రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 బైక్ విడుదల.. ఆకట్టుకొనే ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..!
రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 (Royal Enfield shotgun 650) భారత్ మార్కెట్‌లోకి అధికారికంగా విడుదల అయింది. ఇటీవల జరిగిన మోటోవర్స్ 2023లో ఈ మోటార్ సైకిల్‌ను ప్రదర్శించింది. ఈ కొత్త బైక్ సూపర్ మెటోర్ 650 క్రూయిజర్‌పైన ఆధారపడి ఉంది. మరియు ఈ బైక్ 648cc పేర్లల్ ట్విన్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 ధరలు : రాయల్ ఎన్‌ఫీల్ట్ షాట్‌గన్ 650 నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ బైక్ ప్రారంభ ధర రూ.3.59 లక్షలు (ఎక్స్‌షోరూం) గా ఉంది. షీట్‌మెటల్ గ్రే వేరియంట్ ధర రూ.3,59,30గా (ఎక్స్‌షోరూం) ఉంది. ప్లాస్మా బ్లూ మరియు గ్రీన్ డ్రిల్ ధర రూ.3,70,138 (ఎక్స్‌షోరూం) మరియు స్టేన్సిల్ వైట్ రూ.3,73,000 (ఎక్స్‌షోరూం) గా ఉంది.

ఆ మోటార్ సైకిళ్ల కంటే భిన్నం : ఈ మోటార్ సైకిల్ ఎక్కువగా సూపర్ మెటోర్ ప్లాట్‌ఫాంపై ఆధారపడి ఉన్నా.. కస్టమ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇప్పటి వరకు ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల కన్నా.. కొంచెం భిన్నంగా ఉంటుంది. ఈ బైక్ ప్రీమియం ఫీచర్లు, స్పేసిఫికేషన్లను కలిగి ఉంది. ప్రసిద్ధ కాన్సప్ట్ మోడల్ SG650 ఆధారంగా తయారుచేయబడింది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 ఇంజిన్, పనితీరు : రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 మోటార్‌సైకిల్ 648cc పేర్లల్ ట్విన్ సిలిండర్ ఎయిర్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 46.4bhp శక్తి, 52.3 టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. అసిస్ట్ క్లచ్, ట్రాన్సిమిషన్ స్లిప్పర్‌ను కలిగి ఉంటుంది.

డ్యూయల్ ఛానల్ ABS : ఈ మోటార్ సైకిల్ ముందువైపు 18 అంగుళాలు, వెనుకవైపు 17 అంగుళాల టైర్లను కలిగి ఉంటుంది. ఈ బైక్ అధిక వీల్‌బేస్‌తో వస్తుంది. ఈ బైక్ డ్యూయల్ ఛానల్ ABS సాయంతో 320mm ఫ్రంట్ డిస్క్, 300mm వెనుక డిస్క్ బ్రేకులను కలిగి ఉంటుంది. అలాగే USD ఫ్రంట్ ఫోర్క్ మరియు ట్విన్ స్ర్పింగ్‌ల ద్వారా నిర్వహించబడతాయి.
రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 కీలక ఫీచర్లు : దీంతోపాటు ఈ బైక్ ఆకర్షణీయంగా ఉంటుంది. లెదర్ సీట్లు, LED లైట్లు, ట్రిప్పర్ నావిగేషన్, మీడియం డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, USB ఛార్జింగ్ పోర్టు, సర్వీస్ రిమైండర్, బైక్ పెట్రోల్, ఇంజిన్ ఆయిల్ స్థాయిలను కూడా వెల్లడించే వింగ్‌మాన్ యాప్ ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








