Upcoming scooters in 2024 స్కూటర్‌ను కొనుగోలు చేస్తున్నారా.. త్వరలో విడుదల కానున్న మోడళ్లపై ఓ లుక్కేయండి..!

భారత్‌ ఆటోమొబైల్‌ మార్కెట్‌లోకి గత సంవత్సరం అనేక వాహనాలు విడుదల అయ్యాయి. ఇందులో ఎక్కువగా ద్విచక్రవాహనాలున్నాయి. ఈ సంవత్సరం కూడా అనేక స్కూటర్లు మార్కెట్‌లోకి (Upcoming scooters in 2024) విడుదల కానున్నాయి. ప్రస్తుతం యువత ఎక్కువగా స్కూటర్లు వినియోగించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సంవత్సరం పెట్రోల్‌ ఇంజిన్‌తో వచ్చే స్కూటర్ల జాబితా మీకోసం.

హీరో జూమ్‌ 160 : EICMA 2023లో హీరో సంస్థ తన తొలి ADV స్కూటర్‌ Hero Xoom 160 ని పరిచయం చేసింది. ప్రొడక్షన్‌ వెర్షన్‌ను ప్రదర్శనకు ఉంచింది. ఈ స్కూటర్‌ పొడవుగా ఉంటుంది. మరియు అడ్వెంచర్‌ స్కూటర్‌గా నిలుస్తుందని తెలుస్తోంది. ఈ స్కూటర్‌ 156cc సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. మరియు హీరో i3s టెక్నాలజీ వస్తుంది.

hero-xoom-160

అయితే ఈ ఇంజిన్‌ ఎంత శక్తిని ఉత్పత్తి చేస్తుందనే సమాచారాన్ని హీరో సంస్థ వెల్లడించలేదు. అయితే ఈ స్కూటర్ టెలిస్కోపిక్‌ ఫ్రంట్‌ ఫోర్క్‌ మరియు డ్యూయల్‌ రియర్‌ షాక్‌లను కలిగి ఉంటుంది. 14 అంగుళాల టైర్లతో ముందు, వెనుకవైపు డిస్క్‌ బ్రేకులతో వస్తుంది.

దీంతోపాటు LED లైటింగ్‌, స్మార్ట్‌ కీ, ఇగ్నిషన్‌ డయల్, ఇగ్నిషన్‌ రిమోట్‌ కీ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ హీరో జూమ్‌ 160 స్కూటర్‌ ధర రూ.1.20 లక్షల నుంచి రూ.1.30 లక్షలు (ఎక్స్‌షోరూం)గా ఉండే అవకాశం ఉంది. అయితే విడుదల తేదీపై సమాచారం లేదు.

 hero-xoom-125r

హీరో జూమ్‌ 125R : EICMA ఈవెంట్ 2023లో Hero Xoom 125Rను ప్రదర్శించింది. ఈ వాహనాన్ని భారత్‌లో అనేకసార్లు టెస్టింగ్‌ చేసింది. ఈ స్కూటర్‌ ఆకర్షణీయమైన డిజైన్‌, బాడీవర్క్‌తో ఏరోడైనమిక్‌ లుక్‌తో వస్తుంది. ఈ స్కూటర్‌ 125cc ఇంజిన్, CVT గేర్‌బాక్స్‌తో వస్తుంది. LED లైటింగ్, LED ఇండికేటర్లు, పుల్‌ డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ మరియు బ్లూటూత్‌ కనెక్టివిటీ మరియు టర్న్‌ బై టర్న్‌ నేవిగేషన్‌ను కలిగి ఉంటుంది.

TVS జుపిటర్‌ 125 క్లాసిక్ : ఈ TVS Jupiter 125 classic స్కూటర్‌ ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ స్కూటర్‌ ప్రీమియం సీట్‌ కవర్‌, LED హైడ్‌లైట్ వద్ద విజర్‌ను కలిగి ఉంటుంది. జూపిటర్‌ 125 స్కూటర్‌ 124.8cc సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్‌ 8.2bhp శక్తి, 10.5Nm గరిష్ట టార్క్‌ను కలిగి ఉంటుంది.

 tvs-jupiter-classic

Vespa : భారత్‌ మార్కెట్‌లో వెస్పా 125cc, 150cc ఇంజిన్‌ వేరియంట్లలో లభిస్తోంది. అయితే ప్రతి సంవత్సరం తన లైనప్‌ కోసం కొత్త రంగులు లేదా ప్రత్యేక ఎడిషన్‌లను పరిచయం చేస్తోంది. అయితే ఐకానిక్‌ డిజైన్‌ మాత్రం ఒకేలా ఉంటుంది. అయితే ఈ సంవత్సరం కూడా కొన్ని మార్పులతో వెస్పా విడుదల అయ్యే అవకాశం ఉంది.

యమహా NMAX 155 : ఇటీవల యమహా నుంచి ఏరోక్స్‌ విడుదల అయింది. త్వరలో యమహా నుంచి భారత్‌ మార్కెట్‌లోకి NMAX 155 స్కూటర్‌ను లాంచ్‌ చేయనుంది. Aerox మరియు NMAX రెండు స్కూటర్‌ కూడా 155cc సెగ్మెంట్‌కు చెందినవి. అయితే వేర్వేరు డిజైన్‌ను కలిగి ఉంటాయి. ఏరోక్స్‌ స్పోర్టియర్ లుక్‌తో లాంచ్‌ అయింది. అయితే NMAX మాత్రం కొంచెం పొడవుగా ఉంటుందని తెలుస్తోంది.

yamaha-nmax-155

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Wednesday, January 10, 2024, 12:06 [IST]
English summary
Scooters to be launched in india in 2024 here is the upcoming list
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+