డుగ్ డుగ్ అంటూ దూసుకొస్తున్న బుల్లెట్ బైకులు.. మార్కెట్లో దండయాత్రకు సిద్దమైన బైకుల రారాజు

దేశంలో రాయల్ ఎన్‌ఫీల్డ్(Royal Enfield) బైకులంటే ఎంతో క్రేజ్ ఉంటుంది. బుల్లెట్(Bullet) బైకులపై డుగ్ డుగ్ అంటూ సౌండ్‌తో రోడ్లపై వెళ్తుంటే ఈ మజాయే వేరు. డిమాండ్‌ను బట్టి కంపెనీ కూడా ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు అనుగుణంగా కొత్త కొత్త మోడళ్లను లాంచ్ చేస్తూ మార్కెట్లో తన పట్టును సాధించడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే ఉన్న మోడళ్లకు అప్‌డేట్‌గా ఎన్‌ఫీల్డ్ త్వరలో మరిన్ని కొత్త బైకులను మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తుంది. వీటిలో 350 సీసీ(350 cc), 450 సీసీ(450 cc), 650 సీసీ(650 cc) వేరియంట్ల బైకులు ఉన్నాయి. ఇవి అత్యాధునిక ఫీచర్లతో వస్తున్నాయి. వీటిలో ఎలక్ట్రిక్ బైక్ సైతం ఉంది. రాబోయే రోజుల్లో ఇవి మార్కెట్లోకి వరుస బెట్టి విడుదల కానున్నాయి.

లగ్జరీ బైకులకు పేరుగాంచిన రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి కొత్త మోడల్స్ రాబోతున్నాయనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ముఖ్యంగా యూత్ ఎక్కువగా బుల్లెట్ కొత్త బైకుల గురించి ఆన్‌లైన్‌లో వెతుకుతున్నారు. వారి కోసం రాబోయే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకుల గురించి క్రింది కథనంలో ఇవ్వడం జరిగింది.

Royal Enfield Upcoming Motorcycles All Details

హిమాలయన్ ఎలక్ట్రిక్(Himalayan Electric కొత్త మోడల్): రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి పాపులర్ అయిన మోడల్ హిమాలయన్. ఇది 450 సీసీ ఇంజిన్ బైక్. ప్రస్తుతం ఇండియా మార్కెట్లో ఎలక్ట్రిక్ బైకులు ఎక్కువగా అమ్ముడు పోతున్న సమయంలో ఇదే సీసీలో హిమాలయన్ ఎలక్ట్రిక్ మోడల్‌ను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ముందస్తు సమాచారం ప్రకారం, ఇది మార్కెట్లోకి రావడానికి దాదాపు రెండు సంవత్సరాలు పట్టవచ్చు.

Royal Enfield Upcoming Motorcycles Himalayan Ev

ఇంటర్‌సెప్టర్ బేర్ 650 (Interceptor Bear 650 కొత్త మోడల్): రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ బేర్ నవంబర్ 5న విడుదల చేయడానికి షెడ్యూల్ చేశారు. 650సీసీ ఇంజిన్‌తో మార్కెట్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి రాబోతుంది. దీని లుక్ సూపర్‌గా ఉంటుంది. కస్టమర్లకు అవసరమైన అన్ని ఫీచర్లు దీనిలో ఉన్నాయి. ఈ బైకులో స్టాండర్డ్ టెలిస్కోపిక్ యూనిట్‌లతో పోలిస్తే మెకానికల్ అప్‌గ్రేడ్‌లు ముందు భాగంలో USD ఫోర్క్‌లు ఉన్నాయి.

ముందు హ్యాండిల్ భాగంలో వృత్తాకార TFT ట్రిప్పర్ డాష్, రైడ్ వివరాలు, పెట్రోల్ ఇండికేటర్, ఇతర అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా బ్లాక్ కలర్ వేరియంట్ గోల్డెన్ ఫినిషింగ్‌లో ఫోర్క్‌లు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. యూత్‌కు నచ్చే కలర్ వేరియంట్‌లలో ఇంటర్‌సెప్టర్ బేర్‌ను కంపెనీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది.

Royal Enfield Upcoming Motorcycles Bear 350

క్లాసిక్ 650 (Classic 650 కొత్త మోడల్): క్లాసిక్ 350 ప్రస్తుతం అత్యధికంగా అమ్ముడవుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌గా దేశంలో ప్రముఖ స్థానాన్ని సంపాదించింది. దీనికి అప్‌డేట్‌గా రాబోయే క్లాసిక్ 650 ఆకర్షణీయమైన డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లలో రాబోతుంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఆన్‌లైన్‌లో బాగా వైరల్ అవుతున్నాయి. 648 సీసీ సమాంతర-ట్విన్ ఇంజిన్‌కు 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు.

Royal Enfield Upcoming Motorcycles Classic 350

బుల్లెట్ 650(Bullet 650): రాయల్ ఎన్‌ఫీల్డ్ మోడల్స్‌లో బుల్లెట్ బైక్‌కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికే 350 సీసీ ఇండియాలో ఎక్కువగా అమ్ముడవుతున్న బైకులలో ముందు వరుసలో ఉంది. ఇప్పుడు ఇదే డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కంపెనీ బుల్లెట్ 650 సీసీ వేరియంట్‌ను త్వరలో తీసుకురాబోతుంది. ఇది 2025 ఏడాది మధ్యలో మార్కెట్లోకి వస్తుంది.

Royal Enfield Upcoming Motorcycles Bullet 350

హంటర్ 350 ఫేస్‌లిఫ్ట్(Hunter 350 facelift): రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులలో రెండవ అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా హంటర్ 350 ఉంది. దీనికి అప్‌డేట్ వెర్షన్‌గా ఫేస్‌లిఫ్ట్‌ను కొత్తగా తీసుకురాబోతుంది. కొత్త మోడల్ మెరుగైన LED హెడ్‌లైట్‌తో వస్తుంది. ఎత్తు పల్లాలు ఉన్న రోడ్లపై కూడా సాఫీగా దూసుకుపోవడానికి లేటెస్ట్ సస్పెన్షన్‌ను ముందు, వెనుక భాగంలో అమర్చారు. 349cc ఇంజిన్‌తో ఇది ఫెర్ఫామెన్స్ పరంగా అద్బుతంగా ఉంటుంది.

Royal Enfield Upcoming Motorcycles Hunter 350

వీటిలో పాటు, హిమాలయన్ 650 (Himalayan 650), హిమాలయన్ 450 ర్యాలీ(Himalayan 450 Rally),ఇంటర్‌సెప్టర్ 650(Interceptor 650), కాంటినెంటల్ GT 650 ఫేస్‌లిఫ్ట్‌(Continental GT 650 facelifts), మెటోర్ 350 ఫేస్ లిఫ్ట్ (Meteor 350 facelift), బుల్లెట్ 350 ఫేస్ లిఫ్ట్(Bullet 350 facelift) ఇవి కూడా మార్కెట్లోకి లాంచ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, November 1, 2024, 16:31 [IST]
English summary
Royal enfield upcoming bullet himayalayan classic hunter bikes all details
Read more on: #royal enfield #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+