శ్రీవారు మోటార్స్ నుంచి ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. 250 కి.మీ రేంజ్, ఓలా రోడ్‌స్టర్ సిరీస్ బైక్స్‌కి చెక్!
కోయంబత్తూరు కేంద్రంగా శ్రీవారు మోటార్స్ (Srivaru Motors) సంస్థ పనిచేస్తుంది. ఆ కంపెనీ లైనప్‌లో ప్రాణా ఎలక్ట్రిక్ బైక్ అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉంది. దేశంలో ఈ కంపెనీ మోటార్‌సైకిల్స్ అత్యంత ప్రజాదరణ పొందాయి. ఈ బైక్‌ని ఇప్పుడు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి తీసుకువచ్చింది. ప్రాణా 2.0 (Prana 2.0) పేరుతో దీనిని అప్‌డేట్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 2,55,150గా నిర్ణయించారు. ఇది ఎక్స్-షోరూమ్ ధర మాత్రమే (చెన్నై). ఈ ఎలక్ట్రిక్ బైక్‌ని ఫుల్ ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఇటీవల లాంచ్ చేసిన ఓలా రోడ్‌స్టర్ సిరీస్ e-బైక్‌కి పోటీగా శ్రీవారు మోటార్స్ ఈ ఎలక్ట్రిక్ బైక్‌ని తీసుకువచ్చింది. ఈ వివరాలు మీకోసం..
మొత్తం 10,000 ప్రాణా 2.0 ఎలక్ట్రిక్ బైక్ యూనిట్లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. మన దేశంతో పాటు మలేషియా, సింగపూర్ సహా ఆసియా దేశాలకు కూడా ఎలక్ట్రిక్ బైక్‌ని ఎగుమతి చేయాలని కంపెనీ యోచిస్తోంది. 15 మిలియన్ల అమెరికన్ డాలర్ల పెట్టుబడితో ప్రారంభమైన ఈ సంస్థ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతుంది. ప్రాణా ఆ కంపెనీ నుంచి వచ్చిన మొదటి ప్రొడక్ట్‌గా ఉంది.

ప్రాణా బైక్‌ని 2021లోనే భారత్‌లో లాంచ్ చేసింది. శ్రీవారు మోటార్స్ దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుగా మార్కెట్‌లోకి వచ్చింది. ఇప్పుడు ఈ అప్‌డేటెడ్ బైక్‌ని లాంచ్ చేసింది. పూర్తి స్థాయిలో రీసెర్చ్, టెస్టింగ్ అనంతరం దీన్ని అమ్మకానికి పెట్టారు. గ్రాండ్, ఎలైట్ అనే రెండు వేరియంట్లలో ప్రాణా 2.0 ఎలక్ట్రిక్ బైక్‌లో లభిస్తుంది. ఇందులోని 5.0 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కలదు.
ఈ బ్యాటరీని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇది గంటకు 123 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో ఎలైట్ ప్రీమియం బైక్‌గా ఉంది. దీని ధర రూ.3.20 లక్షలుగా ఉంది. ఈ బైక్ ఎక్కువ రేంజ్ అందించడానికి 8.44 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంది. దీనిని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

ప్రాణా 2.0 ఎలక్ట్రిక్ బైక్ ఆధునిక సాంకేతిక ఫీచర్లను కలిగి ఉంది. జీపీఎస్ సదుపాయంతో కూడిన డిజిటల్ స్పీడోమీటర్ కలదు. ఇది కనెక్టెడ్ స్క్రీన్‌గా ఉంటుంది. సేఫ్టీ రైడ్ అనుభవం కోసం డిస్క్ బ్రేక్ అందించారు. దీని బ్యాటరీ ప్యాక్ స్టీల్ కేసింగ్‌లో ఉంచుతుంది. ప్రాణా 2.0లో నాలుగు రైడింగ్ మోడ్స్ (ప్రాక్టీస్, డ్రైవ్, స్పోర్ట్స్ అండ్ రివర్స్) కలవు. ఇందులో పార్కింగ్ అసిస్టెన్స్ కూడా ఉంది.
విదేశాల్లోనూ కంపెనీ సేల్స్‌ని రెట్టింపు చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగా దీనిని ఇతర ప్రపంచ దేశాలకు ఈ బైక్‌ని భారీ ఎత్తున ఎగుమతి చేయాలని చూస్తున్నారు. కోయంబత్తూరు సమీపంలోని సూలూరులో శ్రీవారి మోటార్స్ తయారీ ప్లాంట్ ఉంది. ఈ ప్లాంట్ నెలకు 2,000 యూనిట్ల వరకు ఉత్పత్తి చేయగలదు. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్‌ని తీర్చేలా కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








