జై శ్రీరామ్ పేరుతో హెల్మెట్.. ప్రత్యేక ఎడిషన్‌ని విడుదల చేసిన స్టీల్‌బర్డ్
అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని పురస్కరించుకుని హెల్మెట్ల తయారీ సంస్థ స్టీల్‌బర్డ్ వినూత్న హెల్మెట్‌ను విడుదల చేసింది. జై శ్రీరామ్ ఎడిషన్ SBH- 34(Jai Sree Ram Edition SBH-34) పేరుతో స్టీల్‌బర్డ్ హైటెక్ ఇండియా లిమిటెడ్ ప్రవేశపెట్టింది. పూర్తి సమాచారం ఈ కథనంలో..
మార్కెట్లో పోటీని తట్టుకోవాలంటే ట్రెండ్‌ను సెట్ చేయడం.. లేదంటే ట్రెండ్ ఫాలో అవ్వడం చాలా ముఖ్యం. అప్పుడే కస్టమర్ల దృష్టి వారిపై పడుతుంది. ఇప్పుడు ప్రముఖ హెల్మెట్ తయారీదారు స్టీల్‌బర్డ్ హైటెక్ ఇండియా లిమిటెడ్ కూడా ఇదే పని చేసింది. యావత్ భారతదేశం ప్రజల కలలను నెరవేరుస్తూ రెండు రోజుల క్రితం శ్రీరామ చంద్రుడు అయోధ్యలో కొలువుదీరాడు. అట్టహాసంగా ఈ వేడుక జరిగింది.

ఈ క్రమంలో భారత సాంస్కృతిక ప్రాముఖ్యతకు నివాళులర్పిస్తూ స్టీల్‌బర్డ్(Steelbird Hi Tech India Limited) అయోధ్య రామమందిరాన్ని ప్రతిబింబిస్తూ సరికొత్త హెల్మెట్‌ను విడుదల చేసింది. తన మార్కెట్‌ను మరింతగా విస్తరించడానికి స్టీల్‌బర్డ్ ఈ వినూత్న ప్రయోగాన్ని చేపట్టింది. అయోధ్య రామమందిరం, ఆ వాతావరణం ఉట్టిపడేలా హెల్మెట్‌ను డిజైన్ చేసింది.
జై శ్రీరామ్ ఎడిషన్ SBH-34 హెల్మెట్‌ను ఆవిష్కరించడంపై స్టీల్‌బర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ కపూర్ మాట్లాడారు. ఈ హెల్మెట్ కేవలం ఒక ఉత్పత్తి కాదని.. మన సాంస్కృతిక ధర్మానికి ప్రతిరూపమని వెల్లడించారు. హెల్మెట్‌పై ఉన్న రాముడు, అయోధ్య చిత్రాలు.. మన మనసుల్లో రామ భక్తిని సూచిస్తాయని పేర్కొన్నారు. సంప్రదాయం, భద్రత, స్టైల్.. ఇవన్నీ ఉండేలా కోరుకునే కస్టమర్లకు ఈ హెల్మెట్ అందుబాటులో ఉందని తెలిపారు.

కాగా SBH-34 జై శ్రీ రామ్ ఎడిషన్ రెండు రంగులలో అందుబాటులో ఉంటుంది. బోల్డ్ కుంకుమ, నలుపు కలర్‌లో ఒక మోడల్ అందుబాటులో ఉండగా.. మరొక మోడల్‌ను నలుపు, నారింజ డ్యూయల్ టోన్‌తో రూపొందించారు. రైడర్ల సౌలభ్యం మరియు రక్షణ కోసం థర్మోప్లాస్టిక్ షెల్‌తో దీనిని రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది. అంతే కాకుండా అధిక సాంద్రత కలిగిన EPSతో వస్తుందని తెలిపారు.
పాలికార్బోనేట్ యాంటీ-స్క్రాచ్ కోటెడ్ విజర్‌తో పాటు సరైన విజిబిలిటీ ద్వారా రోడ్డుపై రైడింగ్ చేసేటప్పుడు సేఫ్టీగా ఉంటుందని స్టీల్‌బర్డ్ తెలిపింది. భద్రతలో ఏ మాత్రం రాజీపడకుండా వివిధ వాతావరణ, కాంతి పరిస్థితులను సర్దుబాటు చేసేవిధంగా దీనిని రూపొందించినట్లు వెల్లడించింది. కాగా హెల్మెట్ మీడియం- 580 మి.మీ సైజులో అందుబాటులో ఉంటుంది. పెద్దది- 600 మి.మీ పరిమాణంలో కొనుగోలు చేయవచ్చు.

స్టీల్‌బర్డ్ SBH-34 జై శ్రీ రామ్ ఎడిషన్‌ను రూ. 1349 ప్రారంభ ధరతో స్టీల్‌బర్డ్(Steelbird) విడుదల చేసింది. అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుక జరిగిన పవిత్రమైన రోజు జనవరి 22న స్పెషల్ ఎడిషన్ హెల్మెట్‌ను సంస్థ విడుదల చేయడం ద్వారా.. తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకుంది. తద్వారా డిమాండ్ అధికంగా ఉంటుందని సంస్థ భావిస్తోంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








