రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి సర్‌ప్రైజ్‌ బైక్‌ ఆవిష్కరణ.. డిజైన్‌ అదుర్స్‌, విడుదల ఎప్పుడంటే?

బుల్లెట్‌ ప్రియులకు ఎప్పటికప్పుడు దగ్గర అయ్యేందుకు రాయల్ ఎన్‌ఫీల్డ్‌ సరికొత్త మోటార్‌సైకిల్స్‌తో మార్కెట్‌లోకి వస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీకి జావా, యెజ్డీ, ట్రయంఫ్‌ మోటార్‌సైకిల్స్, BSA మోటార్‌సైకిల్స్‌ గట్టి పోటీని ఇస్తున్నాయి. దీంతో తమ కంపెనీకి ఉన్న ఫ్యాన్‌బేస్‌ని ఒడిసిపట్టుకునేందుకు ఎప్పటికప్పుడు నయా మోడల్స్‌తో మార్కెట్‌లో బైక్స్‌ని తీసుకువస్తుంది. తాజాగా గోవాలో జరుగుతున్న మోటోవర్స్ 2024 (Motoverse 2024)లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ స్క్రామ్ 440 (Royal Enfield Scram 440)ని ఆవిష్కరించింది. ఎప్పటినుంచో ఈ బైక్‌ రాక కోసం జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనికి బ్రేక్‌ పడింది. ఈ బైక్‌ మార్కెట్‌లో ఇతర రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్స్‌ కంటే మెరుగైన అప్‌గ్రేడ్స్‌తో రానుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ ఏడాది భారీ మొత్తంలో బైక్స్‌ని లాంచ్ చేసింది. పలు ఆటోమొబైల్ కంపెనీలకు పోటీగా తన కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీ ఇప్పుడు గోవాలో మోటోవెర్స్‌ ఈవెంట్‌ని నిర్వహిస్తోంది. ప్రతి ఏటా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇందులో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త ఉత్పత్తులను ప్రదర్శిస్తుంది లేదా కొత్త బైక్స్‌ని అమ్మకానికి అందుబాుటలో ఉంచుతుంది. ఈ సారి స్క్రామ్ 440ని ఆవిష్కరించింది. ఈ బైక్‌కి సంబంధించిన వివరాలు ఈ కథనంలో..

Royal Enfield Scram 440 Motorcycle

మూడేళ్ల క్రితం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న స్క్రామ్ 411ని ఈ స్క్రామ్ 440 బైక్‌ కొనసాగింపుగా రానుంది. ఈ బైక్‌ సరికొత్త స్టైలింగ్, కలర్ ఆప్షన్లతో వస్తుంది. ఈ స్క్రామ్ 440 మోటార్‌సైకిల్‌ 443 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 25.4 bhp పవర్, 34 nm గరిష్ట టార్క్‌ని విడుదల చేస్తుంది.

ఈ బైక్ ఇంజిన్‌ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. ఇంజిన్‌లో ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సెటప్ కూడా ఉంది. ఈ బైక్ ముందు భాగంలో 44 మిమీ టెలిస్కోపిక్ సస్పెన్షన్ సెటప్‌తో వస్తుంది. వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్‌ కలదు. ముందు190 mm వీల్‌, వెనుక 180 mm వీల్ ఉన్నాయి. 2165 మిమీ పొడవు, 840 మిమీ వెడల్పు, 1170 మిమీ ఎత్తుని కలిగి ఉంటుంది.

Royal Enfield Unveils Scram 440 Motorcycle Launch

ఈ బైక్ 1460 mm వీల్‌బేస్‌, 200 mm గ్రౌండ్ క్లియరెన్స్‌, 196 కిలోల బరువుతో వస్తుంది. బ్రేకింగ్‌ పరంగా డ్యూయల్ ఛానల్ ABS సిస్టమ్‌, ముందు భాగంలో 300 మిమీ డిస్క్, వెనుక భాగంలో 240 మిమీ డిస్క్ బ్రేక్స్‌ కూడా ఉన్నాయి. వీటిని బట్టి చూస్తే ఈ బైక్ ఫర్ఫామెన్స్‌ అదిరిపోనుంది. ఇతర రాయల్‌ ఎన్‌ఫీల్డ్ కంటె మెరుగైన రైడింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ని పొందవచ్చు.

ఈ బైక్‌లో నకిల్ గార్డ్స్, సింగిల్ పీస్ సీట్, సర్క్యూలర్ సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, సర్క్యూలర్ ఫుల్ LED హెడ్‌లైట్‌, సర్క్యూలర్ ORVMs, హాలోజెన్ టర్న్ ఇండికేటర్స్, డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్‌ కలవు. ఈ బైక్‌ని అన్ని విధాల అప్‌గ్రేడ్‌ చేసి తీసుకువస్తోంది. ఇది ఒక్కసారి మార్కెట్‌లోకి వచ్చాక దీని ఫర్ఫామెన్స్‌, ఇతర స్పెసిఫికేషన్స్‌పై పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది.

Royal Enfield Scram 440 Price

ఈ బైక్‌ ఫోర్స్ బ్లూ, ఫోర్స్ గ్రే, ఫోర్స్ టీల్, ట్రైల్ గ్రీన్, ట్రయిల్ బ్లూ అనే కలర్‌ ఆప్షన్స్‌లో లభిస్తుంది. అయితే ఈ బైక్ లాంచ్‌పై ఇంకా కచ్చితమైన సమాచారాన్ని ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ బైక్ 2025 ప్రథమార్థంలో అమ్మకానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ బైక్‌ ధరలు రూ.2.10 లక్షల నుంచి రూ.2.20 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Saturday, November 23, 2024, 13:52 [IST]
English summary
Royal enfield unveils new scram 440 in motoverse 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+