Royal Enfield రెండు కొత్త కలర్ వేరియంట్లలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 బైక్.. ధర ఎంతంటే?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 మోటార్‌సైకిల్‌ను (Royal Enfield Bullet 350) రెండు కొత్త రంగుల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సంస్థ ప్రకటన చేసింది. దేశీయ మార్కెట్‌లోకి మిలిటరీ సిల్వర్ బ్లాక్, మిలిటరీ సిల్వర్ రెడ్ రంగుల్లో లభించనుంది. ఈ బైక్ ధర రూ.1.79 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉండనుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 బైక్ ఇప్పటికే మిలిటరీ బ్లాక్, మిలిటరీ రెడ్, స్టాండర్డ్ బ్లాక్, స్టాండర్డ్ మెరూన్, డ్యూయల్‌టోన్ బ్లాక్ గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉంది. బుల్లెట్ 350 బైక్ తాజా వెర్షన్ 2023 సెప్టెంబర్ లో మార్కెట్‌లోకి వచ్చింది. ప్రస్తుతం నాలుగు ఎడిషన్లలు కొత్త కలర్ ఆప్షన్‌లతో విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి.

మిలిటరీ సిల్వర్ బ్లాక్ మరియు మిలిటరీ సిల్వర్ రెడ్ వేరియంట్లు 349cc సింగిల్ సిలిండర్ OHC ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఎయిర్ లేదా ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజిన్ 20bhp శక్తి, 27Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.

ఈ మోటార్‌సైకిల్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్స్క్, వెనుకవైపు ట్విన్ షాక్ అబ్జార్బర్‌లను కలిగి ఉంది. మరియు సింగిల్ ఛానల్ ABS సిస్టమ్‌ను కలిగి ఉంటాయి. మరియు వెనుకవైపు డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంది. పాత కలర్ మోడళ్లతోపాటు కొత్త కలర్ వేరియంట్లు కూడా గణనీయమైన విక్రయాలను నమోదు చేస్తాయని సంస్థ భావిస్తోంది.
*దీంతోపాటు రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 మోటార్‌సైకిల్ డెలివరీలను సంస్థ ప్రారంభించింది. తొలి విడతగా 25 వాహనాలను (Royal Enfield Shotgun 650) డెలివరీ చేయనున్నట్లు తెలిపింది. లక్కీ డ్రా పద్ధతిలో వినియోగదారులను ఎంపిక చేస్తున్నారు. Motoverse ఈవెంట్‌లో పాల్గొన్నవారే ప్రస్తుతం బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొంది.

అయితే రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 మోటార్‌సైకిల్‌ను డెలివరీ చేసింది. లక్కీ్డ్రా పద్ధతిలో చండీగఢ్‌కు చెందిన వ్యక్తికి తొలి బైక్‌ను డెలివరీ చేశారు. ఈ బైక్ ఎంతో ఆకర్షణీయ డిజైన్ సహా ఆకట్టుకొనే పెయింట్‌ను కలిగి ఉంది. ఈ షాట్‌గన్ 650 ప్రత్యేక కలర్ ఎడిషన్ బైక్ ధర రూ.4.25 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంది. చండీగఢ్‌కు చెందిన వ్యక్తి రూ.4.91 లక్షల ఆన్‌రోడ్ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం.
షాట్‌గన్ 650 ఇంజిన్, పనితీరు : రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 మోటార్‌సైకిల్ 648cc పేర్లల్ ట్విన్ సిలిండర్ ఎయిర్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 46.4bhp శక్తి, 52.3 టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. అసిస్ట్ క్లచ్, ట్రాన్సిమిషన్ స్లిప్పర్‌ను కలిగి ఉంటుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








