ఒక్క నెలలోనే 3 లక్షల మంది ఆ బైక్‌ని కొనేశారు! పిచ్చెక్కిస్తున్న సేల్స్‌ రిపోర్ట్‌!

గత కొన్ని నెలలుగా భారతదేశంలో ద్విచక్ర వాహనాలు అమ్మకాలు ఊపందుకున్నాయి. మన దగ్గర కార్ల కంటే ఎక్కవగా ద్విచక్రవాహనాలను ప్రజలు ఉపయోగిస్తున్నారు. ఫలితంగా ప్రతి నెలా లక్షలాది టూవీలర్స్‌ అమ్ముడవుతున్నాయి. గత జూన్‌ నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్‌ 10 ద్విచక్ర వాహనాల జాబితాను మీకు అందిస్తున్నాం. మొత్తం ఎన్ని ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి? అమ్మకాలు శాతం ఎంత పెరిగింది. ఎక్కువగా అమ్ముడైన బైక్ ఏది ఆ వివరాలు అన్ని ఈ కథనంలో..

హీరో స్ప్లెండర్: దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న టూవీలర్స్‌లో ఇదొకటి. ఈ బైక్‌ ఒక్క జూన్ నెలలోనే 3,05,586 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2023 జూన్‌లో కేవలం 2,38,340 బైక్‌లను మాత్రమే విక్రయించారు. ఈ నెలలో 67,246 యూనిట్లను విక్రయించి 28.21 శాతం వృద్ధిని నమోదు చేసింది.

Top-10-Two-Wheeler-SalesJune

హోండా యాక్టివా: ఈ జాబితాలో హోండా యాక్టివా రెండో స్థానంలో ఉంది. జూన్ నెలలో మొత్తం 2,33,376 స్కూటర్లు అమ్ముడయ్యాయి. 2023 జూన్‌లో ఇదే స్కూటర్‌ కేవలం 1,30,830 స్కూటర్ల యూనిట్లను మాత్రమే సేల్‌ చేసింది. ఇప్పుడు కంపెనీ అదనంగా 1,02,546 అదనపు స్కూటర్లను విక్రయించించి.. 78.38 శాతం వృద్ధిని నమోదు చేసింది.

హోండా షైన్‌: ఈ బైక్‌ మూడో స్థానంలో ఉంది. 125సీసీ విభాగంలో తిరుగులేని శక్తిగా ఈ బైక్‌ కొనసాగుతుంది. ఒక్క జూన్ నెలలోనే 1,39,587 బైక్స్‌ని హోండా కంపెనీ విక్రయించింది. 2023 జూన్‌లో ఇదే బైక్‌ కేవలం 99,254 బైక్‌ యూనిట్లను మాత్రమే సేల్‌ చేసింది. మొత్తం మీద కంపెనీ 40,333 యూనిట్ల బైకులను విక్రయించి.. 40.63 శాతం వృద్ధిని నమోదు చేసింది.

Top10-Sales-In-June-Honda-Shine

బజాజ్‌ పల్సర్‌: ఇక నాలుగో స్థానంలో బజాజ్‌ ఆటోకు చెందిన ఫేమస్‌ పల్సర్‌ ఉంది. జూన్ నెలలో మొత్తం 1,11,101 బైకులు అమ్ముడయ్యాయి. 2023 జూన్‌లో కేవలం 1,07,208 బైక్స్‌ మాత్రమే అమ్ముడయ్యాయి. గత నెలలో 3893 యూనిట్ల అమ్మకాలతో 3.63 శాతం వృద్ధిని సాధించింది. ప్రస్తుతం యువతకు అతి చేరువగా బైక్స్‌లో పల్సర్‌ ఒకటిగా ఉంది.

హీరో HF డీలక్స్‌: 5వ స్థానంలో ఉన్న ఈ బైక్‌ని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. పొడవైన సీటుని కలిగి ఉండి మంచి మైలేజీని అందిస్తుంది. జూన్‌లో ఈ బైక్స్‌ మొత్తం 89,941 యూనిట్లను సేల్‌ చేసింది. 2023 జూన్‌లో కూడా 89,275 యూనిట్ల సేల్స్‌తో రాణించింది. తాజాగా కంపెనీ 666 యూనిట్ల ఎక్కువ అమ్మకాలతో 0.75 శాతం వృద్ధిని నమోదు చేసింది.

HF-Deluxe-Sales-In-June-2024

ఈ జాబితాలో ఆరో స్థానంలో టీవీఎస్ జూపిటర్ ఉంది. జూన్ నెలలో మొత్తం 72,100 స్కూటర్లు అమ్ముడయ్యాయి. 2023 జూన్‌లో 64,252 స్కూటర్లను విక్రయించింది. ప్రస్తుతం 7848 స్కూటర్లను ఎక్కువగా విక్రయించి 12.21 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆ తర్వాత సుజుకి యాక్సెస్ స్కూటర్ ఉంది. జూన్‌లో 52,192 స్కూటర్లను సేల్‌ చేసి 32.12 శాతం వృద్ధిని నమోదు చేసింది.

ఇక ఎనిమిదో స్థానంలో టీవీఎస్ ఎక్స్ఎల్ 100 మోపెడ్ ఉంది. జూన్‌లో మొత్తం 40,397 వాహనాలు అమ్ముడయ్యాయి. మొత్తానికి 17.10 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇక టీవీఎస్ అపాచీ జూన్‌లో 37,162 బైక్స్‌ని సేల్‌ చేసి 32.12% అమ్మకాల వృద్ధి నమోదు చేసింది. చివరగా ఓలా S1 36,723 వాహనాలు అమ్ముడయ్యాయి. ఇది 107.57 శాతం వృద్ధిని నమోదు చేసింది.

Rank Top 2Wheelers June'24

June'23

Growth (%) YoY
1 Hero Splendor 3,05,586 2,38,586 28.21
2 Honda Activa 2,33,376 1,30,830 78.38
3 Honda Shine 1,39,587 99,254 40.64
4 Bajaj Pulsar 1,11,101 1,07,208 3.63
5 Hero HF Deluxe 89,941 89,275 0.75
6 TVS Jupiter 72,100 64,252 12.21
7 Suzuki Access 52,192 39,503 32.12
8 TVS XL 100 40,397 34,499 17.10
9 TVS Apache 37,162 28,127 32.12
10 Ola S1 36,723 17,692 107.57

ఇంధన వానాలతో పోటీగా మార్కెట్‌లో ఎలక్ట్రిక్‌ టూవీలర్స్‌ సేల్స్‌ వేగంగా పెరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా టాప్‌ 10లో ఓలా స్థానం సంపాదించడమే అని చెప్పాలి. ఈ కంపెనీకి చెందిన స్కూటర్లు 100శాతం స్ట్రైక్‌ రేట్‌తో దూసుకెళ్తున్నాయి. భవిష్యత్తులో ఎలక్ట్రిక్‌ బైక్స్‌ గట్టి పోటీని ఇస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక బజాజ్‌ లాంచ్‌ చేసిన మొట్టమొదటి సీఎన్‌జీ కూడా మార్కెట్‌లోకి వచ్చేసింది. ఈ బైక్‌ కూడా గట్టి పోటీని ఇవ్వనుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, July 23, 2024, 10:02 [IST]
English summary
Top 10 two wheelers sold in june 2024 product wise growth percentage details in telugu
Read more on: #auto news #sales #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+