మార్కెట్లో వీటికి తిరుగే లేదు.. కొత్త బైక్‌ కొనాలనుకుంటే ఈ లిస్ట్‌ అస్సలు మిస్‌ అవ్వకండి

భారత మార్కెట్లో గత నెలలో అమ్ముడైన టాప్‌ 10 మోటార్‌సైకిళ్ల నివేదిక విడుదలైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో టాప్ 10 మోటార్‌సైకిళ్లు సమిష్టిగా(February 2024 Motorcycles Sales) 7,95,663 యూనిట్ల సేల్స్‌ నమోదు అవగా.. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే.. ఏకంగా 36.42 శాతం గణనీయమైన వృద్ధిని సాధించింది. పూర్తి సమాచారం ఈ కథనంలో..

దేశీయ మోటార్‌ సైకిల్‌ మార్కెట్‌లో ఫిబ్రవరి 2024 అమ్మకాల్లో గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది. ముఖ్యంగా యూత్‌ను ఆకట్టుకునేలా సరికొత్త బైక్‌లు విడుదల కావడంతో ఈ సారి టూ వీలర్‌ మార్కెట్లో వృద్ధి చెందింది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో రైడర్ల మనసు దోచి అత్యధిక సేల్స్‌ను నమోదు చేసిన టాప్‌ 10 బైక్‌ల వివరాలు ఇవే..

Hero-Splendor-Plus-Canvas

ఫిబ్రవరి 2024లో హీరో స్ప్లెండర్‌(Hero Splendor Best Selling Motorcycle) 2,77,939 యూనిట్లు అమ్ముడవడంతో.. మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ మోటార్‌సైకిల్‌గా టాప్‌ 1 లో(February 2024 Sales) నిలిచింది. కాగా ఫిబ్రవరి 2023తో పోలిస్తే అత్యల్ప క్షీణతను నమోదు చేసింది.

ఇక రెండో స్థానంలో నిలిచిన హోండా షైన్‌(Honda Shine 100) 1,42,763 యూనిట్లు సేల్‌ అయ్యాయి. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఏకంగా.. 301.09 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది. హోండా తన కొత్త ఎంట్రీ లెవల్ షైన్ 100ని విడుదల చేయడమే ఇందుకు కారణం.

Bajaj-Pulsar-N150

యూత్‌ ఫేవరెట్‌.. బజాజ్ పల్సర్(Bajaj Pulsar) ఫిబ్రవరి 2024 లో 1,12,544 యూనిట్లను విక్రయించి టాప్‌ 3 లో నిలిచింది. ఈ ఏడాది బజాజ్‌ పల్సర్‌ NS బైక్‌లు అప్‌డేట్లతో విడుదల కావడమే ఈ గణనీయమైన సేల్స్‌కు కారణం. గతేడాది ఇదే నెలతో పోలిస్తే బజాజ్‌ పల్సర్‌ 40.49 శాతం వృద్ధిని సాధించింది.

కాగా హీరో మోటోకార్ప్‌కు చెందిన HF డీలక్స్(HF Deluxe), 76,138 యూనిట్లను విక్రయించి, 35.26 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది. దీంతో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. మెరుగైన పనీతీరు, సరసమైన ధర కారణంగా కస్టమర్లకు బెస్ట్‌ ఆప్షన్‌గా మారింది.

TVS-Apache-RTR-310

ఇక దేశీ బ్రాండ్‌ టీవీఎస్ రైడర్(TVS Raider) ఎప్పటిలాగే ఆశాజనకమైన సేల్స్‌తో ముందుకు సాగుతోంది. ఫిబ్రవరి 2024లో 42,063 యూనిట్లను విక్రయించి ఐదో స్థానంలో నిలిచింది. దాని ఆకట్టుకునే డిజైన్‌, అధునాతన ఫీచర్లతో.. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే 38.61 శాతం వృద్ధిని సాధించింది. టీవీఎస్ సేల్స్‌లో అగ్రభాగం TVS Raider దే. కాగా TVS అపాచీ 34,593 యూనిట్ల సేల్స్‌ను నమోదు చేసింది.

బడ్జెట్‌ ఫ్రెండ్లీ మోటార్‌సైకిల్‌ హీరో ప్యాషన్(Hero Passion) ఈ ఏడాది ఫిబ్రవరిలో 31,302 యూనిట్లను విక్రయించి టాప్‌ 6th ప్లేస్‌ను దక్కించుకుంది. దీంతో గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఏకంగా 574.61 శాతం గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. హీరో ప్యాషన్‌ అప్‌డేట్‌ వెర్షన్ విడుదల కావడంతో.. ఇంతటి వృద్ధి సాధించిందని చెప్పొచ్చు.

Royal-Enfield-Classic-350

ఇక బజాజ్‌ మోటార్స్‌ ఇండియాకు చెందిన బజాజ్‌ ప్లాటినా(Bajaj Platina) ఫిబ్రవరి 2024లో 28,718 యూనిట్లు అమ్ముడయ్యాయి. దీంతో గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే 20.04 శాతం వృద్ధిని నమోదు చేసి.. టాప్‌ 8 లో నిలిచింది. అర్బన్‌ కమ్యూటర్స్‌ అభిరుచికి తగినట్లుగా ఈ బైక్‌ ఉండటంతో.. పట్టణ రైడర్లను ఆకట్టుకుంటోంది.

ఇక ప్రముఖ టూ వీలర్‌ బ్రాండ్‌ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్(Royal Enfield Classic 350) 350.. టాప్‌ 10లో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఫిబ్రవరిలో 28,310 క్లాసిక్‌ 350 యూనిట్లను విక్రయించింది. తద్వారా ఫిబ్రవరి 2023 తో పోలిస్తే 3.09 శాతం సాధించి యూత్‌లో దానికున్న క్రేజ్‌ను నిలబెట్టుకుంటోంది.

Honda-Unicorn

ఇక చివరగా టాప్‌ 10 లో చివరి స్థానం దక్కించుకున్న మరో బైక్‌ హోండా యూనికార్న్‌(Honda Unicorn).. ఈ బైక్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో 21,923 యూనిట్లు అమ్ముడయ్యాయి. కాగా గతేడాది ఫిబ్రవరిలో హోండా కేవలం 1,339 యూనికార్న్‌ యూనిట్లను మాత్రమే విక్రయించింది. దీంతో ఈ ఏడాది ఆశ్చర్యకరంగా 1490.22 శాతం వృద్ధిని నమోదు చేసి మార్కెట్లో మళ్లీ తన ఉనికిని చాటుకుంది.

More from DriveSpark

Article Published On: Monday, March 18, 2024, 16:00 [IST]
English summary
Top 10 motorcycles sales report in february 2024 india best selling bike hero splendor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+