స్కూటీ కొంటున్నారా.. అయితే ఈ టాప్ 5 మోడళ్ల గురించి తెలుసుకోండి.. వీటి మైలేజ్, ఫెర్ఫార్మెన్స్ సూపర్

దేశంలోని దాదాపు ప్రతి ఇంట్లో కూడా టూవీలర్ కచ్చితంగా ఉంటుంది. రోజువారీ అవసరాలకు బైకు లేదా స్కూటర్ ఏదైనా సరే ఇంట్లో ఉండాల్సిందే. ఉద్యోగాలకు వెళ్లడానికి, మార్కెట్‌కు, కాలేజ్‌లు మొదలగు చోట్లకు ఎక్కడికంటే అక్కడికి, ఎంత దూరప్రాంతాలకు అయినా సరే సులభంగా వెళ్లడానికి టూవీలర్ వాహనాలు ఉపయోగకరంగా ఉంటాయి. కార్లతో పోలిస్తే, ఇరుకైన సందులు, ట్రాఫిక్‌లో సైతం టూవీలర్స్ బెస్ట్ ఆప్షన్. దీంతో డిమాండ్‌కు అనుగుణంగా దేశంలో భారీ సంఖ్యలో కొత్త టూవీలర్ వాహనాలు మార్కెట్లోకి విడుదల అవుతున్నాయి. ఇటీవల కాలంలో బైకుల కంటే కూడా ఎక్కువగా స్కూటీలకు డిమాండ్ పెరిగింది. ఇవి గేర్‌లెస్‌గా చాలా ఈజీగా స్త్రీలు, పురుషులు డ్రైవింగ్ చేయడానికి అనువుగా ఉంటాయి.

ఈ నేపథ్యంలో కంపెనీలు కొత్త కొత్త ఫీచర్లతో స్కూటీలను లాంచ్ చేస్తున్నాయి. అయితే కస్టమర్లు స్కూటీ కొనుగోలు విషయంలో చాలా సతమతం అవుతుంటారు. అందుకే 110cc కేటగిరీలో ప్రసిద్ధి చెందిన, అలాగే, అన్ని రకాల రోడ్లపై కూడా సులభంగా డ్రైవింగ్ చేయడానికి, ఎక్కువ మైలేజ్‌ను అందించే కొన్ని స్కూటర్ల గురించి కింద ఇవ్వడం జరిగింది. అవేంటో ఒకసారి చూడండి.

హోండా యాక్టివా 6జీ(Honda Activa 6G): స్కూటీ అంటే మొదట గుర్తుకు వచ్చేది హోండా కంపెనీకి చెందిన యాక్టివా(Activa). దేశంలో ఈ స్కూటర్ తెలియని వారు ఉండరు. అత్యధికంగా అమ్ముడుపోతున్న విభాగంలో ఇది మొదటి స్థానంలో ఉంటుంది. దీని ఆకట్టుకునే డిజైన్, ఫెర్ఫార్మెన్స్ పరంగా దాదాపు కస్టమర్లందరూ కూడా దీన్ని ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా యాక్టివా 6జీ మైలేజ్ విషయానికి వస్తే, లీటర్ పెట్రోల్‌కు 59.5 కి.మీ గా ఉంది.

Honda Activa 6G Top 110 CC Scooty

యాక్టివాలోనే చాలా అప్‌డేటెడ్ వెర్షన్లు మార్కెట్లోకి వచ్చాయి. పాత వాటితో పోలిస్తే కొత్తగా ఇటీవల కాలంలో వచ్చిన యాక్టివా 6జీలో అధునాతన ఫీచర్లను అందించారు. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, కీ-లెస్ వంటి చాలా ఫీచర్‌లు ఉన్నాయి. రైడింగ్‌లో బ్రేక్ వేసినప్పుడు స్కిడ్ కాకుండా ఉండటానికి డ్రమ్ బ్రేక్‌లు, సీట్ క్రింద భాగంలో ఎక్కువ స్థలం మొదలగు సదుపాయాలు ఈ కొత్త యాక్టివాలో ఉన్నాయి.

హోండా డియో(Honda Dio): చూడటానికి చిన్నగా కనిపిస్తున్నప్పటికీ ఇతర మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుంది. లీటర్ పెట్రోల్‌కు దాదాపు 50 కి.మీ వరకు మైలేజ్ అందిస్తుంది. దీని ధర రూ.75,630 నుంచి రూ.82,580 మధ్య ఉంది. డియో మోడల్ డ్రైవింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇంజిన్ కెపాసిటీ 109.51 cc. ఎయిర్-కూల్డ్ సింగిల్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ద్వారా రన్ అవుతుంది.

TVS స్కూటీ జెస్ట్(TVS Scooty Zest): దీనిలో 109.7 సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉంది. లీటర్ పెట్రోల్‌కు దాదాపు 48 కి.మీ వరకు మైలేజ్‌ను అందిస్తుంది. నగరాల రోడ్లతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లకు సైతం ఇది చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ధర రూ.72,614 నుండి రూ.73,417 మధ్య ఉంది.

5 Top 110 CC Scooters In The Market

బడ్జెట్ ధరలో లభిస్తున్న స్కూటీలలో TVS స్కూటీ జెస్ట్ మంచి ఆప్షన్‌గా ఉంటుంది. దీని పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ 5-లీటర్లు. దగ్గర ప్రాంతాలతో పాటు ఎక్కువ దూరం వెళ్లడానికి కూడా ఈ స్కూటీ బాగా సెట్ అవుతుంది. యూత్‌‌తో పాటు,పెద్ద వయస్సుల వారు దీనిని సులభంగా రైడింగ్ చేయగలరు.

హీరో ప్లెజర్(Hero Pleasure): ఈ స్కూటర్ తక్కువ ఎత్తు ఉన్నవాళ్లకు సైతం చాలా అనువుగా ఉంటుంది. దీని ధర రూ. 72,163 నుండి రూ. 83,918 ఎక్స్-షోరూమ్ మధ్య ఉంది. ఇది 110.9 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. మైలేజ్ విషయానికి వస్తే దాదాపు లీటర్ పెట్రోల్‌కు 50 కి.మీ వరకు వస్తుంది. గ్రామీణ ప్రాంత రోడ్లపై కూడా సాఫీగా ప్రయాణిస్తుంది.

Herp Pleasure Top 110 CC Scooter In The Market

హీరో జూమ్(Hero Xoom): ఇది హీరో కంపెనీలో బాగా డిమాండ్ ఉన్న మోడల్. దీని ధర రూ.75,761 నుండి రూ. 85,400 మధ్య ఉంటుంది. దాదాపు లీటర్ పెట్రోల్‌కు 45 కి.మీ మైలేజ్ వస్తుంది. ఇంధన ట్యాంక్ కెపాసిటీ 5.2 లీటర్లు. దీనిలో 110.9 సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంది.

Hero Xoom 5 Top 110 CC Scooter

More from DriveSpark

Article Published On: Monday, October 28, 2024, 16:05 [IST]
English summary
Top 110 cc scooters in the market check mileage and price details here
Read more on: #auto #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+