వేలంలో హీరో కరిజ్మా కొత్త బైక్‌.. 100 బైక్స్‌ మాత్రమే ఉన్నాయి.. దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసా?

హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) నుంచి వచ్చిన పాపులర్ మోటార్ సైకిళ్లలో కరిజ్మా XMR ఒకటి. ఈ సంస్థ నుంచి వచ్చిన సూపర్‌ హిట్‌ బైక్స్‌లో ఈ కరిజ్మా ఉంది. తాజాగా ఈ బైక్‌ సంబంధించి హీరో మోటోకార్ప్ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇప్పుడు ఈ కరిజ్మా మోటార్ సైకిల్ ప్రత్యేక వెర్షన్‌ని విడుదల చేస్తున్నట్లు కంపెనీ అధికారిక సోషల్‌ మీడియా ఖాతాలో వెల్లడించింది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు బ్రిజ్ మోహన్ లాల్ ముంజాల్‌కి నివాళిగా హీరో కరిజ్మా ప్రత్యేక ఎడిషన్‌ని తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. ఈ మోటార్ సైకిల్‌ని సీఈ001 (CE0001)గా కరిష్మా ఆధారిత లైనప్‌గా పేరు పెట్టింది. ఈ ప్రత్యేక ఎడిషన్‌ బైక్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..

ఈ సరికొత్త స్పెషల్‌ ఎడిషన్‌ బైక్‌ని సెంటినియల్ కలెక్టర్స్ ఎడిషన్ (Centennial Collector's edition model) మోటార్ సైకిల్‌గా పేర్కొంది. ఈ స్పెషల్ ఎడిషన్ కేవలం 100 యూనిట్లు మాత్రమే అమ్మకానికి పెట్టనుంది. అందువల్ల కేవలం 100 మంది మాత్రమే ఈ బైక్‌ని కొనుగోలు చేయగలరు. ఈ బైక్‌ సంబంధించి పూర్తి వివరాలను సంస్థ వెల్లడించలేదు. దీని రిజిస్ట్రేషన్‌ కోసం కూడా ఎటువంటి లింక్‌ని ఇవ్వలేదు.

Karizma-CE001-Special-Edition

అధికారిక వెబ్‌సైట్‌లోనూ ఈ బైక్‌కి సంబంధించి ఎటువంటి వివరాలను తెలియజేయలేదు. అయితే ఈ బైక్‌లను హీరో మోటోకార్ప్ వేలం ద్వారా విక్రయించనుంది. వేలం ప్రక్రియ ప్రారంభమైందని ప్రకటించింది. అయితే ఇందుకోసం అధికారిక సామాజిక మాధ్యమాలను ఫాలో కావాలని సూచించింది. బుకింగ్‌ లేదా వేలం కోసం ఓ వ్యక్తి కంపెనీ ఎక్స్ ఖాతాలో ప్రశ్నించగా.. ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఈ బైక్‌ని వేలం వేయనున్నట్లు ప్రకటించింది.

మరింత సమాచారం కోసం తమ సోషల్ మీడియా పేజీలకు కనెక్ట్ అవ్వాలని సూచించింది. కంపెనీ ప్రతిస్పందన ప్రకారం హీరో మోటోకార్ప్ తన స్పెషల్ ఎడిషన్ బైక్‌ని ప్రత్యేక ఈవెంట్ ద్వారా వేలం వేయనుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ బైక్ కరిష్మా ఆధారితమైనప్పటికీ, స్పెషల్ ఎడిషన్ అంతకంటే ఆకర్షణీయంగా కనిపించనుంది. ఈ బైక్ అనేక ప్రత్యేకమైన ఫీచర్లు మరియు ప్రత్యేక కలర్ గార్నిష్‌తో వస్తుంది.

Hero-Karizma-Ce001

కరిష్మా ఎక్స్ఎమ్ఆర్ కంటే ఈ బైక్‌ ధర అధికంగా ఉండనుంది. అందులోనూ వేలం కావడంతో ధర మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ బైక్ స్పెసిఫికేషన్లను హీరో ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. త్వరలోనే అన్ని కీలక వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. అదే సమయంలో, బైక్‌ని కార్బన్ ఫైబర్ ప్యానెల్ మరియు అక్రాపోవిక్ ఎగ్జాస్ట్‌తో అలంకరించారు.

ఇక కరిజ్మా XMR 210సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 25 bhp మరియు 20 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇక ఈ బైక్‌లో కార్బన్ ఫైబర్ వాడటం వల్ల దాని బరువు బాగా తగ్గుతుంది. ఈ బైక్ యొక్క పనితీరు సాధారణ కరిజ్మా కంటే కొంచెం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ బైక్‌ వేలం ధర వివరాలను కూడా కంపెనీ వెల్లడించలేదు.

Karizma-CE001-Special-Edition-Auction

వేలంలో బైక్ అమ్మకానికి వస్తున్న కారణంగా ప్రతి యూనిట్ వేర్వేరు ధరలకు విక్రయించబడుతుందని భావిస్తున్నారు. అదేవిధంగా ఈ బైక్‌ పూర్తిగా డిఫరెంట్ లుక్‌లో రోడ్డుపై దర్శనమిచ్చే అవకాశం ఉంది. అయితే కేవలం 100 యూనిట్లు మాత్రమే సిద్ధంగా ఉండటంతో కొనుగోలు చేసేందుకు తీవ్ర పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. తమ సంస్థ వ్యవస్థాపకుడి ఘనమైన నివాళి ఇచ్చేందుకు హీరో మోటోకార్ప్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, July 1, 2024, 14:06 [IST]
English summary
Special edition karizma ce001 auction begins only 100 units available full details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+