బుల్లెట్ బండిలో డుగ్గు డగ్గు సౌండ్ బంద్.. కొత్త ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తుంది.. లాంచ్ ఎప్పుడంటే!
బైకుల రారాజుగా పేరున్న రాయల్ ఎన్‌ఫిల్డ్ నుంచి ఒక బైక్ విడుదల అవుతందనే వార్త వస్తే చాలు, దాని డిజైన్, ఫీచర్ల గురించి ఆన్‌లైన్‌లో తెగ వెతుకుంటారు. దేశంలో ఈ బైకులకు ఉన్న క్రేజీ ఇప్పటిది కాదు, గత దశాబ్ద కాలం నుంచి మొదలుకుని నేటి వరకు అన్ని వయస్సుల వారు రాయల్ ఎన్‌ఫిల్డ్ బైకులంటే బాగా ఇష్టపడుతుంటారు. ఇప్పటి వరకు కూడా పెట్రోల్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న బైకులను ఇప్పుడు కంపెనీ ఎలక్టిక్ వేరియంట్‌లలో తీసుకొస్తుంది. ప్రస్తుతం ఇండియా మార్కెట్లో ఈవీ బైకుల వాడకం ఎక్కువగా పెరుగుతున్న తరుణంలో ఈ విభాగంలో తన సత్తాను చాటడానికి రాయల్ ఎన్‌ఫిల్డ్ ఎలక్ట్రిక్ హిమాలయన్ ఎడిషన్ 2.0(Royal Enfield Himalayan Electric 2.0)ను త్వరలో మార్కెట్లోకి విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఈ బైకు కంపెనీకి ఎలక్ట్రిక్ విభాగంలో కీలకం కానుంది.
రాయల్ ఎన్‌ఫిల్డ్ ఎలక్ట్రిక్ హిమాలయన్ ఎడిషన్ 2.0ను తాజాగా ఆవిష్కరించింది. ఇది అడ్వెంచర్ తరహ లుక్‌ను కలిగి ఉంది. దీని డిజైన్ హిమాలయన్ 450 మాదిరిగా ఉంది. ఎత్తైన విండ్‌స్క్రీన్, రౌండ్ LED హెడ్‌లైట్లు, అదిరిపోయే టెయిల్ లైట్లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. కొన్ని ఫీచర్లు హిమాలయన్ 450లో ఉన్న వాటినే ఈ ఈవీ బైక్‌లో సైతం అందించారు. లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన బ్యాటరీని కూడా దీనిలో అమర్చారు.

ఇతర బైక్‌లతో పోలిస్తే ఈ బైక్ స్లిమ్ బాడీని కలిగి ఉంటుంది. సింగిల్ ఛార్జింగ్‌తో దాదాపు 100 నుంచి 160 కి.మీ వరకు ప్రయాణించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఛార్జింగ్ సమస్య ఎక్కువగా ఉత్పన్నమవుతున్న తరుణంలో దీనికి చెక్ పెడుతూ హిమాలయన్ ఎలక్ట్రిక్ బైకులో ఫాస్ట్ ఛార్జర్ సదుపాయాన్ని అందించే ఛాన్స్ ఉంది.
రోజు వారీ ప్రయాణాలతో పాటు ఎక్కువ దూరం ప్రయాణాలకు కూడా ఇది అనువుగా ఉంటుంది. అంచనాల ప్రకారం, ఇది భారత మార్కెట్లో రూ. 2.50-3 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేయబడుతుందని తెలుస్తుంది. అన్ని రకాల రోడ్లపై కూడా ఈ-బైక్ రయ్ మంటూ దూసుకుపోతుంది. సస్పెన్షన్ కూడా అత్యాధునికంగా ఉండనుంది
రన్నింగ్‌లో స్కిడ్ కాకుండా నిలిపివేయడానికి ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. అదనంగా డ్యూయల్-ఛానల్ ABS సిస్టమ్ రైడర్లకు మరింత రక్షణ అందిస్తుంది. సీటింగ్ కూడా మెత్తగా ఉంటుంది. ఎక్కువ దూరం రైడింగ్ చేసిన కూడా ఎలాంటి అలసట రాని విధంగా బైక్ డిజైన్ ఉంది. సీటు ఎత్తుగా, నిటారుగా ఉంటుంది. బంగారు-రంగు వైర్ స్పోక్ రిమ్స్, చంకీ స్వింగ్‌ఆర్మ్ కూడా చాలా అందంగా ఉన్నాయి.
గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే, కంపెనీ తన హిమాలయన్ వేరియంట్‌లో ఉన్న విధంగానే దీనిలో పొడవైన వీల్‌బేస్, టూరింగ్ యాక్సెసరీల కోసం మౌంటింగ్‌లను అమర్చారు. ఈ బైకును ఇటీవల జరిగిన ఒక ఈవెంట్‌లో ప్రదర్శించారు. అప్పటి నుంచి దీనికి సంబంధించిన ఫొటోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. దేశీయ ప్రజలను దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరలోనే లాంచ్ చేయడం ద్వారా ఏథర్, బజాజ్, ఓలా వంటి కంపెనీలకు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది.
ప్రస్తుత సమాచారం ప్రకారం స్పెయిన్‌లోని బార్సిలోనా నగరంలో తొలిసారిగా రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ టెస్ట్ రన్ పూర్తి చేశారు. ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసిన తర్వాత, రాయల్ ఎన్‌ఫీల్డ్ మరిన్ని మోడళ్లను తీసుకురావాలని చూస్తుంది. పెట్రోల్ విభాగంలోనే కాకుండా ఈవీ వెర్షన్‌లో కూడా ఆధిపత్యాన్ని సాధించడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. అత్యాధునిక ఫీచర్లతో వస్తున్న ఈ బైక్ సక్సెస్ అవుతుందని కంపెనీ చాలా ఆశలు పెట్టుకుంది.


Click it and Unblock the Notifications








