకి పరిచయం చేసింది. ప్రపంచంలోనే ప్రఖ్యాత ఆటో షో 'ఈఐసీఎంఏ 2024' (EICMA) ఇటలీలోని మిలాన్‌లో కొనసాగుతోంది. ఈ ఆటో షోలో రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలిసారిగా బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ బైక్‌ని ఆవిష్కరించింది. దీంతో పాటు రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఫ్లయింగ్ ఫ్లీ స్క్రాంబ్లర్ ఎస్‌6 (Flying Flea Scrambler S6) అనే ఎలక్ట్రిక్ బైక్‌ని కూడా ఈవెంట్‌లో ప్రదర్శించింది. ఈ బైక్‌ని ప్రపంచ మార్కెట్‌తో పాటు భారత్‌లో నేరుగా లాంచ్‌ చేయనున్నారు.

రెండు కీలక ఎలక్ట్రిక్ బైక్స్‌ విడుదల కోసం రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఈ ఈవెంట్‌ని వినియోగించుకుంది. భారీ అంచనాల మధ్య రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఈ ఎలక్ట్రిక్ బైక్లను ప్రదర్శించింది. ఈ రెండు బైక్స్‌లో ఫ్లయింగ్ ఫ్లీ అనేది 125 సీసీ సింగిల్ సిలిండర్ మోటార్‌ని కలిగి ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధంలో పోరాటానికి గుర్తుగా ఫ్లయింగ్ ఫ్లీ అనే పేరును రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఉపయోగించింది.

Royal Enfield Flying Flea C6 Revealed

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ ఎలక్ట్రిక్ బైక్‌ పేరుతో పాటు స్టైలింగ్‌ని కూడా మార్చింది. ఫ్లయింగ్ ఫ్లీ సీ6 లుక్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ముందు, వెనుక భాగంలో సర్క్యూలర్ లైట్స్‌ని అందించారు. ఇందులో ఆధునిక సైకిళ్ల మాదిరిగానే ఈ బైక్‌లో అల్యూమినియం ఫ్రేమ్‌ని ఉపయోగించారు. ఇది సింగిల్ సీటు కెపాసిటీని కలిగి ఉంది. దీనికి చాలా సింపుల్ లుక్‌ని ఇచ్చారు. ఇది ఇతర బైక్స్‌ వలె విలాసవంతంగా కనిపిస్తుంది.

ఈ బైక్‌లో టీఎఫ్‌టీ స్క్రీన్ కూడా ఉంది. ఇది టచ్‌స్క్రీన్‌తో కూడిన రౌండ్‌ డిస్ప్లేతో ఆకర్షణీయంగా ఉంటుంది. ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ ఏబీఎస్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ వంటి ఫీచర్లు ఈ ఎలక్ట్రిక్‌ బైక్‌లో కలవు. అంతే కాకుండా సేఫ్టీ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ కోసం రెండు వీల్స్‌కి డిస్క్ బ్రేకులను అందించారు. ఇంకా మరెన్నో అధునాతన ఫీచర్లు ఈ బైక్‌లో అందించారు.

Royal Enfield Flying Flea C6 EV Bikes

ఇక ఈ బైక్‌కి సంబంధించిన రేంజ్ ఇతర ముఖ్యమైన వివరాలు తెలియరాలేదు. ప్రస్తుతానికి ఈ బైక్‌ని రాయల్ ఎన్‌ఫీల్డ్ మాత్రమే విడుదల చేసింది. దీనిని ఏ ఇతర కంపెనీల సహకారంతో తీసుకురాలేదు. ఈ బైక్స్‌ సంబంధించిన బ్యాటరీ, రేంజ్‌, ఇతర మోటార్‌ స్పెసిఫికేషన్స్‌ని త్వరలో వెల్లడించనున్నారు. ఇది భారతీయ మార్కెట్‌లో అడుగుపెడితే ఇతర కంపెనీలకు గట్టి పోటీ ఇస్తుంది.

లాంచ్‌ ఎప్పుడంటే?: ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ బైక్‌ని 2026లో అమ్మకానికి తీసుకువచ్చే అవకాశం ఉంది. మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ 2026 కంటే ముందే ఈ బైక్‌ని లాంచ్ చేసే అవకాశం ఉంది. పైన చెప్పిన విధంగా ఈ బైక్‌ భారత్‌లో ఓలా ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్‌, టార్క్ క్రాటోస్, రివోల్ట్ ఆర్‌వీ, అల్ట్రావయొలెట్ ఈవీ బైక్స్‌కి గట్టి పోటీని ఇస్తుంది.

Royal Enfield Flying Flea C6 New EV Bikes

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, November 5, 2024, 10:16 [IST]
English summary
Royal enfield flying flea c6 revealed at eicma 2024 check design and specifications here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+