ఒక్క నెలలోనే 3 లక్షల మంది ఈ బైక్‌ని కొనేశారు.. ఆశ్చర్యానికి గురిచేస్తున్న టూవీలర్స్‌ సేల్స్‌ రిపోర్ట్‌!

దేశంలో టూవీలర్స్‌ వినియోగం పెరుగుతోంది. దీంతో ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు వేగంగా పెరుగుతున్నాయి. దేశంలో ఎక్కువగా అమ్ముడువతున్న టూవీలర్స్‌లో హీరో స్ల్పెండర్ (Hero Splendor) తొలి స్థానంలో ఉంది. ఈ మోటార్ సైకిళ్లు ప్రతి నెలా రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్నాయి. టూవీలర్స్‌ సేల్స్‌కి సంబంధించిన ఆగస్టు 2024 అమ్మకాల రిపోర్ట్‌ వెల్లడి అవుతుంది. గత నెలలో హీరో స్ప్లెండర్ మొత్తం 3,02,234 యూనిట్ల అమ్మకాలతో భారీ సంఖ్యలో అమ్ముడవుతోంది. గత ఏడాది ఆగస్టు 2023లో హీరో స్ప్లెండర్ మొత్తం 2,89,930 యూనిట్లు మాత్రమే సేల్‌ అయ్యాయి. ఈ హీరో స్ప్లెండర్ అమ్మకాలు గత ఏడాదితో పోల్చితే 4.49 శాతం వృద్ధిని నమోదు చేసింది.

గత కొన్ని నెలలుగా హీరో స్ప్లెండర్‌ భారీ అమ్మకాలతో దూసుకెళ్తూ నంబర్‌ వన్‌ స్థానంలో కొనసాగుతోంది. మొత్తం టూవీలర్స్‌లో స్కూటర్, బైక్‌లు కలిపి అమ్మకాల పరంగా హోండా, బజాజ్, సుజుకి కంపెనీలకు చెందిన ఉత్పత్తులు దేశంలో మంచి లాభాలను ఆర్జిస్తున్నాయి. గత ఏడాది ఆగస్టులో అత్యధికంగా అమ్ముడైన ఇతర ద్విచక్ర వాహనాలను రిపోర్ట్‌ని ఓ సారి పరిశీలిద్దాం.

Hero Splendor Sales

హోండా యాక్టివా (Honda Activa) ఈ సారి సేల్స్‌లో రెండవ స్థానంలో ఉంది. హోండా యాక్టివా గత నెలలో 5.86 శాతం వృద్ధితో మొత్తం 2,27,458 ద్విచక్ర వాహనాలను విక్రయించింది. ఆ తర్వాత హోండా షైన్ (Honda Shine) మొత్తం 1,49,697 ద్విచక్ర వాహనాలతో మూడో స్థానంలో నిలిచింది. ఇది 31.15 శాతం వృద్ధిని నమోదు చేసింది.

ఆ తర్వాత బజాజ్ పల్సర్ గత నెలలో మొత్తం 1,16,250 ద్విచక్ర వాహనాలను విక్రయించగా.. బజాజ్ పల్సర్ నాల్గవ స్థానంలో ఉంది. ఇది 28.19 శాతం వృద్ధిని నమోదు చేసింది. టీవీఎస్ జూపిటర్ గత నెలలో మొత్తం 89,327 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించడంతో 27.49 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసి ఐదో స్థానంలో ఉంది.

Bajaj Pulsar Sales

హీరో HF డీలక్స్ ఈ జాబితాలో ఆరో స్థానంలో ఉంది. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ గత నెలలో మొత్తం 84,660 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది, ఇది 15.89 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. ఆ తర్వాతి స్థానంలో సుజుకి యాక్సెస్ ఏడో స్థానంలో ఉంది. సుజుకి 16.37 శాతం వార్షిక వృద్ధితో మొత్తం 62,433 ద్విచక్ర వాహనాలను విక్రయించింది.

ఈ అమ్మకాల జాబితాలో టీవీఎస్ ఎక్స్ఎల్ ఎనిమిదో స్థానంలో ఉంది. టీవీఎస్ ఎక్స్ఎల్ గత నెలలో మొత్తం 44,546 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. ఇది 22.06 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. ఆ తర్వాత బజాజ్ ప్లాటినా తొమ్మిదో స్థానంలో ఉంది. బజాజ్ ప్లాటినా గత నెలలో మొత్తం 41,915 ద్విచక్ర వాహనాలను విక్రయించింది. ఇది సంవత్సరానికి 3 శాతం వృద్ధిని సాధించింది.

Bajaj Platina Sales

ఈ జాబితాలో హోండా డియో 10వ స్థానంలో ఉంది. హోండా డియో మొత్తం 34,705 ద్విచక్ర వాహనాలను విక్రయించింది. ఇది సంవత్సరానికి 19.83 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ మొత్తం అమ్మకాల్లో హోండా షైన్‌ భారీ వృద్ధిని నమోదు చేసింది. ఆ తర్వాత హీరో మోటోకార్ప్‌ ఉత్పత్తులు సేల్స్‌లో దూసుకెళ్తున్నాయి.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, September 24, 2024, 17:01 [IST]
English summary
Top 10 two wheeler sales in august 2024 check full report in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+