దీపావళికి పేలిన బుల్లెట్‌ బాంబులు.. రికార్డు స్థాయిలో లక్షమంది లక్షణంగా కొనేశారు!

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ మార్కెట్‌లో దుమ్మురేపుతున్నాయి. ఆ కంపెనీ అక్టోబర్ 2024 లో ఏకంగా 1 లక్ష బైక్‌లను భారతీయ మార్కెట్‌లో విక్రయించి భారీ రికార్డును నెలకొల్పింది. సాధారణం కంటే భారీ మొత్తంలో అమ్మకాలు జరగడంతో కంపెనీ పెద్ద మొత్తంలో లాభాలను ఆర్జించింది. గత నెలలో ఏకంగా 1,10,574 బైకులను విక్రయించగా, వీటిలో 1,01,886 బైక్‌లను స్థానికంగా విక్రయించింది. మిగతా 8,688 బైక్‌లను విదేశాలకు ఎగుమతి చేసింది. 2023 అక్టోబర్‌లో విక్రయించిన 84,435 బైకులతో పోలిస్తే సేల్స్ 31 శాతం పెరిగాయి.

ఆగస్టులో కంపెనీ పనితీరుపై రాయల్ ఎన్‌ఫీల్డ్‌ సీఈఓ గోవిందరాజన్ హర్షం వ్యక్తం చేశారు. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ అక్టోబర్ ప్రత్యేకమని ఒకే నెలలో 1,00,000 అమ్మకాలతో రికార్డు సృష్టించడం భవిష్యత్తులో కంపెనీకి కలిసి వస్తుందని అన్నారు. అత్యంత ముఖ్యమైన పండుగ సీజన్ సేల్‌లో ఇదివరకే కంపెనీ పేరిట ఉన్న అమ్మకాల రికార్డులన్నింటినీ అధిగమించిందని ఆయన పేర్కొన్నారు.

Royal Enfield Motorcycles October 2024 Sales Report 2024

అదే సమయంలో విదేశాలకు ఎగుమతులు పెరగడం, ముఖ్యంగా సార్క్ (SAARC) దేశాలకు ఎన్‌ఫీల్డ్‌ ఉత్పత్తులను పంపిస్తుంది. ఈ విస్తరణలో భాగంగా గత నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ప్రొడక్ట్స్‌ని బంగ్లాదేశ్ మార్కెట్‌లో విడుదల చేసింది. గుమ్మిళ్లలో ప్రముఖ షోరూమ్‌ అలాగే ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ 2 కేటగిరీ ఫ్యాక్టరీ నుంచి సంవత్సరానికి 30,000 బైక్లను ఉత్పత్తి చేయగలదు.

అయితే దీని నిర్వహణ మొత్తం ఐఎఫ్ఏడీ మోటార్స్ (IFAD Motors) ద్వారా జరగనుంది. ఇందులో భాగంగా హంటర్ 350, మీటియోర్ 350, క్లాసిక్ 350, బుల్లెట్ 350 బైక్‌లను బంగ్లాదేశ్‌లో లాంచ్ చేయనున్నారు. బంగ్లాదేశ్‌లో తమ ప్రవేశంపై గోవిందరాజన్ మాట్లాడుతూ గత నెలలో మేము బంగ్లాదేశ్ మార్కెట్‌లో అరంగేట్రం చేశాము. అక్కడి రైడింగ్ కమ్యూనిటీ నుంచి మంచి స్వాగతం లభించడం ఆనందంగా ఉందన్నారు.

Royal Enfield Bear 650

ఇక్కడ మా కొత్త, ఇప్పటికే ఉన్న అన్ని బైకులు అమ్మకాలు జరుగతాయని స్పష్టం చేశారు. ఈ జోరును ఇలానే కొనసాగించే ప్రయత్నం చేస్తామని అన్నారు. ఇక ఇటీవలె రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బియర్ 650 బైక్‌ని ఆవిష్కరించింది. ఇంటర్ సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650, సూపర్ మీటియోర్ 650, షాట్ గన్ 650 తర్వాత 650సీసీ సెగ్మెంట్ లో ఇది 5వ మోడల్‌గా వస్తోంది.

దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇది ఇంటర్ సెప్టర్ 650తో ఛాసిస్, ఇంజిన్‌ని పంచుకుంటుంది. అయితే ప్రత్యేకత కోసం సస్పెన్షన్, వీల్స్‌ని అప్‌గ్రేడ్ చేసింది. ఈ బియర్‌ 650 ధర వివరాలను నవంబర్ 5న ఇటలీలోని ఈఐసీఎంఏలో విడుదల చేయనున్నారు. దీనిని ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్‌ చేసే అవకాశం ఉంది. ఇందుకోసం ఎన్‌ఫీల్డ్‌కి మంచి మార్కెట్‌ ఉన్న దేశాలపై ప్రత్యేక ఫోకస్‌ని పెట్టనుంది.

Royal Enfield Motorcycles October 2024 Sales

ప్రపంచ మోటార్ సైకిల్ మార్కెట్‌లో తమ స్థానాన్ని బలోపేతం చేసుకునేందుకు కొత్త ఉత్పత్తులను భారీ ఫీచర్లు, అప్‌గ్రేడ్స్‌తో తీసుకురానుంది. ఇటీవలి విదేశాల్లో సేల్స్ పెరగడం కూడా ఓ విధంగా ఆ సంస్థకు కలిసి రానుంది. ఇది దేశీయంగా, అంతర్జాతీయంగా ఎన్‌ఫీల్డ్‌ బైక్స్‌కి పెరుగుతున్న ఉనికిని స్పష్టం చేస్తున్నాయి. ఇక దేశంలోనూ ఒక్క నెలలోనే లక్షకు పైగా బైకులను విక్రయించడం కంపెనీ వృద్ధికి నిదర్శనం.

డ్రైవ్‌స్పార్క్ ఒపీనియన్: ఈ వృద్ధి కచ్చితంగా రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి భారీ విజయమనే చెప్పాలి. మార్కెట్‌లో BSA, జావా, ట్రయంఫ్‌ మోటార్‌సైకిల్స్‌ అమ్మకాలు ఈ సంస్థ దరిదాపుల్లోనూ లేవు. గత కొన్ని నెలల క్రితం వరకు సేల్స్‌ ఆశించినంతగా లేవు. అయితే అక్టోబర్‌లో మాత్రం కంపెనీ కుమ్మేసింది. ఇదే జోరు కొనసాగితే మళ్లీ డుగ్‌ డుగ్‌ బండ్లు దంచికొట్టే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Saturday, November 2, 2024, 12:43 [IST]
English summary
Royal enfield motorcycles october 2024 sales report and exports details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+