బెంజ్ కారు కొన్న సోషల్ మీడియా సెన్సేషన్ 'కుషా కపిల'.. ధర తెలిస్తే షాకవుతారు!
సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు, క్రీడాకారులు మాత్రమే కాకుండా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, యూట్యూబర్స్ కూడా ఖరీదైన కార్లను కొనేస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగంగానే ఇటీవల ప్రముఖ యూట్యూబర్ 'కుషా కపిల' (Kusha Kapila) మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కారు కొనుగోలు చేసింది.
కుషా కపిల కేవలం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, యూట్యూబర్ మాత్రమే కాదు. ఈమె ఫ్యాషన్ ఎడిటర్ మరియు నటి కూడా. ఈమె ఇటీవల మెర్సిడెస్ బెంజ్ (Mercedes Benz) కంపెనీకి చెందిన ఈ-క్లాస్ కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఆటో హ్యాంగర్ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఇందులో కారు డెలివరీ, కేక్ కట్ చేయడం.. కారుకు పూజ చేయడం వంటివి చేయడం చూడవచ్చు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఇప్పటికే లెక్కకు మించిన వ్యూవ్స్, లైక్స్ పొందింది. కొత్త కారు కొన్న కుషా కపిలకు అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే కుషా కపిల కొనుగోలు చేసిన మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ ఏ వేరియంట్ అనేది ఖచ్చితంగా తెలియడం లేదు. అయితే ఇది చాలా అద్భుతమైన డిజైన్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంది.
మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ ధర రూ. 72.80 లక్షల నుంచి రూ. 84.90 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది. ఈ సెడాన్ ఎక్స్‌క్లూజివ్ మరియు ఎలైట్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. బెంజ్ ఈ-క్లాస్ సెడాన్ 2.0 లీటర్ డీజిల్ (192 Bhp పవర్, 400 Nm టార్క్) మరియు 3.0 లీటర్ డీజిల్ (285 Bhp పవర్, 600 Nm టార్క్) ఇంజిన్లను పొందుతుంది.

మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కూడా పొందుతుంది. ఇది 196 Bhp పవర్ మరియు 320 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అన్ని మోడల్స్ 9 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతాయి. రియర్ వీల్ డ్రైవ్ టెక్నాలజీ కలిగిన ఈ కారు గంటకు 240 కిమీ వేగాన్ని కలిగి ఉంటుంది. పనితీరుపరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది.
మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ సెడాన్ నాలుగు లేదా ఐదు మంది ప్రయాణికులు ప్రయాణించడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 3 జోన్ క్లైమేట్ కంట్రోల్, యంబియాంట్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్, 360 డిగ్రీ కెమెరా మరియు బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా.. మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, యాక్టివ్ బ్రేక్ అసిస్ట్ మొదలైనవి ఉన్నాయి. ఇవి వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి. ఈ సెడాన్ బీఎండబ్ల్యూ 5 సిరీస్ మరియు వోల్వో ఎస్90 మొదలైన వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








