రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 మైలేజీ దాని ప్రత్యర్థులు.. ఈ బైక్‌ని కొనాలని ఉందా? ముందు ఇవి తెలుసుకోండి!!
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 మోటార్ సైకిల్‌ని ఆ సంస్థ భారత్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ బైక్ ప్రకటన నుంచి దీనిపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ బైక్‌కి సంబంధించి లీకైన సమాచారం ప్రకారం అందరికీ అందుబాటు ధరలో తీసుకువస్తున్నట్లు ప్రకటించడంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ రోజు జూలై 17న స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ బైక్‌లో లాంచ్ చేశారు. దీనిని కేవలం రూ.2.39 (ఎక్స్-షోరూమ్) లక్షల వద్ద భారత్‌లో లాంచ్ చేసింది. భారత్‌తో పాటు యూరప్‌లో ఆగస్టు నెల నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఈ బైక్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.
ఈ గెరిల్లా 450 రాకతో దేశంలో లభించే 3 కీలకమైన మోటార్ సైకిల్ మోడళ్లకు పోటీగా నిలువనుంది. ఈ బైక్ ఫీచర్లు ధర ఆధారంగా గెరిల్లా 450 ట్రయంఫ్ స్పీడ్ 400, హీరో మావ్రిక్ 440 మరియు హార్లే డేవిడ్సన్ X440 వంటి మోడళ్లకు గట్టి పోటీని ఇవ్వనుంది. ముఖ్యంగా ఈ విభాగంలో ఎక్కువగా సేల్ అవుతున్న ట్రయాంఫ్ స్పీడ్ 400 అమ్మకాలను ఈ బైక్ దెబ్బతీసే అవకాశం ఉంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన పాపులర్ బైక్ మోడళ్లలో ఒకటైన హిమాలయన్ ఆధారంగా రూపొందించబడింది. హిమాలయన్ 450లో వినియోగించిన ఇంజిన్‌నే ఈ గెరిల్లా 450లో ఉపయోగించారు. ఇది షెర్పా 452, సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ మోటారుతో పనిచేస్తుంది. అదే ఇంజిన్‌తో నడిచే ఈ బైక్ లీటరుకు 29.5 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఇది దాని ప్రత్యర్థుల కంటే కొంచెం తక్కువ మైలేజ్ సామర్థ్యం ఇస్తుంది.
ట్రయంఫ్ స్పీడ్ 400 ను 29.8 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని సర్టిఫై చేయబడింది. హీరో మావ్రిక్ 440 గరిష్టంగా లీటరుకు 30 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. హార్లే డేవిడ్సన్ X440 లీటర్ పెట్రోల్‌కి 35 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లాలో 11 లీటర్ల ఇంధన ట్యాంక్ కెపాసిటీని కలిగి ఉంది. దీనిని ఫుల్ ట్యాంక్ చేస్తే 324.5 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

ఈ మోటార్ సైకిల్ 8,000 rpm వద్ద 39.50 bhp శక్తిని మరియు 5,500 rpm వద్ద 40 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ ఇప్పటి వరకు ఉన్న బైక్స్ కంటే ప్రత్యేకమైన స్టైలింగ్‌తో వస్తుంది. ముఖ్యంగా మోడ్రన్, రెట్రో ఫీచర్లతో స్ట్రీట్ నేకెడ్ టైప్ బైక్‌గా కంపెనీ దీనిని సిద్ధం చేసింది.
ఇందులో వృత్తాకార హెడ్ లైట్, సర్క్యులర్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, వాటర్ డ్రాప్ ఆకారంలో ఉండే ఫ్యూయల్ ట్యాంక్, సింగిల్ పీస్ పొడవైన సీటు, చిన్న టెయిల్ ఎల్ఈడీ లైట్ ఉన్నాయి. ఈ బైక్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి అనలాగ్, డాష్ మరియు ఫ్లాష్ అనే వేరియంట్స్. ఈ మూడింటిలో ఫ్లాష్ అత్యంత టాప్ ఛాయిస్‌గా ఉంది. ఇది కొన్ని అదనపు కలర్ ఆప్షన్లను కూడా అందిస్తుంది.

డాష్ వేరియంట్‌లో హయ్యర్ లెవల్ టెస్ట్‌లో అందించే ఫీచర్లు ఉంటాయి. కేవలం కలర్ ఛాయిస్ కోసం రూ.5,000 ఎక్కువ ధరకు ప్లాష్ వేరియంట్‌ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అనలాగ్ ధర రూ.2.49 లక్షలు, డాష్ వేరియంట్ ధర రూ.2.49 లక్షలు, ప్లాష్ వేరియంట్ ధర 2.54 లక్షలుగా ఉంది. అన్ని ఎక్స్ షోరూమ్ ధరలు మాత్రమే. ఈ బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ కంటే కాస్త ఢిపరెంట్‌గా ఉండనుంది.


Click it and Unblock the Notifications








