మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. ఆకట్టుకొనే డిజైన్, ఇంధన ట్యాంక్ వద్ద బూట్ స్పేస్.. 190 కి.మీ రేంజ్
భారత్ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల రంగం రోజురోజుకు విస్తరిస్తోంది. గతంతో పోలిస్తే ప్రజలు సైతం ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వినియోగదారుల ఆసక్తి, అభిరుచి, అవసరాలకు అనుగుణంగా అన్ని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు సరికొత్త వాహనాలను విడుదల చేస్తున్నాయి.
తాజాగా ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ Svitch తాజాగా ఎలక్ట్రిక్ బైక్ svitch CSR 762 విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ ప్రారంభ ధర రూ.1,89,999 (ఎక్స్‌షోరూం) గా ఉంది. ఈ బైక్ విభిన్న లుక్‌తో అందుబాటులో ఉంది. మరియు కీలక ఫీచర్లను కలిగి ఉంటుంది.

పెట్రోల్ వాహనాలకు పోటీగా Svitch సంస్థ తన ఎలక్ట్రిక్ బైక్‌లను విడుదల చేసింది. దీంతోపాటు ఆకర్షణీయమైన బాడీవర్క్‌ను కలిగి ఉంటుంది. హ్యాండిల్ బార్, సన్నని టర్న్ లైట్లు, హెడ్‌లైట్లు, డే టైం రన్నింగ్ లైట్లను కలిగి ఉంది. ఇంధన ట్యాంక్ వద్ద బూట్ స్పేస్‌ను కలిగి ఉంది. 40 లీటర్ల వరకు బూట్ స్పేస్‌ను కలిగి ఉంది.
ఈ ఎలక్ట్రిక్ బైక్ రెండు బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంటుంది. పెద్ద లగేజీ కంపార్ట్‌మెంట్‌లో ఉంటాయి. ఈ రెండు బ్యాటరీలను విడిగా కూడా ఛార్జింగ్ చేయవచ్చు. దీంతోపాటు అదనంగా రెండు బ్యాటరీ ప్యాక్‌లను కొనుగోలు చేయకోవచ్చు. ఈ బ్యాటరీ ప్యాక్‌లు ఎయిర్ కూలింగ్ సదుపాయాన్ని కలిగి ఉంటుంది.

Svitch CSR 762 ఎలక్ట్రిక్ మెరుగైన రైడింగ్ అనుభూతిని కలిగిస్తుందని తెలుస్తోంది. ముందువైపున RSU టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుకవైపు మోనోషాక్ సస్పెన్షన్ ను కలిగి ఉంటుంది. 11/80 ఫ్రంట్ మరియు 140/70 వెనుక టైర్లతో 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది. 300mm ఫ్రంట్ మరియు 280mm వెనుక డిస్క్ బ్రేక్‌లతో కాంబీ బ్రేకింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది.
పూర్తి ఛార్జింగ్‌తో 190 కి.మీ రేంజ్ : ఈ ఎలక్ట్రిక్ బైక్ అమర్చిన మోటార్ గరిష్ఠంగా 13.4 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ పూర్తి ఛార్జింగ్‌తో 190 కి.మీ రేంజ్ ఇస్తుంది. మరియు గరిష్ఠంగా 120 కి.మీ వేగంతో ప్రయాణం చేయగలదు. ఈ మోటార్ సైకిల్ బరువు 155 కేజీలుగా ఉంది.

3.6kWh బ్యాటరీ ప్యాక్ ?? : svitch అధికారిక వెబ్‌సైట్ ఆధారంగా ఈ బైక్ 3.6kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. దీని గరిష్ఠ వేగం 110 కి.మీ నుంచి 160 కి.మీగా ఉంది. అయితే svitch CSR 762 ఎలక్ట్రిక్ బైక్ మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ బైక్ రేంజ్ కారణంగా ఆదరణ ఉంటుందని సంస్థ భావిస్తోంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








