రాయల్ ఎన్‌ఫిల్డ్ నుంచి ఒంటరి వీరుడు.. సింగిల్స్‌కు బెస్ట్ ఛాయిస్.. డిజైన్‌కు ఎవరైనా అట్రాక్ట్ కావాల్సిందే

ఇండియాలో రాయల్ ఎన్‌ఫిల్డ్(Roayl enfield) బైకులు అంటే ఎంతో క్రేజ్ ఉంటుంది. దీని నుంచి ఏదైనా కొత్త మోడల్ విడుదల అవుతుందని ప్రకటన వచ్చిందటే చాలు దాని డిజైన్, ఇంజిన్, ఫీచర్ల గురించి ఆన్‌లైన్‌లో తెగ వెతుకుతుంటారు. అమ్మకాల పరంగా దశాబ్దకాలంగా ఇతర కంపెనీలకు చెందిన మోడళ్లకు రాయల్ ఎన్‌ఫిల్డ్ బైకులు గట్టి పోటీ ఇస్తున్నాయి. మిడ్ కెపాసిటీ బైకుల అమ్మకాల్లో ఈ కంపెనీ ట్రయంఫ్, హార్లీ డేవిడ్‌సన్‌ల వాటి కంటే మెరుగైన అమ్మకాలను నమోదు చేస్తుంది. ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫిల్డ్ 650 సీసీ ఇంజిన్ బైకులపై ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి ఈ విభాగంలో కొత్త మోడళ్లను తీసుకొస్తుంది. కంపెనీ ఇప్పటికే బేర్ 650, క్లాసిక్ 650, షాట్‌గన్ 650 వంటి మోడళ్లను విక్రయిస్తుండగా త్వరలో మరిన్నింటిని సైతం విపణిలోకి తీసుకురావడానికి ప్రణాళికలు మొదలుపెట్టింది. అయితే ఇదే సమయంలో కంపెనీ 350 సీసీ ఇంజిన్ వేరియంట్లపై కూడా దృష్టి సారించింది.

మొదట్లో 350 సీసీ ఇంజిన్ విభాగానికి చెందిన పలు మోడళ్లను లాంచ్ చేయగా అన్ని కూడా ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్న బైకులుగా ఉన్నాయి. దీంతో తాజాగా ఈ విభాగంలో మరో బైకును విడుదల చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. కొత్త మోడల్ పేరు 'గోవాన్ క్లాసిక్ 350(goan classic 350)'. ఈ మోడల్ క్లాసిక్, హంటర్, బుల్లెట్ తర్వాత J-సిరీస్ ఇంజిన్ సిరీస్‌లో వస్తున్న ఐదో మోడల్.

Royal Enfield Goan Classic 350 Launch

ఇది 349cc సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇంజిన్ 20bhp పవర్, 27Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. ఇది ప్రధానంగా క్లాసిక్ 350 మోడల్ మాదిరిగా ఉంటుంది. కాకపోతే దీని డిజైన్, రైడింగ్ ఆప్షన్లు, కలర్స్ మాత్రం వేరుగా ఉన్నాయి. ఇది జావా 42 బాబర్ లాగా సింగిల్ సీట్‌తో పాటు వెనుక సీటును కొంత కలిగి ఉంటుందని తెలుస్తుంది.

దీని ఫీచర్లలో గుండ్రని హెడ్‌ల్యాంప్, ఫార్వర్డ్-సెట్ ఫుట్‌పెగ్‌లు, వృత్తాకార టెయిల్ ల్యాంప్, ముందు Led హెడ్‌లైట్ ఉన్నాయి. క్లాసిక్ 350లో ఉన్నటువంటి అదే ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను దీనిలో అందించినట్లు తెలుస్తుంది. పొడవాటి U- ఆకారపు హ్యాండిల్‌బార్, ముందు, వెనుక డిస్క్‌ బ్రేకులు, రైడర్లకు అదనంగా మరింత రక్షణ అందించడానికి డ్యూయల్-ఛానల్ ABS సిస్టమ్‌‌ను కూడా ఈ బైకులో అందించారు.

Royal Enfield Goan Classic 350

ఎత్తు పల్లాలు ఉన్న రోడ్లపై కూడా సాఫీగా ప్రయాణించడానికి గోవాన్ క్లాసిక్ 350‌లో ట్యూబ్యులర్ డౌన్‌ట్యూబ్ ఫ్రేమ్‌కు మెరుగైన సస్పెన్షన్‌ను జోడించారు. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో డ్యూయల్ షాక్ అబ్జార్బర్‌లను అమర్చారు. దీంతో బైక్ అన్ని రకాల రోడ్లపై ఈజీగా ప్రయాణిస్తుంది. బైక్ అల్లాయ్ వీల్స్ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇది 170 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కూడా కలిగి ఉంది.

యూత్ ఎక్కువగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులను ఇష్టపడుతుంటారు. కంపెనీ వినియోగదారుల్లో యువతే అధికంగా ఉంటారు. ఈ నేపథ్యంలో గోవాన్ క్లాసిక్ 350‌ డిజైన్ వారిని ఆకట్టుకునే విధంగా ఉండగా, ఇది డిఫరెంట్ కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ కలర్స్ యూత్‌కు నచ్చే విధంగా ఉంటాయి. ప్రస్తుతం క్లాసిక్ 350 మోడల్ ధర రూ.1.93 లక్షల నుంచి రూ.2.30 లక్షల మధ్య ఉంది.

Royal Enfield Goan Classic 350 Design

రాబోయే గోవాన్ క్లాసిక్ 350‌ ధర రూ. 2.15 లక్షలుగా ఉండవచ్చని తెలుస్తోంది. కంపెనీ ఇటీవలే కొత్త బేర్ 650 స్క్రాంబ్లర్‌ను విడుదల చేయగా, ఇప్పుడు 350 సీసీ గోవాన్‌ను నవంబర్ చివరలో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇది మార్కెట్లోకి విడుదల అయిన తరువాత క్లాసిక్ మోడల్ మాదిరిగా ఎక్కువగా అమ్మకాలను సాధిస్తుందని ఈ ఇంజిన్ విభాగంలో ఇతర కంపెనీలకు గట్టి పోటీ ఇస్తుందని కంపెనీ భావిస్తోంది.

More from DriveSpark

Article Published On: Thursday, November 14, 2024, 9:30 [IST]
English summary
Royal enfield goan classic 350 design launch and all top things
Read more on: #royal enfield #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+