ఈ బొమ్మ కచ్చితంగా బ్లాక్‌బ్లాస్టర్ హిట్టే.. యూత్ పడిచచ్చిపోతారు.. క్రేజీగా రాయల్ ఎన్‌ఫిల్డ్ కొత్త బైక్

బైకుల రారాజు రాయల్ ఎన్‌ఫిల్డ్ నుంచి ఎదైనా కొత్త మోడల్ విడుదల అవుతుందని ప్రకటన వచ్చిందంటే చాలు చాలా మంది ఈ మోడల్ పేరు, డిజైన్, ధర గురించి ఆన్‌లైన్‌లో తెగ వెతుకుతుంటారు. ఇండియాలో రాయల్ ఎన్‌ఫిల్డ్ బైకులు అంటే ఎంతో క్రేజ్ ఉంటుంది. దశాబ్దకాలంగా వేరే కంపెనీలకు గట్టి పోటీని ఇస్తూ ఎప్పటికప్పుడు అమ్మకాల్లో దూసుకుపోతుంది. హార్లే డేవిడ్‌సన్‌, ట్రయంఫ్ వాటి కంటే మెరుగైన అమ్మకాలను రాయల్ ఎన్‌ఫిల్డ్ సాధిస్తుంది. గతంలో కంపెనీ 650 సీసీ ఇంజిన్ బైకులపై అధికంగా దృష్టి పెట్టి వాటిని ఎక్కువగా లాంచ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు రాగా, ఇదే క్రమంలో 350 సీసీ ఇంజిన్ సెగ్మెంట్‌లో కూడా బైకులను విడుదల చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ కొత్తగా ఇదే ఇంజిన్ విభాగంలో 'గోవాన్ క్లాసిక్ 350(goan classic 350)' అనే మోడల్‌ను తెచ్చింది. తాజాగా జరిగిన ఈవెంట్‌లో దీన్ని ఆవిష్కరించింది.

గోవాన్ క్లాసిక్ 350 ఫీచర్లు అచ్చం క్లాసిక్ 350 మోడల్‌లాగా ఉంటాయి. ఇది హంటర్, బుల్లెట్, క్లాసిక్ తర్వాత J-సిరీస్ ఇంజిన్ సిరీస్‌లో వస్తున్న ఐదో మోడల్. రాయల్ ఎన్‌ఫిల్డ్ 350 సీసీ ఇంజిన్ విభాగానికి చెందిన పలు మోడళ్లకు చాలా ఏళ్లుగా ఇండియాలో మంచి ఆదరణ ఉంటుంది. దీంతో కంపెనీ ఈ సెగ్మెంట్‌పై మరోసారి దృష్టి సారించి గోవాన్ క్లాసిక్‌ను తీసుకొచ్చింది.

Royal Enfield Goan Classic 350 Design

ఈ మోడల్ 349cc సింగిల్-సిలిండర్ ఇంజిన్‌‌ను కలిగి ఉంది. ఇది 20bhp పవర్, 27Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇంజిన్‌కు 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జోడించారు. ఇది రౌండ్ LED హెడ్‌లైట్, యూ- రకం హ్యాండిల్‌బార్, టియర్ డ్రాప్ ఆకారంలో పెట్రోల్ ట్యాంక్, ట్యూబ్‌లెస్ వైర్-స్పోక్ ట్రిమ్‌లను కలిగి ఉంది. క్లాసిక్ 350 మోడల్‌లో కొన్ని ఫీచర్లను దీనిలో అందించారు.

ముఖ్యంగా ఇది జావా 42 బాబర్ లాగా సింగిల్ సీట్‌ ఆప్షన్‌లో వస్తుంది. డ్రైవింగ్ చేసే సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి రిలాక్స్డ్ రైడింగ్ కోసం సీటు ఎత్తును తక్కువగా ఇచ్చారు. ఈ సింగిల్-సీట్ లేఅవుట్ 750 మిమీ వరకు ఎత్తు ఉంటుంది. వెనుక డిస్క్‌ బ్రేకులు ఉండగా, రైడర్లకు అదనంగా మరింత రక్షణ కోసం డ్యూయల్-ఛానల్ ABS సిస్టమ్‌‌ను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

Royal Enfield Goan Classic 350

ఎత్తుపల్లాలు ఉన్న రోడ్లపై ఈజీగా వెళ్లడానికి మెరుగైన సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. ముందు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక డ్యూయల్ షాక్ అబ్జార్బర్‌లను అందించారు. బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ 170 మి మీగా ఉంది. ఇది చూడటానికి బాబర్ సెగ్మెంట్‌ లాగా కనిపిస్తుంది. అల్లాయ్ వీల్స్ కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. కంపెనీ ఆవిష్కరించిన మోడల్‌లో టైర్లకు ఆనుకుని తెల్లటి వీల్స్ అందంగా కనిపిస్తున్నాయి.

రాయల్ ఎన్‌ఫిల్డ్ వినియోగదారుల్లో ఎక్కువగా యువతే ఉంటారు. ఈ నేపథ్యంలో వారిని ఆకట్టుకునేలా దీని డిజైన్‌ను రూపొందించారు. వారి కోసమే దీన్ని పలు కలర్ వేరియంట్లలో అందించాలని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం క్లాసిక్ 350 మోడల్ ధర రూ.1.93 లక్షల నుంచి రూ.2.30 లక్షల మధ్య ఉంది. గోవాన్ క్లాసిక్ 350‌ ధర రూ. 2.15 లక్షలుగా ఉండవచ్చని సమాచారం.

రాయల్ ఎన్‌ఫిల్డ్ నుంచి వచ్చిన ఈ 350సీసీ ఇంజిన్‌తో సింగిల్ సీట్ బైక్‌ ఇదే సెగ్మెంట్‌లో ఉన్న ఇతర మెడళ్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. క్లాసిక్ మోడల్ లాగా ఎక్కువగా అమ్మకాలను సాధిస్తుందని, ఇది కచ్చితంగా హిట్ మోడల్ అని కంపెనీతో పాటు మార్కెట్ వర్గాలు గోవాన్ క్లాసిక్ 350‌ పై భారీ ఎత్తున అంచనాలను పెట్టుకున్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, November 21, 2024, 9:30 [IST]
English summary
Royal enfield goan classic 350 design engine features all details
Read more on: #royal enfield #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+