ఉత్పత్తిలో అరుదైన రికార్డ్.. సుజుకి మోటార్‌సైకిల్ అంటే మినిమమ్ ఉంటది!

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ 'సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా' ద్వి చక్ర వాహనాల ఉత్పత్తిలో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 1 మిలియన్ వాహనాలను ఉత్పత్తి చేసినట్లు ప్రకటించింది.

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ఇటీవల గురుగ్రామ్‌లోని SMIPL యొక్క ఖేర్కి ధౌలా ప్లాంట్ నుంచి 10లక్షల యూనిట్ 'సుజుకి యాక్సిస్ 125' స్కూటర్ విడుదల చేసింది. ఇప్పటికే సంస్థ అనుకున్న విధంగానే.. ఏడాదిలోపు ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకున్నట్లు సమాచారం. మార్కెట్లో కంపెనీ టూ వీలర్లకు డిమాండ్ పెరుగుతున్న కారణంగానే సంస్థ ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచింది.

Suzuki Motorcycle Achieves 10 Lakh Production Milestone

1 మిలియన్ యూనిట్ సుజుకి యాక్సిస్ 125 విడుదల సందర్భంగా సుజుకి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రజనీష్ కుమార్ మెహతా మాట్లాడుతూ.. భారతదేశంలో కంపెనీ ఉత్పతులకు మంచి ఆదరణ ఉందని, ఈ కారణంగానే ద్విచక్ర వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది, సంస్థ కూడా వినియోగదారులకు తమ ఉత్పత్తులను వేగంగా అందించడంలో భాగంగానే వాహనాలను వేగంగా తయారు చేస్తున్నర్లు వెల్లడించారు.

భారతదేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటైన సుజుకి మోటార్‌సైకిల్స్.. బజాజ్ ఆటో, టీవీఎస్ మోటర్స్ మరియు హీరో మోటోకార్ప్ వంటి పెద్ద కంపెనీలకు గట్టి పోటీ అందిస్తోంది. ఈ కంపెనీ సరసమైన ధరల వద్ద మాత్రమే కాకుండా అత్యంత ఖరీదైన సుజుకి హయబుసా, సుజుకి కటన వంటి బైకులను లాంచ్ చేసి మంచి అమ్మకాలను పొందుతోంది. ఇవి కంపెనీ యొక్క అత్యంత ఖరీదైన బైకులు కావడం విశేషం.

Suzuki Access 125

ఇప్పటికే సుజుకి లైనప్‌లో వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్, , జిక్సర్ ఎస్ఎఫ్ 250, జిక్సర్ 250 వంటి బైకులు.. యాక్సిస్ 125, అవెనిస్, బర్గ్‌మ్యాన్ స్ట్రీట్, బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ ఈఎక్స్ వంటి స్కూటర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా దేశంలో మంచి అమ్మకాలను పొందుతూ.. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూ ముందుకు దూసుకుపోతున్నాయి. అంతే కాకుండా కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను కూడా ప్రవేశపెడుతూనే ఉంది.

కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరంలో 1 మిలియన్ ద్విచక్ర వాహనాల ఉత్పత్తిని సాధించి.. ఉత్పత్తిలో ఓ రికార్డ్ సృష్టించింది. కాగా మొత్తం తన 16 సంవత్సరాల ప్రయాణం ఏకంగా 5 మిలియన్లకు చేరుకుంది. ఈ ఐదు మిలియన్ యూనిట్ కూడా ఖేర్కి ధౌలా ప్లాంట్ నుంచే బయటకు వచ్చింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ ఉత్పత్తిలో శరవేగంగా ముందుకు వెళ్తున్నట్లు స్పష్టమవుతోంది.

ఉత్పత్తిలో మాత్రమే కాకుండా కంపెనీ దేశీయ మార్కెట్లో 2024 జనవరిలో అత్యుత్తమ అమ్మకాలను పొందగలిగింది. జనవరిలో కంపెనీ మొత్తం 90వేల కంటే ఎక్కువ వాహనాలను విక్రయించి, అంతకు ముందు కంటే కూడా మంచి వృద్ధిని నమోదు చేయగలిగింది. కొత్తగా టూ వీలర్స్ కొనాలనుకునే కస్టమర్లు కూడా ఎక్కువమంది సుజుకి ఉత్పత్తులను చూస్తున్నారు. రానున్న రోజుల్లో కంపెనీ మరిన్ని కొత్త ఉత్పత్తులను, అప్డేటెడ్ ఉత్పత్తులను తీసుకు వస్తుందని భవిస్తున్నాము.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Thursday, February 29, 2024, 18:26 [IST]
English summary
Suzuki achieves 10 lakh production milestone in india fy 23 24
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+