దుమ్ము రేపే కొత్త బైక్‌ను దింపుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్.. మార్కెట్లో వార్ అదిరిపోద్ది..! యూత్‌కు ఇక పండగే..
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకు ఇండియాలో మంచి క్రేజ్ ఉంటుంది. 350 సీసీ ఇంజిన్ నుంచి మొదలుకుని 650 సీసీ వరకు కూడా ఈ కంపెనీ నుంచి విడుదలయ్యే మోడళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. వీటిపై ప్రయాణిస్తుంటే ఆ రాజసం వేరే లెవల్. ముఖ్యంగా యూత్ ఎక్కువగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులను ఇష్టపడుతుంటారు. వీటి డిజైన్‌కు వారు అన్ని వయస్సుల వారు ఫిదా అవుతారు. కానీ యూత్ మాత్రం అధికంగా కొనుగోలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో వారి నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా కంపెనీ కొత్తగా స్క్రామ్ 440(scram 440) అనే బైక్‌ను త్వరలో ఇండియా మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఇటీవల వచ్చిన కొంత సమాచారం ప్రకారం, ఈ మోడల్ వచ్చే ఏడాది ప్రారంభంలో వినియోగదారుల కోసం అడుగుపెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ మోడల్ డిజైన్ యూత్‌తో పాటు ఇతర వయస్సుల వారిని సైతం ఆకట్టుకునేలా ఉంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి విడుదలయ్యే దాదాపు అన్ని మోడళ్లకు కస్టమర్ల నుంచి ఆదరణ లభిస్తుంది. ఈ నేపథ్యంలో స్క్రామ్ 440కి కూడా మంచి స్పందన వస్తుందని కంపెనీ అంచనాలు పెట్టుకుంది. ఇది 443 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఆప్షన్‌లో లభిస్తుంది. ఈ ఇంజిన్ 25.4 bhp పవర్, 34 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ను దీనిని జత చేశారు.

స్క్రామ్ 440 బాడీ బలంగా ఉంది. కఠినమైన వాతావరణ పరిస్థితులను సైతం ఇది తట్టుకుంటుంది. రోడ్లు సరిగ్గా లేని ఏరియాల్లో కూడా రైడర్లకు మెరుగైన రైడింగ్‌ను అందిస్తుంది. ఎత్తుపల్లాల ప్రాంతాల్లో రయ్ మంటూ దూసుకుపోతుంది. మెరుగైన సస్పెన్షన్ కోసం ముందు టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక మోనోషాక్ సెటప్‌ను ఇచ్చారు. ముందు వీల్ 19-అంగుళాలు, వెనుక వీల్ 17-అంగుళాలతో వస్తుంది. దీన్ని పాత హిమాలయన్ 411 ప్లాట్‌ఫారమ్ ఆధారంగా తీసుకొచ్చారు.
రైడింగ్ సమయంలో భద్రత గురించి కంపెనీ అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఇందుకోసం బ్రేకింగ్ సిస్టంను అధునాతనంగా ఇచ్చింది. స్క్రామ్ 440కు ముందు 300 మిమీ డిస్క్ బ్రేక్, వెనుక 240 మిమీ డిస్క్ బ్రేక్ సెటప్‌ను ప్రత్యేకంగా అమర్చారు. దీని వలన వేగంగా ప్రయాణిస్తున్న బైక్‌ను ఈజీగా కంట్రోల్ చేయవచ్చు. అదనంగా మరింత సేఫ్టీ కోసం డ్యూయల్-ఛానల్ ABS సిస్టంను కూడా అందించారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 440 ఫీచర్ల విషయానికి వస్తే, దీనిలో రౌండ్ LED హెడ్‌లైట్, ట్రిప్పర్ నావిగేషన్, సింగిల్ పాడ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ట్యూబ్‌లెస్ టైర్లు వంటివి ఉన్నాయి. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం 2025 మార్చిలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని తెలుస్తుంది. ధర విషయానికి వస్తే, రూ.2.10 లక్షల నుంచి రూ.2.20 లక్షల వరకు ఉండవచ్చు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఈ మోడల్‌లో మరిన్ని వేరియంట్లు ఉండే అవకాశం ఉంది. ఫీచర్స్‌ను బట్టి ధరల్లో కూడా మార్పులు ఉండవచ్చని తెలుస్తుంది. ఈ బైకు మార్కెట్లోకి విడుదల అయిన తరువాత ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400Xm జావా యెజ్డీ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. స్క్రామ్ 440 గురించిన మరిన్ని వివరాలు మరికొద్ది రోజుల్లో కంపెనీ వెల్లడించనుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








