మార్కెట్‌లో మంచి స్కూటర్‌.. ఇప్పుడు ఎలక్ట్రిక్‌ వెర్షన్‌లో రాబోతుంది, విడుదల ఎప్పుడంటే?

గత కొన్ని నెలలుగా ఎలక్ట్రిక్‌ టూవీలర్‌ అమ్మాకాలు స్వింగ్‌లో ఉన్నాయి. సాంప్రదాయ పెట్రోల్‌ వెహికిల్స్‌తో పోల్చితే అమ్మకాల్లో ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో పేరొందిన టూవీలర్‌ సంస్థలు ఎలక్ట్రిక్‌ సెగ్మెంట్‌ ఉత్పత్తిపై దృష్టి సారిస్తున్నాయి. ఎలక్ట్రిక్‌ టూవీలర్స్‌లో స్కూటర్లకు ఎక్కువ డిమాండ్‌ ఉంది. ఈ మార్కెట్‌ని ఒడిసిపట్టునేందుకు స్కూటర్‌ విభాగంలో టాప్‌లో ఉన్న హోండా యాక్టివాను ఎలక్టిక్‌ వెర్షన్‌లో విడుదల చేసేందుకు సిద్దం అయ్యింది. ఈ స్కూటర్‌ ఇదే నెలలో మార్కెట్‌లో అడుగుపెట్టనుంది. తాజాగా మరో ఫేమస్ స్కూటర్‌ కూడా ఎలక్ట్రిక్‌ వెర్షన్‌లో రాబోతుంది. ఆ వివరాలు ఈ కథనంలో..

హోండా యాక్టివా వలె సుజుకి మోటార్ సైకిల్ ఇండియా నుంచి అందుబాటులో ఉన్న యాక్సెస్‌ 125 (Suzuki Access 125)కి ఫేమ్‌ ఉంది. ఈ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ నుంచి దేశీయ మార్కెట్‌లో ఎక్కువ సంఖ్యలో అమ్ముడవుతోంది. ఈ స్కూటర్‌ని 2025 నాటికి ఎలక్ట్రిక్ వెర్షన్‌లో విడుదల చేయాలని కంపెనీ యోచిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన స్కెచ్‌ వర్క్‌ కూడా పూర్తయినట్లు సమాచారం.

Suzuki Access 125 Electric Scooter

ఈ కొత్త సుజుకి యాక్సెస్ ఈవీ హోండా యాక్టివా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌కి గట్టి పోటీని ఇవ్వనుంది. హోండా యాక్టివా స్కూటర్‌ని మార్కెట్‌లో నవంబర్‌ 27న విడుదల చేయనున్నారు. సుజుకి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ విడుదలపై గత రెండేళ్లుగా కసరత్తు చేస్తోంది. తాజాగా దీనికి ఓ తుదిరూపు తెచ్చినట్లు సమాచారం. అన్ని కుదిరితే 2025 మధ్యలో లేదా ఏడాది చివర్లో ఈ స్కూటర్‌ని మార్కెట్‌లో ప్రవేశపెట్టనున్నారు.

దీంతో పాటు కంపెనీ నుంచి మరో ఫేమస్‌ స్కూటర్‌ బర్గ్‌మన్ స్ట్రీట్ స్కూటర్‌ని కూడా ఎలక్ట్రిక్ వెర్షన్‌లో విడుదల చేయాలని సుజుకి యోచిస్తున్నట్లు సమాచారం. దీనికంటే ముందు కొత్త సుజుకి యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల కానుంది. బర్గ్‌మన్‌ని కూడా 2025 లోనే లాంచ్ చేయనున్నారు. ఇక సుజుకి ఎక్స్-షోరూమ్ ధర రూ .1.20 లక్షలుగా ఉండే అవకాశం ఉంది.

Suzuki Access 125 Electric Scooter

ఇక హోండా యాక్టివా ఈవీ ఫీచర్లు, రేంజ్‌ ఇతర విషయాలకు సంబంధించిన అంశాలను టీజర్‌ల ద్వారా హోండా మోటార్‌సైకిల్‌ ఇండియా ప్రకటిస్తోంది. ఈ కొత్త యాక్టివా ఈవీ రూ .1 లక్ష నుండి రూ .1.20 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య లభిస్తుందని భావిస్తున్నారు. సుజుకి యాక్సెస్‌ కూడా ఇదే ధరతో అందుబాటులో ఉండనుంది. ఈ రెండు పెట్రోల్‌ వెర్షన్స్‌ మధ్య ఇప్పటికే తీవ్ర పోటీ ఉంది.

అదే విధంగా ఎలక్ట్రిక్ వెర్షన్స్‌లోనూ రెండు నేరుగా పోటీ పడనున్నాయి. హోండా యాక్టివా ఈవీ 1.3 కిలోవాట్ల డ్యూయల్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌తో వస్తుంది. ఇది ఫుల్ ఛార్జ్‌పై 104 కి.మీ రేంజ్‌ని అందించనుంది. దీనికి సంబంధించిన కొన్ని ఫీచర్లను హోండా ప్రకటించింది. ఎలక్ట్రిక్ స్కూటర్‌కి తగినట్లుగా ఇందులో ఫీచర్లను జోడించే అవకాశం ఉంది. సుజుకి యాక్సెస్‌లోనూ ఇటువంటి ఫీచర్లను అందించనున్నారు.

ఎలక్ట్రిక్‌ స్కూటర్ల మార్కెట్‌లో ప్రస్తుతం ఓలా ఈవీ, బజాజ్‌ ఆటో, టీవీఎస్‌, ఏథర్ ఎనర్జీ స్కూటర్లు టాప్‌ కొనసాగుతున్నాయి. ఒక్కసారి హోండా యాక్టివా మార్కెట్‌లో అడుగుపెట్టాక సీన్‌ పూర్తిగా మారే అవకాశం ఉంది. హోండా యాక్టివాకు ఉన్న ఫ్యాన్‌బేస్‌ ప్రత్యేకంగా మార్కెటింగ్‌ చేయాల్సిన అవసరాన్ని తగ్గించనుంది. సుజుకి యాక్సెస్‌కి సైతం ఇదే మంత్ర వర్తించనుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, November 19, 2024, 13:13 [IST]
English summary
Suzuki access 125 electric scooter launch in 2025 check expected price here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+