25 దేశాల్లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ రెంటల్స్‌ అండ్‌ టూర్స్‌ సర్వీస్‌.. RE ఫ్యాన్స్‌కు పండగే

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌(Royal Enfield) బైక్‌పై రైడ్‌ చేయాలనుకునేవారికి సంస్థ అదిరిపోయే న్యూస్‌ను తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ బైక్‌లను సంస్థ రెంటల్‌, టూర్ల విధానంలో పరిచయం చేసింది. ప్రపంచవ్యాప్తంగా 25 కంటే ఎక్కువ దేశాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ బైక్‌ల రెంటల్‌ విధానంపై పూర్తి సమాచారం ఈ కథనంలో..

రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానులకు సంస్థ బంపర్‌ ఆఫర్‌ను తీసుకువచ్చింది. గ్లోబల్ స్థాయిలో "రెంటల్స్ మరియు టూర్స్" సేవను ప్రారంభించింది. ప్రయాణికులకు వన్-స్టాప్ సొల్యూషన్ అందించడానికి, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఈ కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. కాగా ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో ఆర్‌ఈ బైక్‌ల రెంటల్‌ సర్వీస్‌ పైలట్‌ ప్రాజెక్టుకు మంచి ఆదరణ లభించడంతో సంస్థ గ్లోబల్‌ వ్యాప్తంగా "రెంటల్స్ అండ్ టూర్స్" ను ప్రారంభించింది.

Royal-Enfield-Global-Rentals-And-Tours

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ గ్లోబల్‌ 'రెంటల్స్‌ మరియు టూర్స్‌'(Royal Enfield Global Rentals And Tours) ప్లాట్‌ఫారమ్ ద్వారా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రైడర్లు కొత్త మోటార్‌సైకిల్‌ పనితీరును ఆస్వాదించవచ్చని సంస్థ భావిస్తోంది. సంస్థ నుంచి గుర్తింపు పొందిన భాగస్వాములతో ఈ ప్రోగ్రామ్‌ నిర్వహింపబడుతుంది. రైడర్లు.. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ రెంటల్‌ బైక్‌ల ద్వారా విభిన్నమైన రైడింగ్‌ మోడ్‌లను కూడా అనుభవించవచ్చు.

దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లతో రైడర్లకు మంచి అనుబంధం ఉందని రాయల్ ఎన్‌ఫీల్డ్ CEO బి గోవింద్రాజన్ అన్నారు. అడ్వెంచర్‌ ప్రియులకు చిరునామాగా ఉందని ఆయన పేర్కొన్నారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ రెంటల్స్ మరియు టూర్స్ ప్రోగ్రామ్ మోటార్‌సైకిల్ టూరిజం యొక్క లాజిస్టిక్స్‌ను సులభతరం చేస్తుందని వెల్లడించారు.

Royal-Enfield-Global-Rentals-And-Tours

ప్రపంచంలోని అతిపెద్ద మోటార్‌సైక్లింగ్ కమ్యూనిటీల్లో ఒకటైన, ఈ కార్యక్రమం రాయల్ ఎన్‌ఫీల్డ్(Royal Enfield Rentals) యొక్క గ్లోబల్ మోటార్‌సైక్లింగ్ కుటుంబాన్ని బలోపేతం చేస్తుందని గోవింద్రాజన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అడ్వెంచర్‌ రైడ్‌ల్లో సైతం రైడర్ల మధ్య స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగిస్తుందన్నారు.

కాగా రాయల్ ఎన్ఫీల్డ్ రెంటల్స్ మరియు టూర్‌ సర్వీస్‌లు.. దక్షిణాసియా, సౌత్ ఈస్ట్ ఆసియా, యూరప్ మరియు లాటిన్ అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. అద్దెలు మరియు పర్యటనల వివరాలను రాయల్ ఎన్‌ఫీల్డ్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి తెలుసుకోవచ్చు. మీ రైడ్‌ ప్లానింగ్‌, టైమింగ్‌ను సెలెక్ట్ చేసుకుని దానికి అనుగుణంగా మీరు బుకింగ్‌ చేసుకోవచ్చు.

Royal-Enfield-Global-Rentals-And-Tours

ఆ తర్వాత మీ బైక్‌ రైడ్‌ మరియు ప్రయాణ వివరాలను నిర్ధారించడానికి మరియు ఖరారు చేయడానికి టూర్ ఆపరేటర్ నుండి మీకు కాల్‌ వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇండియా, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, కొలంబియా, టర్కీ మరియు నమీబియా వంటి 32 గమ్యస్థానాలకు రాయల్ ఎన్‌ఫీల్డ్ రెంటల్స్ సేవలు విస్తరించి ఉన్నాయి. 25 దేశాల్లోని 52 గమ్యస్థానాలను కవర్ చేస్తూ మొత్తం 62 ట్రిప్‌లలో విభిన్న అనుభవాలను రైడర్‌లు ఆస్వాదించవచ్చు.

Royal-Enfield-Global-Rentals-And-Tours

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, April 19, 2024, 11:10 [IST]
English summary
Royal enfield introduces global rentals and tours available across 25 countries check full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+