రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి కొత్త బైక్‌.. జూలై 17న మార్కెట్‌లోకి.. ఇదిగో వివరాలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఏదైనా కొత్త బైక్‌ మార్కెట్‌లోకి వస్తుందంటే చాలు ఫ్యాన్స్‌ ఎగిరి గంతేస్తారు. కొత్త కొత్త అప్‌డేట్స్‌తో అభిమానులను ఉత్సాహా పరిచేందుకు ఆ సంస్థ బైక్స్‌ని మార్కెట్‌లోకి తీసుకువస్తుంది. ఆ కంపెనీ నుంచి త్వరలో రాబోయే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ "గెరిల్లా" 450 మోటార్ సైకిల్‌కి సంబంధించి కీలక అప్‌డేట్‌ని అందించింది. ముఖ్యంగా చాలా మంది ద్విచక్ర వాహన ప్రియులు ఈ బైక్ లాంచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ బైక్ లాంచ్ తేదీ వివరాలను ఆ సంస్థ తాజాగా వెల్లడించింది. జూలై 17న ఈ బైక్ అధికారికంగా భారత్‌లో విడుదల చేయనున్నారు.

ఈ విషయాన్ని మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ లాల్, సీఈఓ గోవిందరాజన్ బాలకృష్ణన్ అధికారికంగా ప్రకటించారు. కొత్త బైక్ ఫోటోను కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. కొత్త గెరిల్లా బైక్ హిమాలయన్ 450 నుంచి చాలా భాగాలు మరియు ఇంజిన్లను పంచుకుంటుంది. ఇది కంపెనీ ఎంట్రీ లెవల్ మోటార్ సైకిల్ హంటర్ 350 కంటే కొంచెం ఎక్కువ ప్రీమియం మరియు మరింత శక్తివంతమైన పర్ఫామెన్స్‌ని కలిగి ఉంటుంది.

Royal-Enfield-Guerrilla-450-Bike-Launch

గెరిల్లా 450 బైక్ సంప్రదాయ టెలిస్కోపిక్ ఫోర్క్స్‌తో వస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బైక్ ధరను కొంచెం తక్కువగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్‌ గెరిల్లా అద్భుతమైన ధరలో అమ్మకానికి వస్తుందని భావిస్తున్నారు. ఈ బైక్‌ దాని ప్రధాన ప్రత్యర్థి అయిన ట్రయంఫ్ స్పీడ్ 400 కంటే చాలా చౌకగా ఉంటుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

లీకైన ఫొటోల ప్రకారం సింగిల్ పాడ్ ఇన్‌స్ట్రూమెంట్ కన్సోల్, రౌండ్‌ ఎల్‌ఈడీ హెడ్ లైట్, సింగిల్ పీస్ సీటు ఉన్నాయి. ఈ బైక్ లో 452 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ డీఓహెచ్‌సీ ఇంజిన్ కలదు. ఇది 8,000 rpm వద్ద 40.02 ps గరిష్ట శక్తిని మరియు 5,500 rpm వద్ద 40 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

Royal-Enfield-Guerrilla-450-Bike-Launch

ఈ బైక్ స్లిప్పర్ మరియు అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ ట్రాన్స్ మిషన్‌తో జతచేయబడుతుంది. ఇందులో 17 అంగుళాల బ్లాక్ అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో ఆఫ్ సెట్ మోనోషాక్ మరియు క్లోస్డ్‌ వీల్ బేస్ ఉన్నాయి. స్ప్లిట్ సీట్లు, మల్టిపుల్ రైడ్ మోడ్స్, సర్క్యూలర్ మిర్రర్స్, ఫ్లోటింగ్ స్టైల్ సర్క్యులర్ TFT క్లస్టర్, వెడల్పాటి హ్యాండిల్ బార్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

రాయల్ ఎన్ ఫీల్డ్ గెరిల్లా హిమాలయన్ బైక్ కంటే తేలికగా ఉంటుంది. కాబట్టి ఈ బైక్‌ని హ్యాండిల్ చేయడం చాలా సులభం. ఫ్యూయల్ ట్యాంక్ మరియు బైక్‌ వెనుక భాగం పూర్తిగా హిమాలయన్ 450ని పోలి ఉంటాయి. అయితే హిమాలయన్ మాదిరిగా కాకుండా ఇది కొత్త అల్లాయ్ వీల్స్ మరియు ట్యూబ్ లెస్ టైర్లను కలిగి ఉంది.

ఒక్కసారి మార్కెట్‌లోకి విడుదల అయ్యాక ఈ బైక్‌ ఈ సెగ్మెంట్‌లోని ఇతర కంపెనీల బైక్స్‌కి గట్టి పోటీని ఇవ్వనుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను కంపెనీ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. జూలై 17న మార్కెట్‌లోకి వచ్చే ఈ బైక్‌ విడుదల కోసం యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం విడుదల తేదీతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, June 29, 2024, 14:44 [IST]
English summary
Royal enfield guerrilla 450 will be launching on july 17 confirmed by ceo and md
Read more on: #royal enfield #bikes #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+