ఇకపై ఎలక్ట్రిక్‌ వాహనాల్లో బ్యాటరీ, మోటార్‌ పేలిపోతుందనే భయం వద్దు.. 8 ఏళ్ల వారంటీని ప్రకటించిన ఫేమస్‌ కంపెనీ!

దేశంలో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలకు మారిపోతున్నారు. గత కొన్ని నెలలుగా ఈ సంఖ్య పెరుగుతోంది. అయితే దేశంలో జరిగే కొన్ని సంఘటనల వల్ల ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారు వెనుకడుగు వేస్తున్నారు. దీనికి ముఖ్య కారణం ఎలక్ట్రిక్ వాహనలు పేలిపోవడం లేదా కాలిపోవడం పెద్ద సమస్యగా ఉంది. దీంతో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనే ఆలోచనను విరమించుకుంటున్నారు. ముఖ్యంగా టూవీలర్స్‌లోని బ్యాటరీలు కాలిపోవడం వల్ల ఈ సమస్య ఉత్ఫన్నం అవుతుంది. కొంతమంది బ్యాటరీ ప్యాక్స్‌ లైఫ్‌స్టైల్‌ తగ్గిపోతుందని భయపడుతున్నారు. ఇది ఫర్ఫామెన్స్‌పై ప్రభావం చూపిస్తుందనే అపోహ కూడా ఉంది.

ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు మరింత భరోసా ఇచ్చేందుకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ ఎలక్ట్రిక్‌ టూవీలర్‌ సంస్థ ప్రత్యేక సంస్థ కార్యక్రమాన్ని ప్రకటించింది. సింపుల్‌ ఎనర్జీ తమ ఉత్పత్తుల్లో ఉపయోగించే బ్యాటరీతో పాటు ఎలక్ట్రిక్ మోటార్లపై 8 ఏళ్ల వారంటీ స్కీమ్‌ని ప్రకటించింది. ఇది కస్టమర్ల విశ్వాసాన్ని రెట్టింపు చేయనుంది.

Simple Energy

కర్ణాటకలోని బెంగళూరు కేంద్రంగా సింపుల్ ఎనర్జీ దేశీయంగా ఉత్పత్తులను విక్రయిస్తోంది. తాజాగా ఈ కంపెన లైనప్స్‌లోని అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లకు లాంగ్‌ టైమ్‌ వారంటీ స్కీమ్‌ని అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇది వినియోగదారులకు తమ ఉత్పత్తులపై నమ్మకాన్ని కల్పిస్తుందని కంపెనీ భావిస్తోంది. దీనివల్ల సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉందని సింపుల్‌ ఎనర్జీ యోచిస్తుంది. అలాగే అదే సమయంలో సింపుల్ ఎనర్జీ తమ ఉత్పత్తులను మరింత సురక్షితంగా తయారు చేసినట్లు తెలిపింది.

కంపెనీ ప్రకటించిన లాంగ్ టర్మ్ వారంటీలో భాగంగా సింపుల్‌ ప్రొటెక్షన్ అండ్ సింపుల్ సూపర్ ప్రొటెక్షన్ వారంటీ ప్లాన్‌ని ప్రకటించింది. ఇకపై కస్టమర్లు ఈ స్కూటర్ల కొనుగోలుపై 8 సంవత్సరాలు లేదా 60 వేల కిలోమీటర్ల వారంటీని అందిస్తుంది. బ్యాటరీ, ఎలక్ట్రిక్ మోటార్లపై ఇంత దీర్ఘకాలిక వారంటీని అందిస్తున్న దేశంలోని తొలి ఎలక్ట్రిక్‌ టూవీలర్‌ కంపెనీగా సింపుల్ ఎనర్జీ నిలిచింది.

Simple Energy 8 year warranty for battery and motor

ప్రస్తుతం సింపుల్ ఎనర్జీ తన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఉపయోగించే ఉత్పత్తులలో 95 శాతం సొంతంగా కంపెనీనే తయారు చేస్తుంది. అందుకు అనుగుణంగా బ్యాటరీ ప్యాక్‌ని కూడా కంపెనీ తయారు చేస్తుంది. బ్యాటరీ ప్యాక్ సేఫ్టీని నిర్ధారించడానికి కంపెనీ అదే 7 లెవల్‌ ప్రొటెక్షన్‌తో స్కూటర్లను ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా ఎలక్ట్రిక్ మోటారు కూడా ఎక్కువ పవర్‌ఫుల్‌గా పనిచేసేలా రూపొందించారు. ఈ నమ్మకంతోనే కంపెనీ సుదీర్ఘ వారంటీని ప్రకటించింది.

ప్రస్తుతానికి ఈ బ్రాండ్ కింద రెండు మోడళ్లు మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ఈ కంపెనీ నుంచి సింపుల్ వన్ (Simple One ELectric Scooter), సింపుల్ డాట్ వన్ (Simple Dot One ELectric Scooter) స్కూటర్లు కొనుగోలుకి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో సింపుల్ వన్ ధర రూ. 1.66 లక్షలుగా ఉంది. ఇది హై వేరియంట్‌గా ఉంది.

Simple Energy 8 year warranty for battery and motor

అదేవిధంగా సింపుల్ డాట్ వన్ ధర రూ. దీని ధర రూ.1.45 లక్షలు. ఇవన్నీ బెంగళూరులో ఎక్స్-షోరూమ్ ధరలు. సింపుల్‌ వన్‌ ఫుల్ ఛార్జ్‌పై 212 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. ఇందులో 5.0 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంది. మరోవైపు సింపుల్ డాట్ వన్ ఫుల్ ఛార్జ్ చేస్తే 151 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

డాట్‌ వన్‌ స్కూటర్‌లో కేవలం 3.7 కిలోవాట్ల చిన్న బ్యాటరీ ప్యాక్‌ని మాత్రమే వినియోగించారు. అదే సమయంలో ఎలక్ట్రిక్ మోటారు విషయానికి వస్తే రెండూ ఒకే 8.5 కిలోవాట్ల విద్యుత్ మోటారుతో వస్తాయి. ఇక సేల్స్ పెంచుకునేందుకు సింపుల్ ఎనర్జీ ప్రస్తుతం కస్టమర్లను ఆకర్షించే పనిలో ఉంది. అందులో భాగంగానే వారంటీ స్కీమ్‌ని ప్రకటించింది.

More from DriveSpark

Article Published On: Saturday, October 5, 2024, 11:22 [IST]
English summary
Simple energy announced 8 year warranty for battery and motor check details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+