ఎలక్ట్రిక్ టూవీలర్‌ కంపెనీలకు ఝలక్‌.. హ్యాండ్‌ ఇచ్చిన కస్టమర్లు, పరిస్థితి ఇలాగే కొనసాగితే కష్ట కాలమే!

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఊపందుకుంటున్నాయి. అయితే ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు పెద్దగా ఆశించిన స్థాయిలో లేకపోయినా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మాత్రం విపరీతమైన డిమాండ్‌ పెరుగుతోంది. ప్రస్తుతం ఈవీ కొనుగోళ్లలో ఇదే అత్యధికం అవ్వడంతో ఉత్పత్తి కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేసే పనిలే నిమగ్నమయ్యాయి. ప్రస్తుతం ఓలా, టీవీఎస్ మోటార్స్, బజాజ్ ఆటో, ఏథర్‌ ఎనర్జీ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అమ్మకాల్లో దుమ్మురేపుతున్నాయి. 2024 ఆగస్టులో అత్యధికంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించిన టాప్ 10 కంపెనీలను పరిశీలిద్దాం.

ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా మొత్తం 88,472 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. అయితే గత ఏడాది ఆగస్టు నెలతో పోల్చితే ఈ నంబర్‌ కేవలం 62,779 గానే ఉంది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఆగస్టులో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు భారీ సంఖ్యలో అమ్ముడయ్యాయి. ప్రతీ నెల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు హెచ్చు తగ్గుల మధ్య కొనసాగుతున్నాయి.

Ola Electric Scooters

2024 జూలైలో 1,07,016 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. ఇది ఆగస్టుతో పోల్చితే దాదాపు 20 వేల యూనిట్లు అత్యధికం. అంటే ఆగస్టులో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు వాస్తవానికి సాధారణం కంటే తక్కువగా సేల్‌ అయ్యాయి. ఇందుకో ఓ కారణం కూడా ఉంది. మొత్తం అమ్మకాల్లో అత్యధిక వాటా ఓలా ఎలక్ట్రిక్‌కి ఉంది. ఈ స్కూటర్ల సేల్స్ ఆగస్టులో గణనీయంగా తగ్గాయి.

ఇక టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో ఇప్పటికే ఈ విభాగంలో ప్రముఖ ద్విచక్ర వాహనాలుగా విక్రయిస్తుండగా.. ఓలా ఎలక్ట్రిక్ అదే తొలి స్థానంలో కొనసాగుతోంది. 2024 ఆగస్టులో కూడా ఇదే నంబర్‌ కొనసాగింది. ఓసారి కంపెనీల వారీగా వాటి సేల్స్‌ వివరాలను లుక్కేయండి..

TVS iQube Electric Scooter

ఓలా ఎలక్ట్రిక్ 2024 జూలైలో 41,624 యూనిట్లను విక్రయించగా, ఆగస్టులో కేవలం 27,517 ఎలక్ట్రిక్ స్కూటర్లను మాత్రమే విక్రయించింది. ఈ క్రమంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు మూడింట ఒక వంతు క్షీణించింది. ఇదే ఓలా ఎలక్ట్రిక్ 2023 ఆగస్టులో 18,750 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది.

ఓలా ఎలక్ట్రిక్‌తో పాటు ఇతర ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు కూడా జూలైతో పోలిస్తే ఆగస్టులో గణనీయంగా తగ్గాయి. ముఖ్యంగా టీవీఎస్ మోటార్ కంపెనీ ఎలక్ట్రిక్‌ వెహికిల్ సేల్స్‌ దాదాపు 10 శాతం క్షీణించాయి. టీవీఎస్ ఎలక్ట్రిక్ ఆగస్టులో 17,543 యూనిట్లను విక్రయించగా, జూలైలో 19,486 యూనిట్లను మాత్రమే విక్రయించింది.

Bajaj Chetak Electric Scooter

ఆ తర్వాతి స్థానంలో బజాజ్ ఆటో ఉంది. ఈ బజాజ్ ఆటో గత నెలలో ఫేమస్‌ ఎలక్ట్రిక్‌ లైనప్‌ చేతక్ 16,706 యూనిట్లను విక్రయించింది. ఇదే కంపెనీ 2024 జూలైలో 17,657 చేతక్ స్కూటర్లను విక్రయించింది. ఏథర్ ఎనర్జీ 10,830 ఎలక్ట్రిక్ స్కూటర్లతో నాలుగో స్థానంలో ఉండగా.. జూలైతో పోలిస్తే ఏథర్ స్కూటర్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది.

ఆ తర్వాత హీరో మోటోకార్ప్ 4,742 యూనిట్ల విడా ఎలక్ట్రిక్ స్కూటర్లు, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ 2,816 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. బిగాస్ ఆటో 1,110 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలతో ఏడో స్థానంలో ఉంది. బౌన్స్ ఎలక్ట్రిక్ (791), వార్డ్ విజార్డ్ (734), రివోల్ట్ ఇంటెల్లికార్ప్ (721) వరుసగా టాప్ 10, 8, 9, 10 స్థానాల్లో నిలిచాయి.

Hero Vida V1 Electric Scooter

డ్రైవ్స్‌పార్క్‌ ఒపీనియన్: దేశంలో కోమాకి, ఓకాయా, గోదావరి, జెలియో వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లకు కూడా డిమాండ్ ఎక్కువగానే ఉంది. అయితే ఆగస్టులో ద్విచక్ర వాహనాల అమ్మకాలు తగ్గడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సాధారణంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు ప్రతీనెలా పెరుగుతాయి. కానీ ఆగస్టులో చాలా దీనికి భిన్నంగా ఎలక్ట్రిక్‌ టూవీలర్స్ సేల్స్‌ భారీగా క్షీణించాయి. అయితే ఈ పండుగ సీజన్‌లో రెండింతలు ఎక్కువ మార్కెట్‌ జరగనుంది.

More from DriveSpark

Article Published On: Friday, September 27, 2024, 15:17 [IST]
English summary
Top 10 electric two wheeler brands august 2024 sales report check all details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+