జెట్‌ స్పీడ్‌లో స్కూటర్లను కొంటున్న జనాలు.. అలా వెళ్తున్నారు ఇలా కొత్త బండితో ఇంటికి తిరిగొస్తున్నారు!

భారత్‌లో స్కూటర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. గత సంవత్సరం జూలై 2023 అమ్మకాలతో పోలిస్తే జూలై 2024లో 37.08% పెరుగుదలను సాధించాయి. ఈ స్కూటర్ల మొత్తం అమ్మకాలు 2023 జూలైలో 3,78,696 యూనిట్లు సేల్‌ అవ్వగా 2024 జూలైలో 5,19,113 యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోల్చితే 1,40,417 యూనిట్ల పెరిగాయి. మార్కెట్‌లో లభించే టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ మోడళ్లు వాటి సేల్స్‌ రిపోర్ట్‌, ఏ కంపెనీ టాప్‌లో ఉంది? తదితర అంశాలను మీ కోసం ఈ స్టోరీలో అందిస్తున్నాం..

మార్కెట్లో అగ్రగామిగా హోండా యాక్టివా: హోండా యాక్టివా జూలై 2024లో 1,95,604 యూనిట్ల అమ్మకాలతో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయిన స్కూటర్‌గా తొలి స్థానంలో నిలిచింది. 2023 జూలైలో విక్రయించిన 1,35,327 యూనిట్లతో పోలిస్తే ఇది 44.54% వృద్ధిని సాధించింది. టాప్ 10 స్కూటర్లలో మొత్తం అమ్మకాల్లో యాక్టివా 37.68 శాతం వాటాను కలిగి ఉంది.

Top 10 Scooter Honda Activa

టీవీఎస్ జూపిటర్: ఈ స్కూటర్‌ కూడా సేల్స్‌లో సత్తా చాటింది. జూలై 2024 లో 74,663 యూనిట్లను విక్రయించింది. 2023 జూలైలో విక్రయించిన 66,439 యూనిట్లతో పోలిస్తే ఇది 12.38% అధికం కావడం విశేషం. జూపిటర్ 14.38% మార్కెట్ వాటాను సాధించింది. ప్రస్తుతం దేశంలో భారీ ప్రజాదరణను కలిగి ఉంది. తాజాగా జూపిటర్‌ 110సీసీని అప్‌డేటెడడ్‌ వెర్షన్‌లో విడుదల చేసింది.

సుజుకి యాక్సెస్: సుజుకి యాక్సెస్ 37.87% పెరుగుదలతో భారీ సంఖ్యలో స్కూటర్లు అమ్ముడయ్యాయి. 2024 జూలైలో యాక్సెస్ 71,247 యూనిట్లను విక్రయించింది. అంతకుముందు సంవత్సరం 51,678 యూనిట్లతో పోలిస్తే 19,569 యూనిట్లు పెరిగాయి. మార్కెట్‌లో ఈ సుజుకి స్కూటర్‌ 13.72% వాటాను కలిగి ఉండి పోటీదారులకు గట్టి సవాల్‌ని విసురుతోంది.

Top 10 Scooter Ola S1

ఓలా S1: ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఓలా ఎస్1 అమ్మకాలు 114.49 శాతం పెరిగాయి. 2024 జూలైలో S1 41,624 యూనిట్లను విక్రయించగా.. 2023 జూలైలో కేవలం 19,406 యూనిట్లు మాత్రమే సేల్‌ అయ్యాయి. ఈ పెరుగుదల భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న ప్రజాదరణను హైలైట్ చేస్తుంది. మార్కెట్‌లో S1 (8.02) శాతంతో ఆకట్టుకునే మార్కెట్ వాటాను కలిగి ఉంది.

బజాజ్ చేతక్: ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ అమ్మకాలు 344.21 శాతం పెరిగాయి. చేతక్ 2024 జూలైలో 20,114 యూనిట్లను విక్రయించగా, గత ఏడాది జూలైలో కేవలం 4,528 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఈ భారీ వృద్ధితో చేతక్ 3.87% మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఇది ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు జనాలు చూస్తున్నారని సూచిస్తుంది.

TVS Iqube

టీవీఎస్ ఐక్యూబ్: ఇది 58.30% పెరుగుదలతో గణనీయమైన వృద్ధిని సాధించింది. గత ఏడాది కేవలం 13,306 అమ్ముడుపోగా, ఈ ఏడాది జూలైలో 21,064 యూనిట్లు అమ్ముడయ్యాయి. దీని మార్కెట్ వాటా 4.06 శాతానికి చేరుకుంది. ఇది కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ని హైలైట్ చేస్తుంది.

హోండా డియో: ఈ స్కూటర్‌ 16.04% వృద్ధితో కాస్త నెట్టుకొచ్చింది. డియో ఈ ఏడాది జూలైలో ముప్పై మూడు వేల నాలుగు వందల డెబ్బై రెండు 33,472 యూనిట్లను విక్రయించగా.. గత ఏడాది 28,845 యూనిట్లు సేల్‌ అయ్యాయి. దీని మార్కెట్ వాటా 6.45 శాతంగా ఉంది. ఇది యువ రైడర్లను ఎక్కువగా ఆకర్షించే స్కూటర్‌గా ఉంది.

Rank Scooters July-24 July-23 Growth (%)
1 Honda Activa 1,95,604 1,35,327 44.54
2 TVS Jupiter 74,663 66,439 12.38
3 Suzuki Access 71,247 51,678 37.87
4 Ola S1 41,624 19,406 114.49
5 Honda Dio 33,472 28,845 16.04
6 TVS Ntorq 26,829 25,839 3.83
7 TVS iQube 21,064 13,306 58.30
8 Bajaj Chetak 20,114 4,528 344.21
9 Suzuki Burgman 19,806 17,500 13.18
10 Yamaha RayZR 14,690 15,828 -7.19

టీవీఎస్ ఎన్ టార్క్: ఇది 3.83% వృద్ధితో స్వల్ప వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది 25,839 యూనిట్లు, ఈ ఏడాది 26,829 యూనిట్లను సేల్‌ చేసింది. ఆ తర్వాత సుజుకి బర్గ్‌మాన్ 13.18% పెరిగింది. గత ఏడాది 17,500 యూనిట్లు, ఈ సంవత్సరం 19,806 యూనిట్లను విక్రయించింది. బర్గ్ మాన్ 3.82% మార్కెట్‌ వాటాను కలిగి ఉంది.

ఇక ఫైనల్‌గా యమహా RayZR టాప్ టెన్ స్కూటర్లలో స్థానం దక్కించుకుంది. అయితే దీని సేల్స్ ఈ ఏడాది -7.19% క్షీణతను చవిచూసింది. నష్టాలు చవిచూసిన ఏకైక మోడల్‌గా ఉంది నిలిచింది. గత సంవత్సరం 15,828 యూనిట్లను విక్రయించగా ఈ ఏడాది కేవలం 14,690 యూనిట్లను మాత్రమే విక్రయించింది.

More from DriveSpark

Article Published On: Tuesday, August 27, 2024, 7:20 [IST]
English summary
Top 10 scooters sales in july 2024 check full sales report details in telugu
Read more on: #auto news #scooter #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+