అందరి చూపు వీటిపైనే.. కనివీని ఎరుగని రీతిలో ఈ బైక్స్‌నే కోరుకున్న జనాలు.. మెయిన్ టార్గెట్ క్లాసిక్‌ 350

బైకుల రారాజు రాయల్ ఎన్‌ఫీల్డ్ మోడళ్లకు దేశంలో భారీ డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా యువత ఈ కంపెనీ నుంచే వచ్చే మోడళ్లను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. దశాబ్ద కాలంగా రాయల్ ఎన్‌ఫిల్డ్ 350 సీసీ విభాగంలో ఇతర వాటి కంటే టాప్ ప్లేస్‌లో ఉంటుంది. ఇటీవల 650 సీసీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ ఇంజిన్ విభాగంలో కూడా పలు మోడళ్లను విడుదల చేస్తుంది. ఇదిలా ఉంటే కంపెనీ గత కొన్ని నెలలుగా విక్రయాల పరంగా మెరుగైన గణాంకాలను నమోదు చేస్తుంది. తాజా సమాచారం ప్రకారం, రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు 2024 అక్టోబర్ నెలలో భారీగా ఉన్నాయి. గతంలో కంటే ఈ సారి వినియోగదారుల నుంచి డిమాండ్ అధికంగా రావడంతో సేల్స్ పుంజుకున్నాయి. పండుగల సీజన్‌లో ఇచ్చిన తగ్గింపుల కారణంగా అమ్మకాలు బాగా పెరిగాయి.

ఇటీవల విడుదలైన డేటాను చూసినట్లయితే ఈ అక్టోబర్‌లో కంపెనీ మొత్తం 1,01,886 యూనిట్ల విక్రయాలను సాధించింది. ఇది గత ఏడాది(2023) అక్టోబర్ నెలలో జరిగిన అమ్మకాలతో పోలిస్తే ప్రస్తుతం 25.85 శాతం వృద్ధి. గత అక్టోబర్‌లో మొత్తం అమ్మకాలు 80,958 యూనిట్లుగా ఉన్నాయి. అలాగే, నెలవారీగా జరిగిన విక్రయాలను చూసినట్లయితే 2024 సెప్టెంబర్ నెలలో 79,326 యూనిట్లుగా ఉన్నాయి.

Royal Enfield October 2024 Sales Classic 350

కానీ అక్టోబర్ నెల వచ్చే సరికి ఇది 28.44 శాతం క్రమంగా పెరుగుదలను నమోదు చేసింది. నెల రోజుల వ్యవధిలోనే రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు లక్ష యూనిట్ల కంటే ఎక్కువ మైలురాయిని దాటడం కంపెనీ బైకులకు మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను తెలియజేస్తుంది. ప్రధానంగా అక్టోబర్‌లో దీపావళి పండుగ సీజన్‌లో ఇచ్చిన తగ్గింపులు, క్యాష్‌బ్యాక్‌లు, డిస్కౌంట్ల కారణంగా కస్టమర్లు ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకున్న నేపథ్యంలో అమ్మకాలు పెరిగాయి.

ముఖ్యంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350, హంటర్ 350, క్లాసిక్ 350 వంటి పలు మోడళ్లకు మంచి డిమాండ్ కనపడింది. చాలా మంది వినియోగదారులు వీటిని కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించారు. 650 సీసీ ఇంజిన్ కంటే కూడా 350 సీసీ ఇంజిన్‌ బైకులు ఈ నెలలో ఎక్కువ విక్రయాలను నమోదు చేశాయి. విడివిడిగా మోడళ్ల అమ్మకాలను చూసినట్లయితే అక్టోబర్‌లో క్లాసిక్ 350 టాప్ ప్లేస్‌లో నిలిచింది.

Royal Enfield October 2024 Sales Bullet 350

క్లాసిక్ 350 బైక్ మొత్తంగా ఈ ఏడాది అక్టోబర్‌ నెలలో 20.06 శాతం వృద్ధితో 38,297 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది గత ఏడాది(2023) ఇదే నెలలో 31,897 యూనిట్లుగా ఉంది. అదే 2024 సెప్టెంబర్‌లో 33,065 యూనిట్లతో పోలిస్తే 15.82 శాతం వృద్ధిని కనబరిచింది. ఈ మోడల్ తర్వాత బుల్లెట్ 350 అమ్మకాల పరంగా రెండో స్థానంలో నిలిచింది. అక్టోబర్‌లో దీని విక్రయాలు 22,419 యూనిట్లుగా ఉన్నాయి.

ఇది ఏడాది క్రితం అక్టోబర్‌లో జరిగిన విక్రయాలతో పోలిస్తే, ఇది 57.32 శాతం వృద్ధి. అదే నెల ప్రాతిపదికన చూసినట్లయితే సెప్టెంబర్‌ అమ్మకాలతో పోలిస్తే, ఇది 64.34 శాతం వృద్ధిని సాధించింది. అలాగే మరో మోడల్ హంటర్ 350 కూడా మెరుగైన అమ్మకాలను నమోదు చేసి మూడో స్థానంలో నిలిచింది. డేటా ప్రకారం, అక్టోబర్‌లో విక్రయాలు 21,350 యూనిట్లుగా ఉన్నాయి. ఇది గత ఏడాది ఇదే నెలలో 17,732 యూనిట్లు.

Royal Enfield October 2024 Sales Hunter 350

మొత్తంగా చూసినట్లయితే ఏడాది ప్రాతిపదికన వృద్ధి 20.40 శాతంగా ఉంది. అదే 2024 సెప్టెంబర్‌లో 17,406 యూనిట్లతో పోలిస్తే నెల ప్రాతిపదికన 22.66 శాతం పెరిగినట్లు డేటా చూపించింది. 350 సీసీ ఇంజిన్ సెగ్మెంట్‌లోనే కాకుండా 650 సీసీ బైకులు కూడా అక్టోబర్‌లో మెరుగ్గా అమ్ముడుపోయాయి. ప్రధానంగా కాంటినెంటల్ 650, ఇంటర్‌సెప్టర్ 650 మోడళ్లు ఎక్కువగా అమ్ముడుపోయాయి.

More from DriveSpark

Article Published On: Thursday, November 28, 2024, 15:55 [IST]
English summary
Royal enfield october 2024 sales report classic 350 has top place
Read more on: #royal enfield #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+