4 లక్షలకు పైగా స్కూటర్లలో లోపం.. వెంటనే వెనక్కి పిలిచిన ప్రముఖ టూవీలర్‌ కంపెనీ!

దాదాపు 4 లక్షలకు పైగా సుజుకి స్కూటర్లను వెనక్కి తీసుకురావాలని (Recall) ఆ కంపెనీ స్పష్టం చేసింది. వీటిలో యాక్సెస్ 125 (Access 125), బర్గ్‌మన్ స్ట్రీట్ 125 (Burgman Street 125), అవెనిస్ 125 (Avenis 125) మోడళ్లకు చెందిన దాదాపు నాలుగు లక్షల స్కూటర్లను రీకాల్ చేసింది. అసలు వీటిలో సమస్యలు ఉత్ఫన్నం అవ్వడానికి కారణం ఏమిటి? దానివల్ల కలిగే నష్టాలు ఏంటి అనే విషయాన్ని సుజుకి మోటార్‌సైకిల్‌ ఇండియా స్పష్టంగా పేర్కొంది. ఈ రీకాల్‌కి గల కారణాలు ఈ కథనంలో మీ కోసం..

పైన పేర్కొన్న మోడళ్లలో 2022 ఏప్రిల్ 30 నుంచి డిసెంబర్ 3 మధ్య తయారైన స్కూటర్లలో సాంకేతిక సమస్యలు నెలకొన్నాయి. ఈ సమస్య యాక్సెస్ 263,788 యూనిట్లలో, బర్గ్‌మాన్‌ స్ట్రీట్ 125 72,025 యూనిట్లు మరియు అవెనిస్ 125 52,578 యూనిట్లలో ఉన్నట్లు సంస్థ తెలిపింది. వీటితో పాటు సుజుకి వి-స్ట్రోమ్ 800 DE (V-Strom 800DE)ని కూడా రీకాల్‌ చేస్తున్నట్లు సుజుకి ప్రకటించింది.

Suzuki-Avenis-Recall

సమస్య ఏంటంటే?: ఇగ్నీషన్ కాయిల్‌పై ఇన్‌స్టాల్ చేసిన హైటెన్షన్ కోర్డ్‌లో (High-tension cord) లోపం వల్ల స్కూటర్లలో సమస్యలు ఉత్ఫన్నం అవుతన్నట్లు సుజుకి మోటార్‌సైకిల్‌ ఇండియా పేర్కొంది. స్కూటర్‌ రన్నింగ్‌లో ఇంజిన్‌లో పైకి కిందకు పదేపదే వంగడం వల్ల కోర్డ్‌లో పగుళ్లు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఇంజిన్ ఆగిపోవడం, స్టార్టింగ్ ట్రబుల్‌ జరిగే అవకాశం ఉందని చెప్పింది.

ఇక పగిలిన హైటెన్షన్ కోర్డ్‌కి నీరు తాకినప్పుడు లీకైన ఇగ్నీషన్ అవుట్ పుట్‌తో వెహికల్ స్పీడ్ సెన్సార్ మరియు థ్రోటిల్ పొజిషన్ సెన్సార్లు దెబ్బతింటాయని వెల్లడించింది. దీని ఫలితంగా స్పీడ్ డిస్ ప్లే ఫెయిల్యూర్ లేదా స్టార్టింగ్ ఫెయిల్యూర్ సంభవించవచ్చని వివరించింది. వీటిని త్వరలోనే సరిచేస్తామని ప్రకటించింది.

Suzuki-Burgman-Recall

ఇక కంపెనీ రీకాల్‌ చేసిన జాబితాలో వీ-స్ట్రోమ్‌ 800 డీఈ బైక్‌ కూడా ఉంది. అయితే దీని సమస్య వేరు అని సంస్థ వెల్లడించింది. పైన రీకాల్‌ చేసిన వాటితో దీనికి సంబధం లేదని స్పష్టం చేసింది. మే 5, 2023 నుంచి ఏప్రిల్ 23, 2024 మధ్య తయారైన మోటార్‌సైకిళ్లను రీకాల్‌ చేసింది. ఇది కేవలం భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయంగా రీకాల్‌కి పిలుపునిచ్చింది.

ఈ వీ-స్ట్రోమ్‌ సమస్య వెనుక టైరు లోపం ఉన్నట్లు గుర్తించింది. టైర్ థ్రెండ్‌లో పగుళ్లు లేదా వంగిపోవడం జరుగుతున్నాయని తెలిపింది. దీనిని మీరు చెక్‌ చేసుకోక పోతే టైర్ థ్రెడ్‌ భాగాలు టైర్ స్ట్రక్చర్ నుండి విడిపోతాయని పేర్కొంది. దీనివల్ల మొత్తం వెహికల్ డైనమిక్స్‌పై ప్రభావం చూపుతాయని వివరించింది. ఈ సమస్యను గుర్తించిన బైకులలో కొత్త రియర్ టైర్‌ని ఏర్పాటు చేయనున్నారు.

Suzuki-V-Strom-Recall

సుజుకి అంచనా ప్రకారం భారతదేశంలో 67 యూనిట్ల వరకు ప్రభావితమయ్యాయి. అయితే రీకాల్‌ చేయబడిన స్కూటర్లపై వినియోగదారులు ఎటువంటి ఆందోళన చెందవద్దని వివరించింది. చిన్నపాటి సర్దుబాటులతో ఆ సమస్య తీరుతుందని సంస్థ పేర్కొంది. దీనిని గుర్తించి పూర్తి స్థాయిలో వినియోగదారులకు అందిస్తామని చెప్పింది. త్వరలోనే రీకాల్‌కి సంబంధించి పూర్తి వివరాలు అందజేయబడతాయని వివరించింది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, July 27, 2024, 11:06 [IST]
English summary
Suzuki recalls 4 lakh access burgman street and avenis 125 scooters in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+