మార్కెట్లో లాంచ్ అయిన రూ.17.70 లక్షల సుజుకి బైక్ ఇదే!.. పూర్తి వివరాలు

భారతీయ మార్కెట్లోని ఖరీదైన బైకుల జాబితాలో ఒకటిగా ఉన్న 'సుజుకి హయబుసా' ఇప్పుడు ఓ ప్రత్యేకమైన ఎడిషన్ రూపంలో లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ధర, డిజైన్ మరియు ఇతర ఫీచర్స్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

దేశీయ విపణిలో అత్యధిక ప్రజాదరణ పొందిన సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా.. తన 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హయబుసా యొక్క స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఈ వెర్షన్ అంతర్జాతీయ మార్కెట్లో అడుగుపెట్టిన తొమ్మిది నెలల తరువాత భారతదేశంలో అడుగుపెట్టినట్లు సమాచారం. ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ బైక్ ధర దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా రూ. 80,000 ఎక్కువ.

Suzuki-Hayabusa-25th-Anniversary-Edition

కొత్త సుజుకి హయబుసా స్పెషల్ ఎడిషన్ ధర రూ.17.70 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది కంపెనీ యొక్క 25 సంవత్సరాల ఉత్పత్తిని చూపిస్తుంది. చూడగానే ఆకర్షించే డిజైన్ కలిగిన ఈ బైక్ ఆరెంజ్ అండ్ బ్లాక్ అనే డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్ పొందుతుంది. అంతే కాకుండా డ్రైవ్ చైన్ అడ్జస్టర్ రోటర్ మరియు ఫ్రంట్ బ్రేక్ డిస్క్ యొక్క అంతర్గత భాగాల్లో గోల్డ్ కలర్ మనోడైజ్డ్ ఫినిషింగ్ చూడవచ్చు.

బైక్ యొక్క మప్లర్ మీద స్పెషల్ 25వ యానివెర్సరీ లోగో ఉంటుంది. ఫ్యూయెల్ ట్యాంక్ మీద 3డీ లోగో చూడవచ్చు. ఇది సింగిల్ పీస్ సీట్ కౌలింగ్ పొందుతుంది. డిజైన్ పరంగా ఇది ప్రత్యేకంగా ఉన్నప్పటికీ.. ఫీచర్స్ మాత్రం దాదాపు దాని మునుపటి మోడల్లో ఉన్న విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఇది తప్పకుండా వాహన వినియోగదారులను ఆకర్షిస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.

Suzuki-Hayabusa-25th-Anniversary-Edition

కొత్త సుజుకి హయబుసా యొక్క 25వ యానివర్సరీ ఎడిషన్ బైక్ పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే.. ఇది 13400-సీసీ ఇన్ లైన్ ఫోర్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ DOHC ఇంజిన్ పొందుతుంది. ఇది 190 హార్స్ పవర్ మరియు 150 Nm టార్క్ అందిస్తుంది. బై డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌తో ఇంజిన్ 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే స్పెషల్ ఎడిషన్ ఎటువంటి యాంత్రిక మార్పులను పొందలేదని తెలుస్తోంది.

నిజానికి భారతీయ విఫణిలో స్టాండర్డ్ సుజుకి హయబుసా ధర రూ. 16.90 లక్షలు. కానీ స్పెషన్ ఎడిషన్ ధర మాత్రం దీని కంటే రూ. 80000 ఎక్కువ (రూ. 17.70 లక్షలు). అయితే ధరకు తగిన అప్డేట్స్ ఈ బైకులో చూడవచ్చు. సుజుకి హయబుసాకు మార్కెట్లో ప్రత్యక్ష ప్రత్యర్థులు లేదు. కానీ ధరల విషయంలో మాత్రం కవాసకి కంపెనీకి చెందిన నింజా జెడ్ఎక్స్-10ఆర్ బైకుకు ప్రత్యర్థిగా ఉంటుందని తెలుస్తోంది.

Suzuki-Hayabusa-25th-Anniversary-Edition

భారతదేశంలో ఎక్కువ ధర వద్ద అందుబాటులో ఉన్న బైకుల జాబితాలో సుజుకి హయబుసా ఒకటి. అంతే కాకుండా సుజుకి కంపెనీ అందిస్తున్న ఖరీదైన బైకు కూడా హయబుసా కావడం గమనించదగ్గ విషయం. ఇప్పుడు మార్కెట్లో లాంచ్ అయినా హయబుసా 25 వ యానివెర్సరీ ఎడిషన్ లిమిటెడ్ ఎడిషన్ రూపంలో మాత్రమే లభిస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Wednesday, April 17, 2024, 13:15 [IST]
English summary
Suzuki hayabusa 25th anniversary edition launched at rs115500
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+