110 కి.మీ రేంజ్‌తో ఎదురు లేని ది బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే.. ధర కూడా చాలా తక్కువ.!!
భారత్‌లో గత రెండేళ్లుగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సేల్స్ ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా యువతలో ఎలక్ట్రిక్ స్కూటర్లపై క్రేజ్ పెరుగుతోంది. దీంతో సరికొత్త డిజైన్లు, ఆకట్టుకునే పనితీరుతో పలు కంపెనీలు ఈవీలను విడుదల చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు మంచి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ ప్రముఖ కంపెనీల బైక్‌లపై ఓ లుక్కేయండి.
దేశీయ మార్కెట్లో ఎన్నో ఏళ్లుగా బైక్, స్కూటర్ సెగ్మెంట్‌లో టీవీఎస్, హీరో, బజాజ్ రారాజుల్లా వెలిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఈవీ సెగ్మెంట్‌లోకి ఈ ప్రముఖ సంస్థలు కూడా ప్రవేశించి కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ కంపెనీల నుంచి మూడు ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడళ్లు.. మార్కెట్లో మంచి డిమాండ్‌తో ఉన్నాయి. వాటి వివరాలు..

బజాజ్ చేతక్(Bajaj Chetak): బజాజ్ మోటార్స్ ఇండియా నుంచి యూత్ ఫేవరెట్ స్కూటర్ చేతక్‌ను సంస్థ ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ప్రవేశపెట్టింది. ఇది అర్బన్ మరియు ప్రీమియం అనే 2 వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. ధర సుమారు రూ. 1.15 లక్షల నుండి రూ. 1.35 లక్షల(ఎక్స్-షోరూమ్) మధ్య అందుబాటులో ఉంటుంది.
కాగా బజాజ్ చేతక్ అర్బన్ మోడల్ ఫుల్ ఛార్జింగ్‌తో 113 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుండగా.. గంటకు గరిష్ఠంగా 73 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఇక బజాజ్ చేతక్ ప్రీమియం ఎడిషన్ పూర్తి ఛార్జింగ్‌పై 108 కి.మీల రేంజ్‌ను ఇస్తుంది. దీని గరిష్ఠ వేగం 63 కి.మీగా ఉంది.
బజాజ్ చేతక్ రెండు వేరియంట్‌ల బ్యాటరీ ప్యాక్‌లు దాదాపు 4 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతాయి. ఫీచర్ల విషయానికొస్తే టర్న్-బై-టర్న్ నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్, కాల్ అలర్ట్ మరియు డిస్‌ప్లే థీమ్‌తో సహా డజన్ల కొద్దీ ఫీచర్‌లను కలిగి ఉండటం దీని ప్రత్యేకత.

హీరో విడా(Hero Vida): భారత్‌లో నంబర్ 1 ద్విచక్ర వాహన తయారీదారు అయిన హీరో మోటోకార్ప్.. విడా(Hero Vida) పేరుతో ఇ-స్కూటర్‌ను తీసుకువచ్చింది. దీనిని V1 ప్లస్ మరియు V1 ప్రో వేరియంట్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఈ స్కూటర్ ధర రూ. 1.15 లక్షల నుంచి రూ. 1.45 లక్షల మధ్య(ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉంది.
హీరో Vida V1 Plus మోడల్ 3.44 KWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌ను కలిగి ఉంది. పూర్తి ఛార్జ్‌పై 100 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. ఇక Vida V1 Pro వెర్షన్ పూర్తి ఛార్జ్‌పై 110 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది. ఫీచర్ల పరంగా ఇందులో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, LED లైటింగ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో పాటు అనేక ఫీచర్లను కలిగి ఉంది.

టీవీఎస్ ఐక్యూబ్(TVS iQube): భారత మార్కెట్లో Tvs iQube స్కూటర్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ స్కూటర్ రెండు వేరియంట్లు iQube మరియు iQube S లలో అందుబాటులో ఉంది. ధరలు వరుసగా.. రూ.1,47,968 నుండి రూ.1,53,909(ఎక్స్-షోరూమ్) ధర మధ్య అందుబాటులో ఉంటుంది.
టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్‌లు 3.04 KWh కెపాసిటీ గల లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తాయి. పూర్తి ఛార్జింగ్‌తో 100 కి.మీ రేంజ్‌ను అందిస్తాయి. ఈ రెండు TVS iQube వేరియంట్‌లు గరిష్ఠంగా 75 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి. బ్యాటరీ 4 గంటల 30 నిమిషాలలో 0-80 శాతం ఛార్జ్ అవుతుంది.
టీవీఎస్ ఐక్యూబ్‌లో ఫుల్ కలర్ TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో సహా అనేక రకాల ఫీచర్లను చూడవచ్చు. ఇది ఫ్రంట్ డిస్క్, రియర్ డ్రమ్ బ్రేక్ ఆప్షన్‌తో కూడా వస్తుంది. కాగా ఈ నెలాఖరుకు FAME-2 సబ్సిడీ ముగుస్తుండటంతో ఈ స్కూటర్‌పై కస్టమర్లు ఏకంగా రూ. 40,000 కు పైగా ప్రయోజనాలు పొందవచ్చు. ఏప్రిల్ 1 నుంచి వీటి ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








