భారత్‌లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'సుజుకి మోటార్‌సైకిల్' దేశీయ విఫణిలో కొత్త బైక్ 'వీ-స్ట్రోమ్ 800డీఈ' లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త బైక్ ధర, డిజైన్, ఫీచర్స్, డెలివరీ వంటి వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
ధర (Price)
సుదీర్ఘ నిరీక్షణ తరువాత దేశీయ మార్కెట్లో అడుగుపెట్టయిన కొత్త సుజుకి వీ-స్ట్రోమ్ 800డీఈ (Suzuki V-Strom 800DE) ప్రారంభ ధర రూ. 10.30 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఈ కేవలం పరిచయ ధర మాత్రమే, కాబట్టి రాబోయే రోజుల్లో ఎప్పుడైనా ఈ ధర పెరిగే అవకాశం ఉంది. కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

డిజైన్ (Design)
ఒక్క చూపుతోనే చూపరులను కట్టిపడేసే ఈ సుజుకి వీ-స్ట్రోమ్ 800డీఈ బైక్ లేటెస్ట్ డిజైన్ కలిగి ఉంటుంది. ఇది కొత్త ప్లాట్‌ఫామ్‌పై మీద నిర్మించబడి ఉంది. దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే.. అదే స్టీల్ ఫ్రేమ్ పొందుతుంది. కానీ దీని సబ్‌ఫ్రేమ్ మాత్రం పొడిగించబడి ఉంటుంది. కాబట్టి పిలియన్ మరియు లగేజ్ ర్యాక్ కోసం స్థానం ఉంటుంది.
20 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ కలిగిన ఈ బైక్ ఛాంపియన్ ఎల్లో, గ్లాస్ మ్యాట్ మెకానికల్ గ్రే మరియు గ్లాస్ స్పార్కిల్ బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ మూడు కలర్స్ ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ బైక్ యొక్క సీటు ఎత్తు 855 మిమీ వరకు ఉంటుంది. కావున ఇది రైడింగ్ సమయంలో వాహన వినియోగదారునికి మంచి రైడింగ్ అనుభూతిని ఇస్తుంది.

ఫీచర్స్ (Features)
సుజుకి కొత్త బైక్ 5 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, USB పోర్ట్, ఎల్ఈడీ హెడ్‌లైట్స్, టైల్‌లైట్ మరియు టర్న్ సిగ్నెల్స్ వంటి వాటితో పాటు సుజుకి ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్ కూడా పొందుతుంది. ఇందులోని విండ్‌స్క్రీన్ అడ్జస్టబుల్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ బైక్ 230 కేజీల బరువును కలిగి ఉన్నప్పటికీ ఉత్తమమైన ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని పొందవచ్చు.
ఇంజిన్ (Engine)
సుజుకి వీ-స్ట్రోమ్ 800డీఈ బైక్ 776 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8500 rpm వద్ద 73 Bhp పవర్ మరియు 6800 rpm వద్ద 78 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉత్తమ పనితీరుని అందించేలా తయారైంది. ఈ బైక్ నాలుగు రైడింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది.

కొత్త సుజుకి వీ-స్ట్రోమ్ 800డీఈ బైక్ ముందు భాగంలో 21 ఇంచెస్ స్పోక్డ్ ఫ్రంట్ వీల్, వెనుక 17 ఇంచెస్ స్పోక్ వీల్ ఉంటుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఈ బైక్ ముందు వైపు 310 మిమీ డిస్క్ బ్రేక్స్ మరియు వెనుక 260 మిమీ డిస్క్ ఉంటాయి. ఈ బైకులో బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ లభిస్తుంది. కాబట్టి ఇది అన్ని విధాలా చాలా అద్భుతంగా ఉంటుంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








