మూడు కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్లను లాంచ్‌ చేసిన Sokudo.. వీటి ధరలు చూస్తే ఇప్పుడే కొనేస్తారు.!!

భారత మార్కెట్లోకి మరో మూడు కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్లు లాంచ్‌ అయ్యాయి. ఎకో ఫ్రెండ్లీ మొబిలిటీపై దృష్టి సారించిన ప్రముఖ ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ తయారీదారు సోకుడో ఎలక్ట్రిక్‌(Sokudo Electric) సంస్థ.. సెలెక్ట్‌ 2.2, ర్యాపిడ్‌ 2.2 మరియు ప్లస్‌ ఈవీలను విడుదల చేసింది. అతి తక్కువ ధరలో ఈ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. పూర్తి సమాచారం ఈ కథనంలో..

దేశంలో ఎలక్ట్రిక్‌ టూ వీలర్ల హవా కొనసాగుతోంది. ఐసీఈ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ప్రజలకు ఈవీలపై మొగ్గు చూపుతున్నారు. దీంతో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ సెగ్మెంట్‌లో తీవ్ర పోటీ నెలకొంటోంది. స్టార్టప్‌లతో పాటు ప్రముఖ ఆటో కంపెనీలతో సైతం ఈ సెగ్మెంట్‌లో సత్తా చాటుతున్నాయి. ఈ క్రమంలో మార్కెట్‌ వాటాను మెరుగుపరుస్తున్నాయి.

Sokudo-Electric-Scooters

ఈ క్రమంలో సోకుడో ఎలక్ట్రిక్‌ ఇండియా.. బడ్జెట్‌ ఫ్రెండ్లీ ధరలో స్ట్రాంగ్‌ స్కూటర్లను విడుదల చేయడం ద్వారా ఈవీ మార్కెట్లో కొత్త బెంచ్‌ మార్క్‌ను సెట్‌ చేస్తోంది. వీటిలో, రెండు మోడల్‌లు ఫాస్టర్ అడాప్షన్ మరియు ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ (FAME) II ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. Select 2.2, Rapid 2.2 వీటికి అనుగుణంగా ఉండగా.. Plus స్కూటర్‌ నానా ఆర్టీవో మోడల్‌..

మేక్ ఇన్ ఇండియాలో భాగంగా వచ్చిన ఈ కొత్త మోడల్‌లు FAME II కంప్లైంట్ మరియు స్మార్ట్ ఫైర్‌ప్రూఫ్ లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీలతో వస్తాయి. మరియు ఛార్జింగ్ కోసం 15-amp కన్వర్టర్‌ను కలిగి ఉంటాయి. పర్ఫామెన్స్‌, సేఫ్టీ పరంగా ఉన్నతమైన ఈ స్కూటర్‌లు అధిక రేంజ్‌ ఇవ్వడంతో నగర ప్రయాణాలకు అనుగుణంగా ఉంటాయి.

Sokudo-Electric-Select-2.2

కాగా Sokudo Electric India Plus ఇ స్కూటర్‌.. తక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. దీనిని RTO లో నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. భారత మార్కెట్‌కు అనుగుణంగా సంస్థ ఈ స్కూటర్లకు ధరలను నిర్ణయించింది. Sokudo Select 2.2 EV ధర రూ. 85,889.. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కి.మీల రేంజ్‌ను అందిస్తుందని సంస్థ చెబుతోంది.

ఇక Rapid 2.2 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 79,889 కాగా.. ఇది కూడా 100 కి.మీ రేంజ్‌ను క్లెయిమ్‌ చేస్తుందని సంస్థ తెలిపింది. ఇక నాన్-RTO మోడల్ Plus (లిథియం) EV స్కూటర్‌ ధర రూ. 59,889. ఈ స్కూటర్‌ 105 కి.మీ రేంజ్‌ను ఇస్తుందని సంస్థ వెల్లడించింది. ఇవన్నీ ఎక్స్‌-షోరూమ్‌ ధరలు.

Sokuda-Electric-Rapid-2.2

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు 3.5mm మరియు 5.25mm మధ్య మందంతో ABS ప్లాస్టిక్ బాడీలను కలిగి ఉంటాయి. రియల్‌ టైమ్‌ మానిటరింగ్‌ కోసం CANBUS కనెక్టర్‌లను కలిగి ఉన్నందున రైడర్లకు యాక్సెస్‌ కూడా చాలా సులభంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ స్కూటర్లపై కస్టమర్లు.. బ్యాటరీ ప్యాక్‌పై మూడేళ్ల వారంటీని మరియు వాహనంపై ఐదేళ్ల వారంటీని పొందవచ్చు.

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల లాంచ్‌పై సోకుడో ఎలక్ట్రిక్ ఇండియా వ్యవస్థాపకుడు మరియు CMD ప్రశాంత్ వశిష్ఠ హర్షం వ్యక్తం చేశారు. ప్రతి నెలా దేశవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది కస్టమర్లు నాన్‌ ఆర్టీవో ఎలక్ట్రిక్‌ స్కూటర్లను కొనుగోలు కోసం చూస్తున్నారని.. అయితే లిమిటెడ్‌ రేంజ్‌, తక్కువ వారంటీలతో సమస్య ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.

Sokudo-Electric-Plus

కానీ తమ కొత్త టూ వీలర్‌ మోడల్స్‌ ద్వారా సుదీర్ఘ వారంటీ, హై రేంజ్‌, సరసమైన ధరలో అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 2023లో అమ్మకాలలో 36 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు సోకుడో ఎలక్ట్రిక్ తెలిపింది. ప్రస్తుతం కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల పరిచయంతో తమ మార్కెట్ వాటాను 15 నుంచి 20 శాతానికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ తెలిపింది.

More from DriveSpark

Article Published On: Thursday, February 29, 2024, 14:20 [IST]
English summary
Sokudo electric india launches three new e scooters at affordable prices
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+