ఇది మామూలు బండి కాదు బాబోయ్.. 18 ఏళ్ల నుంచి అందిరి ఫేవరెట్ మోడల్.. ఏకంగా 60 లక్షలు..
ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా (Suzuki Motorcycle India) భారత్‌లో రోజువారి ప్రయాణాలకు అవసరమయ్యే టూవీలర్లను తయారు చేయడంలో దిగ్గజ కంపెనీగా ఉంది. మార్కెట్లో పలు బైక్స్, స్కూటర్లను విక్రయిస్తుంది. ముఖ్యంగా సుజుకీ నుంచి విడుదలయ్యే మోడల్స్ చాలా వరకు మధ్యతరగతి వినియోగదారులకు అందుబాటు ధరలో లభించడంతో పాటు, మైలేజ్ కూడా అధికంగానే ఇస్తాయి. అందుకే చాలా మంది భారతీయ ప్రజల్లో సుజుకీ మోటార్ కంపెనీ అత్యంత నమ్మకమైన టూవీలర్ తయారీదారుగా పేరుంది. చాలా కాలంగా వినియోగదారులకు ఆకట్టుకునే మోడళ్లను విడుదల చేస్తూ ఈ కంపెనీ ఇతర టూవీలర్ తయారీదారులకు ప్రత్యర్థిగా నిలుస్తుంది. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా సుజుకీ అధిక సంఖ్యలో వాహనాలను తన ప్లాంట్లలో ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా సుజుకీకి చెందిన ఒక స్కూటర్ ఇండియాలో చాలా ఏళ్లుగా అత్యంత డిమాండ్ ఉన్న టూవీలర్‌గా నిలుస్తుంది.
ఆ మోడల్ పేరే 'సుజుకీ యాక్సెస్ 125 (Suzuki Access 125)'. ఈ స్కూటర్‌ను భారత్‌లో ఎక్కువ మంది వినియోగదారులు కొనుగోలు చేశారు. కంపెనీ చరిత్రలో ఈ మోడల్ అత్యంత డిమాండ్ ఉన్న స్కూటర్‌గా నిలిచింది. సుజుకీ సేల్స్ పెరగడానికి ఇది కీలకంగా ఉపయోగపడింది. దేశంలో ఎక్కువ మంది యాక్సెస్ 125ను ఎంచుకోవడంతో, కంపెనీ ఈ మోడల్‌ను భారీ సంఖ్యలో తన ప్లాంట్లలో ఉత్పత్తి చేసి కొత్త చరిత్ర సృష్టించింది.

తాజాగా సుజుకీ మోటార్ కంపెనీ డేటా ప్రకారం, యాక్సెస్ 125 స్కూటర్ ఇండియాలో లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 60 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేయబడ్డాయి. ఇది 2006లో విడుదల అయింది. అప్పటి నుంచి దీని డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. 18 ఏళ్లుగా ఇండియాలో ఈ మోడల్ సేల్స్ పరంగా మెరుగైన గణాంకాలను నమోదు చేస్తూనే ఉంది. సుజుకీ నుంచి సేల్స్ సాధించిన మోడళ్లలో టాప్ ప్లేస్‌లో ఉంటుంది.
సుజుకీ యాక్సెస్ 125 భారతీయ మార్కెట్లో అమ్మకానికి అందుబాటులో ఉండటంతో పాటు ఇతర దేశాల్లో విక్రయానికి ఉంది. అక్కడ కూడా ఎక్కువ మంది కస్టమర్లను ఆకట్టుకుని సేల్స్ పరంగా దూసుకుపోతోంది. చాలా మంది ఈ మోడల్‌ను కోరుకుంటుండంతో సుజుకీ మోటార్ దీని ఉత్పత్తిని పెంచింది. 2024 నవంబర్ నెలలో కూడా యాక్సెస్ 125 అమ్మకాలు మెరుగ్గా ఉన్నాయి. డేటా ప్రకారం, దీన్ని 54,118 మంది కొనుగోలు చేశారు.

అదే 2023 ఏడాది ఇదే నవంబర్ నెలలో అమ్మకాలు 52,512 యూనిట్లుగా ఉన్నాయి. ఇది ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే దాదాపు 3.06 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత 18 ఏళ్లుగా ఈ స్కూటర్ ప్రతి ఏడాది ట్రెండ్‌కు అనుగుణంగా అప్‌డేట్ అవుతూ మార్కెట్లోకి విడుదల అవుతూనే ఉంది. దీనిలో ఫీచర్లను ఎప్పటికప్పుడు ఆధునికంగా మారుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సుజుకీ యాక్సెస్ 125 లేటెస్ట్ ఫీచర్లతో ఉంది.
ఇండియా మార్కెట్లో ప్రారంభ ధర రూ.84,281కు ఉంది. అదే టాప్ వేరియంట్ రూ.95,381 వరకు ఉంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. దీని ఇంజిన్ విషయానికి వస్తే, 124సీసీ పెట్రోల్ ఆప్షన్‌లో లభిస్తుంది. లీటర్ పెట్రోల్‌కు దాదాపు 45 కి.మీల మైలేజ్ ఇస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 5 లీటర్ల వరకు ఉంటుంది. ఇది డిస్క్, డ్రమ్ బ్రేక్ ఆప్షన్‌లో లభిస్తుంది. ముందు టెలిస్కోపిక్ ఫోర్క్స్ సస్పెన్షన్ సెటప్ ఉంది.
సుజుకీ యాక్సెస్ 125 మెటాలిక్ మ్యాట్ బ్లాక్, మెటాలిక్ మ్యాట్ ప్లాటినం సిల్వర్, సాలిడ్ ఐస్ గ్రీన్ వంటి కలర్ వేరియంట్లలో లభిస్తుంది. ఇది సుజుకి రైడ్ కనెక్ట్, సెమీ-డిజిటల్ డిస్‌ప్లే వంటి వాటిని కలిగి ఉంటుంది. ఇది ఇండియాలో ప్రధానంగా హోండా యాక్టివా 125కు ప్రధాన పోటీ ఇస్తుంది.


Click it and Unblock the Notifications








