రూ. 92వేలకే సుజుకి అవెనిస్ 125.. కొత్త కలర్ ఆప్షన్స్ కూడా..
వాహన ప్రియులు కొత్త వాహనాలను లేదా అప్డేటెడ్ వాహనాలను కోరుకుంటున్న తరుణంలో ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ 'సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా' (Suzuki Motorcycle India) సరికొత్త రంగులలో 'అవెనిస్ 125' స్కూటర్ లాంచ్ చేసింది. ఈ స్కూటర్ ధర రూ. 92000 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త కలర్ స్కూటర్ ఎన్ని రంగులలో లభిస్తోంది. డిజైన్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా? అప్డేటెడ్ ఫీచర్స్ ఏంటి? ఇంజిన్ వంటి మరిన్ని వివరాలను వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.
సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా లాంచ్ చేసిన అవెనిస్ 125 స్కూటర్ నాలుగు కొత్త కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. అవి పెర్ల్ మీరా రెడ్, ఛాంపియన్ ఎల్లో నెం 2, గ్లోసీ స్పార్కిల్ బ్లాక్ మరియు పెర్ల్ గ్లేసియర్ వైట్ కలర్స్. ఇవన్నీ చూడటానికి చాలా కొత్తగా అనిపిస్తాయి. అంతే కాకుండా ఈ కలర్స్ తప్పకుండా కస్టమర్లను మరింత ఆకర్షిస్తాయని తెలుస్తోంది.

చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్న ఈ స్కూటర్ డిజైన్ పరంగా ఎటువంటి అప్డేట్స్ పొందలేదు. అయితే చిన్న కాస్మొటిక్ అప్డేట్స్ గమనించవచ్చు. అదే హెడ్‌లాంప్, టెయిల్ లాంప్, స్టెప్ అప్ సీటు, టర్న్ ఇండికేటర్స్ మొదలైనవి చూడవచ్చు. ఇవన్నీ చూపరులను ఆకర్శించడంలో ఉపయోగపడతాయని తెలుస్తోంది. మొత్తం మీద కొత్త కలర్ సుజుకి అవెనిస్ చెప్పుకోదగ్గ అప్డేట్స్ పొందలేదని స్పష్టమవుతోంది.
ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ కొత్త కలర్ సుజుకి అవెనిస్ స్కూటర్ బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుతుంది. ఇది కాల్స్ స్వీకరించడానికి, రిజెక్ట్ చేయడానికి, ఎస్ఎమ్ఎస్ మరియు వాట్సాప్ అలర్ట్ వంటి వాటితో పాటు టర్న్ బై టర్న్ నావిగేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఈ స్కూటర్ సైడ్ స్టాండ్ కట్ ఆఫ్, USB ఛార్జింగ్ సాకెట్ మరియు కాంబి బ్రేకింగ్ కూడా పొందుతుంది.

కొత్త సుజుకి అవెనిస్ 125 స్కూటర్ యొక్క ఇంజిన్ మరియు పనితీరులో ఎటువంటి మార్పు లేదు. అంటే ఈ స్కూటర్ యాంత్రికంగా ఎటువంటి మార్పు పొందలేదు. కాబట్టి ఇది అదే 124.3 సీసీ సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ పొందుతుంది. ఇది 6750 rpm వద్ద 8.5 Bhp పవర్ మరియు 5500 rpm వద్ద 10 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.
దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న సుజుకి అవెనిస్ 125 ఇప్పటికే భారతీయ విఫణిలో విక్రయించబడుతున్న టీవీఎస్ ఎన్‌టార్క్ 125, ఏప్రిలియా ఎస్ఆర్125, హోండా గ్రాజియా మరియు వెస్పా 125 వంటి స్కూటర్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఈ స్కూటర్ అమ్మకాల పరంగా గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము. అయితే ఇది తప్పకుండా అత్యుత్తమ అమ్మకాలు పొందుతుందని ఆశిస్తున్నాము.
నిజానికి సుజుకి మోటార్‌సైకిల్ యొక్క అవెనిస్ 125 స్కూటర్ ప్రారంభం నుంచి మంచి అమ్మకాలను పొందుతోంది. ఈ తరుణంలో కంపెనీ ఇప్పుడు కొత్త కలర్ ఆప్షన్స్ ప్రవేశపెట్టింది. దీంతో అవెనిస్ కొత్త రంగులో కావాలనుకునే వారికి ఇవి తప్పకుండా నచ్చుతాయని భావిస్తున్నాము. అయితే కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త కలర్ స్కూటర్లు ఎలాంటి అమ్మకాలను పొందుతాయనేది త్వరలోనే తెలుస్తుంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








