రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ షాట్‌గన్‌ 650 మోటార్‌సైకిల్‌ డెలివరీలు ప్రారంభం.. తొలి బైక్‌ ఎవరికో తెలుసా?

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ షాట్‌గన్‌ 650 మోటార్‌సైకిల్‌ ఇటీవల భారత్‌లో విడుదల అయింది. తాజాగా ఈ బైక్‌ డెలివరీలను సంస్థ ప్రారంభించింది. తొలి విడతగా 25 వాహనాలను ( Royal Enfield Shotgun 650 ) డెలివరీ చేయనున్నట్లు తెలిపింది. లక్కీ డ్రా పద్ధతిలో వినియోగదారులను ఎంపిక చేస్తున్నారు. Motoverse ఈవెంట్‌లో పాల్గొన్నవారే ప్రస్తుతం బుకింగ్‌ చేసుకోవచ్చని పేర్కొంది.

అయితే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ షాట్‌గన్‌ 650 మోటార్‌సైకిల్‌ను డెలివరీ చేసింది. లక్కీ్డ్రా పద్ధతిలో చండీగఢ్‌కు చెందిన వ్యక్తికి తొలి బైక్‌ను డెలివరీ చేశారు. ఈ బైక్ ఎంతో ఆకర్షణీయ డిజైన్‌ సహా ఆకట్టుకొనే పెయింట్‌ను కలిగి ఉంది. ఈ షాట్‌గన్‌ 650 ప్రత్యేక కలర్‌ ఎడిషన్‌ బైక్ ధర రూ.4.25 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంది. చండీగఢ్‌కు చెందిన వ్యక్తి రూ.4.91 లక్షల ఆన్‌రోడ్‌ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

chandigarh man received first Royal Enfield Shotgun 650

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ షాట్‌గన్‌ 650 సాధారణ ధరలు : రాయల్‌ ఎన్‌ఫీల్ట్‌ షాట్‌గన్‌ 650 నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ బైక్‌ ప్రారంభ ధర రూ.3.59 లక్షలు (ఎక్స్‌షోరూం) గా ఉంది. షీట్‌మెటల్‌ గ్రే వేరియంట్ ధర రూ.3,59,30గా (ఎక్స్‌షోరూం) ఉంది. ప్లాస్మా బ్లూ మరియు గ్రీన్‌ డ్రిల్‌ ధర రూ.3,70,138 (ఎక్స్‌షోరూం) మరియు స్టేన్సిల్‌ వైట్‌ రూ.3,73,000 (ఎక్స్‌షోరూం) గా ఉంది.

షాట్‌గన్‌ 650 ఇంజిన్‌, పనితీరు : రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ షాట్‌గన్‌ 650 మోటార్‌సైకిల్ 648cc పేర్లల్‌ ట్విన్‌ సిలిండర్‌ ఎయిర్‌/ ఆయిల్ కూల్డ్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 46.4bhp శక్తి, 52.3 టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ 6-స్పీడ్‌ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. అసిస్ట్ క్లచ్‌, ట్రాన్సిమిషన్‌ స్లిప్పర్‌ను కలిగి ఉంటుంది.

Royal Enfield will deliver only 25 Shotgun 650 motorcycles in india

షాట్‌గన్‌ 650 బైక్ ముందువైపు 18 అంగుళాలు, వెనుకవైపు 17 అంగుళాల టైర్లను కలిగి ఉంటుంది. ఈ బైక్‌ అధిక వీల్‌బేస్‌తో వస్తుంది. ఈ బైక్‌ డ్యూయల్‌ ఛానల్‌ ABS సాయంతో 320mm ఫ్రంట్ డిస్క్‌, 300mm వెనుక డిస్క్‌ బ్రేకులను కలిగి ఉంటుంది. అలాగే USD ఫ్రంట్‌ ఫోర్క్‌ మరియు ట్విన్‌ స్ర్పింగ్‌ల ద్వారా నిర్వహించబడతాయి.

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ షాట్‌గన్‌ 650 కీలక ఫీచర్లు : రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ షాట్‌గన్‌ 650 మోటార్‌సైకిల్‌ ఆకర్షణీయంగా ఉంటుంది. లెదర్ సీట్లు, LED లైట్లు, ట్రిప్పర్‌ నావిగేషన్‌, మీడియం డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ కన్సోల్‌, USB ఛార్జింగ్‌ పోర్టు, సర్వీస్‌ రిమైండర్‌, బైక్‌ పెట్రోల్‌, ఇంజిన్‌ ఆయిల్‌ స్థాయిలను కూడా వెల్లడించే వింగ్‌మాన్‌ యాప్ ఉంది.

royal-enfield-shotgun-650

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Wednesday, January 24, 2024, 17:12 [IST]
English summary
Royal enfield shotgun 650 motorcycle deliveries started in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+