రూ. 66,600 నుంచి రూ. 95,000 మధ్యలో ఉన్న ఈ బడ్జెట్‌ బైక్స్‌ మైలేజీలో తోపు, ఫర్ఫామెన్స్‌లో ది బెస్ట్‌!

దేశంలో బడ్జెట్‌ బైక్స్‌కి మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా దేశంలోని మధ్యతరగతి ప్రజలు ఈ బైక్స్‌ని కొనుగోలు చేసేందుకు ఇష్టపడతారు. రోజువారి జీవనంలో బైక్స్‌ అనేవి ఇప్పుడు సర్వసాధారణం అయిపోయాయి. దీంతో ప్రతీ ఒక్కరి ఇంట్లో టూ-వీలర్‌ అనేది కామన్‌ అయ్యింది. రోజువారి ఆఫీస్‌ పనులతో పాటు సొంత పనుల కోసం టూవీలర్స్‌ని కొనుగోలు చేయాల్సిన పని నెలకొంది. ఇంకా కొన్ని కంపెనీల్లో చేరాలంటే బైక్‌ ఉండాలనే నిబంధనలు సైతం ఉన్నాయి. దీంతో జీవిత బండి లాగడం కోసం ద్విచక్ర వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం చాలా కంపెనీలు తక్కువ ధరోల టూవీలర్స్‌ని అందిస్తున్నాయి. వాటిలో హీరో మోటోకార్ప్‌, హోండా, టీవీఎస్‌, బజాజ్‌ కంపెనీలు ప్రధానంగా బడ్జెట్‌ ధరలో టూవీలర్స్‌ని అందిస్తున్నాయి.

మీరు బడ్జెట్ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కోసం చూస్తున్నట్లయితే మార్కెట్‌లో ప్రస్తుతం హీరో స్ప్లెండర్ ప్లస్, హోండా షైన్ 100 మరియు బజాజ్ ఫ్రీడమ్ 125 ఉత్తమ ఆప్షన్స్‌గా ఉన్నాయి. వీటితో ఇతర కంపెనీల బైక్స్‌ కూడా తక్కువ ధరలో లభిస్తున్నాయి. అందులో ఈ మూడు బైక్స్‌ ఉత్తమ మైలేజీ, మంచి ఫర్ఫామెన్స్‌తో మీకు సరిపోతాయి. ఈ బైక్స్‌ ధర, స్పెసిఫికేషన్ల వివరాలు మీ కోసం..

Hero-Splendor-Bike

స్ప్లెండర్‌ ప్లస్‌: హీరో మోటోకార్ప్‌ నుంచి అత్యంత ప్రాచుర్యం పొందిన బైక్స్‌లో ఇది ఒకటి. మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీలను ఈ బైక్‌ టార్గెట్ చేస్తుంది. కమర్షియల్‌ అవసరాల కోసం ఈ బైక్స్‌ని సంస్థలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తాయి. దానికి కారణం దీని ధర మరియు మైలేజీ అని చెప్పవచ్చు. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.76,356 నుంచి రూ.77,826 మధ్య ఉంది.

ఇందులోని 97.2సీసీ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 8.02 ps శక్తిని మరియు 8.05 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ స్ల్పెండర్ ప్లస్ లీటరుకు 80.6 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. 112 కిలోల బరువున్న ఈ బైక్‌లో 9.8 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్‌ కలదు.

Honda-100-CC-Bike-Price

హోండా షైన్ 100: హోండా షైన్ 100 బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.66,600గా ఉంది. ఇందులోని 98.98 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 7.38 ps శక్తిని మరియు 8.05 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 4-స్పీడ్ గేర్ బాక్స్ ఆప్షన్ ఉంది. ఈ కొత్త షైన్ 100 లీటర్‌కి 68 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.

ఈ బైక్‌ బ్లాక్ విత్ రెడ్, బ్లాక్ విత్ గోల్డ్, బ్లాక్ విత్ బ్లూ వంటి 5 కలర్‌ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఈ బైక్‌లో అనలాగ్ ఇన్‌స్ట్రూమెంట్‌ క్లస్టర్, ఎలక్ట్రిక్ స్టార్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రైడర్లకు భద్రత కల్పించడానికి దీనికి డ్రమ్ బ్రేక్ ఉంది. దీనిలోని మరో బైక్‌ షైన్‌ 125 సీసీ ధర రూ. లక్షగా ఉంది.

Baja-Freedom-Bike

ఫ్రీడమ్‌ 125: బజాజ్ ఫ్రీడమ్ 125 మిడిల్‌ క్లాస్‌ వాళ్లకు బెస్ట్ అని చెప్పవచ్చు. ఇది సీఎన్‌జీ మరియు పెట్రోల్‌ ఆప్షన్‌తో పనిచేస్తుంది. ఈ బైక్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఈ బైక్ కేవలం ధర రూ .95,000 నుంచి రూ .1.10 లక్షల మధ్య ఉంది. ఇది డ్రమ్, డ్రమ్ ఎల్ఈడీ, డిస్క్ ఎల్ఈడీ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది.

ఇది 125 సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇందులో 5-స్పీడ్ గేర్ బాక్స్ జతచేయబడి ఉంది. ఇది సీఎన్‌జీ మోడ్‌లో కిలో సీఎన్‌జీ 200 కిలోమీటర్లు మరియు పెట్రోల్ మోడ్‌లో 130 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. రెండు ఇంధనాలతో కలిపి 330 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఈ బైక్‌ 7 కలర్‌ ఆప్షన్స్‌తో అందుబాటులో ఉంది. ఈ బైక్‌ని 11 రకాల కఠిన పరీక్షలను సైతం ఎదుర్కొంది.

More from DriveSpark

Article Published On: Tuesday, July 16, 2024, 17:01 [IST]
English summary
Top 3 budget bikes under 1 lakh engine performance and price details in telugu
Read more on: #auto news #bikes #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+