జనవరిలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ రికార్డ్‌ సేల్స్‌.. ఆ మోడల్‌ బైక్‌లనే ఎక్కువగా కొనేశారు.!!

కొత్త ఏడాదిలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లు తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించాయి. ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌(Royal Enfield) మోటార్‌ సైకిళ్లు అమ్ముడుపోయాయి. ఈ మేరకు 2023 జనవరి నెలలో ఈ యూత్‌ ఫేవరెట్‌ బైక్‌ల సేల్స్‌ రిపోర్ట్‌ వెల్లడైంది. మొత్తంగా 76,187 ద్విచక్ర వాహనాల విక్రయాలు జరిగాయి.

ఆటో మార్కెట్‌లో పరిచయం అక్కర్లేని పేరు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌. ఈ పేరు వింటేనే హుందాతనం, రాజసం గుర్తొస్తుంది. పేరుకు తగ్గట్టుగానే ఈ మోటార్‌ సైకిళ్ల డిజైన్‌ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ తమిళనాడు బ్రాండ్‌ బైక్‌లు.. మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ రైడర్ల ఫేవరెట్‌గా మారాయి. ముఖ్యంగా రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఇంజిన్‌ సౌండ్‌కు ఫిదా అవ్వని వారుండరు.

Royal-enfield-sales-In-January

దాదాపు 7 దశాబ్దాలుగా భారత మార్కెట్లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లు(Royal Enfield Bikes Sales January 2024) హవా కొనసాగిస్తున్నాయి. కాగా గత కొన్నేళ్లుగా RE మోడల్‌ బైక్‌లు రెట్రో లుక్‌తో అధునాతన ఫీచర్లతో లాంచ్‌ అయి యువ రైడర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా RE 350 సీసీ బైక్‌లను యూత్‌ ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు వెల్లడైంది.

ఇక విక్రయ గణాంకాల విషయానికొస్తే.. ఈ ఏడాది జనవరిలో డొమెస్టిక్‌, ఇంటర్నేషనల్‌ వ్యాప్తంగా మొత్తంగా 76,187 రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లు సేల్‌ అవడంతో మొదటి నెలకు విజయవంతంగా ముగింపు పలికింది. అయితే ఇందులో 70,556 బైక్‌లను దేశీయ మార్కెట్లో విక్రయించగా.. మిగిలిన 5,631 మోటార్‌సైకిళ్లను విదేశాలకు ఎగుమతి చేసింది.

Royal-enfield-classic-350-sales-In-January

గత ఏడాది జనవరి నెలతో పోలిస్తే 2023 జనవరిలో ఎగుమతులు తగ్గినప్పటికీ.. మొత్తం విక్రయాల్లో 2 శాతం వృద్ధిని నమోదు చేసింది. దేశీయంగా విక్రయించిన వాటితో పోలిస్తే గతేడాది కంటే 4 శాతం ఎక్కువ వృద్ధిని సాధించింది. ఇక నెలవారీగా చూస్తే దేశీయంగా గత జనవరి కంటే ఈ సారి 23 శాతం విక్రయాలు పెరిగాయి.

అయితే ఎగుమతుల పరంగా చూస్తే గతేడాది కంటే 20 శాతం తగ్గిపోగా.. 2022 జనవరితో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో 7. 63 శాతం పడిపోయాయి. కాగా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మొత్తం నాలుగు ఇంజిన్‌ స్పెసిఫికేషన్లలో మోటార్‌సైకిళ్లను విక్రయిస్తోంది. అవి.. 350cc, 411cc, 450cc, మరియు 650cc.

Royal-enfield-Himalayan-450-sales-In-January

కాగా ఈ జనవరిలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ విక్రయించిన మొత్తం మోటార్‌సైకిళ్లలో 350cc కేటగిరీనే అగ్రస్థానంలో ఉంది. మొత్తం 67,620.. 350cc యూనిట్లను విక్రయించి టాప్‌లో నిలిచింది. అయితే కంపెనీ గతేడాది జనవరిలో 68,183.. 350 సీసీ బైక్‌లను విక్రయించడంతో 1 శాతం క్షీణతను చూసింది.

Royal-enfield-Hunter-350-sales-In-January

ఇక 350cc కేటగిరీ పైన ఇంజిన్‌ బైక్‌ల విషయానికొస్తే.. గత జనవరిలో 6,563 యూనిట్లను విక్రయించింది. ఈ ఏడాది జనవరిలో 8,567 యూనిట్లను విక్రయించి 31 శాతం వృద్ధిని నమోదు చేసింది. దీని ద్వారా ఈ కేటగిరీ బైక్‌లు గణనీయమైన వృద్ధిని సాధించినట్లు తెలుస్తోంది.

Royal-enfield-Interceptor-650-sales-In-January

గత ఆరు నెలల్లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి మూడు కొత్త ఉత్పత్తులు ప్రారంభమయ్యాయి. గతేడాది సెప్టెంబరులో కొత్త జెన్‌ బుల్లెట్‌ 350(New Gen Bullet 350), నవంబర్‌లో హిమాలయన్‌ 450(Himalayan 450), జనవరిలో షాట్‌గన్‌ 650(Shotgun 650) బైక్‌లు విడుదలై.. యువ రైడర్ల నుంచి మంచి ఆదరణ పొందుతున్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, February 6, 2024, 19:22 [IST]
English summary
Royal enfield records 2 percent growth by selling 76 187 units in january 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+