యూత్ గుర్తుపెట్టుకోండి.. 2025లో స్టన్నింగ్ లుక్స్, అదిరిపోయే ఫీచర్స్‌తో వస్తున్న ట్రయంఫ్ బైక్స్ ఇవే
బ్రిటిష్ బ్రాండ్ ట్రయంఫ్ (Triumph) కంపెనీ అంతర్జాతీయంగా మంచి పేరున్న సంస్థ. లగ్జరీ బైకులతో పాటు భారతీయ వినియోగదారుల కోసం బడ్జెట్ ధరలో కూడా అధునాతన ఫీచర్లతో కూడిన టూవీలర్లను లాంచ్ చేస్తుంది. ఇవి ఎక్కువగా అడ్వాంచర్ తరహా డిజైన్‌ను కలిగి ఉంటాయి. ఈ బ్రాండ్ ఇప్పటికే ఇండియాలో బాగా ఫేమస్. ప్రధాన నగరాల్లో ఈ బైకులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో చాలా తక్కువగా ఉంటాయి. నగర రోడ్లకు అనుకూలంగా ఉండటంతో పాటు, ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న రోడ్లపై కూడా రైడింగ్ చేయడానికి ట్రయంఫ్ అత్యంత అనువైనవి. ఈ బ్రాండ్ నుంచి విడుదలయ్యే బైకులు ప్రత్యేక డిజైన్‌ను సంతరించుకుంటాయి. చాలా కాలంగా ఇండియా మార్కెట్‌పై కన్నేసి అంతర్జాతీయంగా కొత్త మోడళ్లను విడుదల చేస్తూనే ఇక్కడ కూడా భారతీయ వినియోగదారులను ఆకట్టుకోడానికి లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన వాటిని లాంచ్ చేస్తుంది.
2024 ఏడాదిలో పలు బైకులను తీసుకొచ్చిన ట్రయంఫ్ రాబోయే 2025 సంవత్సరంలో కూడా ఇండియా మార్కెట్లో తన పట్టు నిలుపుకోవాలని చూస్తుంది. ఇందుకోసం అందరికీ నచ్చే విధంగా పలు కొత్త మోడళ్లను లాంచ్ చేయడానికి ప్లాన్ చేసింది. వచ్చే ఏడాది జనవరి నుంచి మొదలుపెడితే డిసెంబర్ వరకు కూడా మార్కెట్లో తన హవాను చూపించడానికి 400cc ఇంజిన్ బైకులపై కంపెనీ ప్రధానంగా దృష్టి పెట్టింది.

అందులో భాగంగా 2025లో ఇదే ఇంజిన్ కెపాసిటీతో పలు కొత్త బైకులను వినియోగదారులను ఆకట్టుకోడానికి తీసుకువస్తుంది. వాటిలో ట్రయంఫ్ థ్రక్స్టన్ 400(Triumph Thruxton 400), ట్రయంఫ్ స్క్రాంబ్లర్ T4(Triumph Scrambler T4), ట్రయంఫ్ అడ్వెంచర్ బైక్(Triumph Adventure Bike) వంటి మూడు మోడళ్లను వచ్చే లాంచ్ చేయనుంది. కొన్నింటిని ఇటీవల రోడ్లపై టెస్టింగ్ చేశారు. దానికి సంబంధించిన ఫోటోలు ఆన్‌లైన్‌లో కనిపించాయి. వీటి గురించిన వివరాలు క్రింది కథనంలో చూద్దాం.
Triumph Thruxton 400: ట్రయంఫ్ థ్రక్స్టన్ 400ను కూడా ఇటీవల ఇండియా రోడ్లపై టెస్టింగ్ చేశారు. స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400X,స్పీడ్ T4కు కొనసాగింపుగా ఇదే ఇంజిన్ సగ్మెంట్‌లో 2025లో రైడర్లను అలరించడానికి రాబోతుంది. థ్రక్స్టన్ 400 బైక్ డిజైన్ సరికొత్తగా కనిపిస్తుంది. ఇది 398cc పెట్రోల్ ఇంజిన్‌తో ప్యాక్‌తో వస్తుంది. హ్యాండిల్ బార్ వద్ద డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా ఉంది.

Triumph Adventure Bike:ట్రయంఫ్ అడ్వెంచర్ బైక్‌ను కంపెనీ ప్రధానంగా KTM 390 అడ్వెంచర్, రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 వంటి వాటికి పోటీగా తీసుకువస్తుంది. భారత్‌లో ప్రస్తుతం అడ్వాంచర్ తరహ బైకులకు మంచి మార్కెట్ ఉంది. చాలా మంది యువత పర్వత ప్రాంతాల్లో రైడింగ్ చేయడానికి ఇలాంటి వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే వీరిని ఆకట్టుకోవడానికి ట్రయంఫ్ ఈ బైకును తీసుకొస్తుంది.
ట్రయంఫ్ అడ్వెంచర్ 398cc ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది ఇదే బ్రాండ్‌కు చెందిన అడ్వెంచర్ 400 Tiger Sports నుంచి డిజైన్‌ను పొందింది. ఇంజిన్ పనితీరు కూడా ఇదే విధంగా ఉంటుంది. అడ్వెంచర్‌లను కోరుకునే వినియోగదారులకు 2025లో ఈ బైక్ బెస్ట్ ఆప్షన్‌గా ఉండే అవకాశం ఉంది. ఈ అడ్వెంచర్ బైక్‌లో సస్పెన్షన్ సెటప్‌ను కూడా మరింత మెరుగ్గా అప్‌డేట్ చేశారు.

Triumph Scrambler T4: ట్రయంఫ్ స్క్రాంబ్లర్ T4 వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. ఇదే బ్రాండ్‌కు చెందిన స్క్రాంబ్లర్ 400Xకు కొనసాగింపుగా ఈ బైక్ రాబోతుంది. స్క్రాంబ్లర్ T4 398cc ఇంజిన్ కెపాసిటీతో వస్తుంది. దీన్ని ఇటీవల రోడ్లపై టెస్టింగ్ కూడా చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఆన్‌లైన్‌లో కనిపంచాయి. ఇది బ్లాక్-అవుట్ USD ఫోర్క్స్‌లతో, అధునాతన సస్పెన్షన్ సెటప్‌తో వస్తుంది.


Click it and Unblock the Notifications








