రేపే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కొత్త బైక్‌ విడుదల.. ఈ బైక్‌ చాలా స్పెషల్‌ గురూ!!

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ గెరిల్లా 450 రేపు (జూలై 17)న అధికారికంగా భారత్‌లో లాంచ్‌ కానుంది. 2024 లోనే కంపెనీ నుంచి వస్తున్న అతిపెద్ద లాంచ్‌గా ఈ బైక్‌ ఉంది. ఈ బైక్ గురించి స్టైలింగ్, పెర్ఫార్మెన్స్ ఫిగర్స్ ఇతర అంశాలపై వివరాలు ఇంకా తెలియ రాలేదు. వీటికోసం ఇంకో రోజు ఆగాల్సి ఉంది. ఈ గెరిల్లా 450 ధర ఎలా ఉండనుంది అనే దానిపై స్పష్టత వచ్చే వరకు ఈ బైక్‌కి కోసం ఎదురుచూసే వారికి ఆసక్తి నెలకొంటుంది. ఈ బైక్ ప్రధాన ప్రత్యక్ష ప్రత్యర్థిగా ట్రయంఫ్ స్పీడ్ 400 ఉండనుంది. రేపు విడుదల కాబోయే ఈ బైక్‌లో ఎటువంటి ఫీచర్లు, ఫర్ఫామెన్స్‌ ఉండే అవకాశం ఉందో ఈ కథనంలో తెలుసుకుందాం..

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 బైకు ఆధారంగా ఈ బైక్‌ని రూపొందించారు. గెరిల్లా 450 ఈ బైక్‌తో కీలకమైన భాగాలను పంచుకుంటుంది. ముఖ్యంగా ఈ రెండు బైక్ మోడళ్లు ఇంజిన్ పరంగా ఒకేలా ఉంటాయని చెబుతున్నారు. హిమాలయన్ 450 బైక్‌లో 452 సీసీ లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ డీఓహెచ్‌సీ ఇంజిన్‌ని అమర్చారు.

Royal-Enfield-Guerrilla-450-Launch

ఈ ఇంజిన్ గరిష్టంగా 40.02 bhp పవర్ మరియు 40 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌ ముఖ్యంగా 450 హిమాలయన్ 450 ప్లాట్‌ఫామ్‌తో నిర్మించబడినప్పటికీ USD ఫోర్క్స్‌ మరియు ఖరీదైన సియట్ టైర్లు వంటి కొన్ని ఖరీదైన భాగాలను ఉండకపోవచ్చు. ఈ బైక్‌ అందరికీ అందుబాటులో తెచ్చే క్రమంలో ఖర్చులను అదుపులో ఉంచడానికి ఈ అంశాలను పక్కన పెట్టినట్లు తెలుస్తుంది.

ఈ గెరిల్లా 450 పూర్తిగా అర్బన్‌ మోటారుసైకిల్‌ లవర్స్‌ని ఆకర్షించడానికి ఉద్దేశించినదిగా ఉండనుంది. దీంతో ఈ బైక్‌ అమ్మకాలు కూడా అంతే పరిమాణంలో ఉండే అవకాశం ఉంది. దీని ధర కూడా ఇతర రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్స్‌తో పోలిస్తే సరసమైన ధరలో ఉంటుందని భావిస్తున్నారు. ధరను బట్టి రెస్పాన్స్‌ ఉండే అవకాశం ఉంది.

Royal-Enfield-Guerrilla-450

ఈ బైక్‌లో 17 అంగుళాల బ్లాక్ అల్లాయ్ వీల్స్, రియర్ సస్పెన్షన్ కోసం ఆఫ్ సెట్ మోనోషాక్ మరియు ఇరుకైన వీల్ బేస్ ఉండనున్నాయి. ఇంకా సింగిల్ పీస్ సీటింగ్, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్, రైడ్ బై వైర్ త్రోటెల్, సర్క్యూలర్‌ మిర్రర్స్, ఎల్ఈడీ హెడ్‌లైట్స్‌, ఫ్లోటింగ్ స్టైల్ సర్క్యూలర్‌ టీఎఫ్‌టీ క్లస్టర్, వైడ్ హ్యాండిల్‌బార్‌, ఎగ్జాస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ బైక్ రాక భారతదేశంలో విక్రయించబడుతున్న చౌకైన ట్రయంఫ్ స్పీడ్ 400 మోడల్‌కి పోటీగా ఉంటుంది. ఈ మోటార్ సైకిల్ బజాజ్ మరియు ట్రయంఫ్ మధ్య జాయింట్ వెంచర్‌గా ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.2.33 లక్షలుగా ఉంది. గొరిల్లా 450 బైకులో 6-స్పీడ్ గేర్ బాక్స్ మరియు స్లిప్‌ అసిస్ట్ కలదు. ఈ బైక్ స్పెసిఫికేషన్లు రేపు అధికారికంగా తెలియనున్నాయి.

Royal-Enfield-Guerrilla-Bikes

అయితే గెరిల్లా 450 ప్రారంభ ధర సుమారు రూ .2.3 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండే అవకాశం ఉంది. లీకైన చిత్రాల ప్రకారం ఈ బైక్ రెండు వేరియంట్లలో విక్రయించబడుతుందని స్పష్టమవుతోంది, టాప్-ఎండ్ వేరియంట్ టీఎఫ్‌టీ స్క్రీన్‌ని పొందుతుంది. ఇతర వేరియంట్‌లో నార్మల్‌ క్లస్టర్‌తో రానుంది.

ఇక ప్రస్తుతం హిమాలయన్ ప్రారంభ ధర రూ .2.85 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ రెండు బైకుల మధ్య సుమారు రూ.50,000 వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. అయితే రాయల్‌ ఎన్‌ఫీల్డ్ భవిష్యత్తులో మరో మూడు 450సీసీ మోటార్ సైకిళ్లను లాంచ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ బైక్‌ రాకతో మరోసారి మార్కెట్‌ని శాసించాలని రాయల్‌ ఎన్‌ఫీల్డ్ భావిస్తోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, July 16, 2024, 12:52 [IST]
English summary
Royal enfield guerrilla 450 will be launching tomorrow expected features and price details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+