రోజువారి పనులు, ఆఫీస్‌కి వెళ్లేందుకు ఈ 3 స్కూటర్లు చాలా మంచివి.. ఎక్కువ లైఫ్ ఇస్తాయి!
ప్రస్తుతం ఆఫీస్‌కి సమయానికి చేరుకోవాలంటే టూవీలర్ కచ్చితంగా ఉండాలి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో వెళ్లడం వల్ల ఆఫీస్‌లో లాగిన్ అయ్యే సమయం ఆలస్యం అవ్వవచ్చు. అయితే టూవీలర్స్‌లోనూ ట్రాఫిక్‌లో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. అంతే తప్పా ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. ఇక ప్రతిరోజూ ఆఫీస్‌తో పాటు ఇతర పనులకు వెళ్లే వారికి ద్విచక్ర వాహనాలు తప్పనిసరి. బైకులతో పోలిస్తే, స్కూటర్లు 'గేర్ లెస్' మహిళలు సైతం వీటిని సులభంగా డ్రైవ్ చేయవచ్చు. మీరు ఆఫీసుకు వెళ్లడానికి మరియు రోజువారీ ఉపయోగం కోసం సరసమైన ధరలో అందుబాటులో ఉన్న స్కూటర్‌లను మీకు అందిస్తున్నాం. అందులో హీరో డెస్టినీ 125, హోండా యాక్టివా 125 మరియు సుజుకి యాక్సెస్ 125 బెస్ట్ ఆప్షన్స్‌గా ఉన్నాయి.
ఈ జాబితాలోని హీరో డెస్టినీ 125 (Hero Destini 125) స్కూటర్ 124.6 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 9.12 పిఎస్ శక్తిని మరియు 10.4 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.81,718 నుంచి రూ.87,518 మధ్య ఉంది.

ఈ స్కూటర్ లీటర్‌కి 50 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఇందులో సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, బూట్ ల్యాంప్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సేఫ్టీ కోసం డిస్క్ మరియు డ్రమ్ బ్రేక్ అందిచారు. ఇందులో 10 అంగుళాల అల్లాయ్ వీల్స్, ట్యూబ్ లెస్ టైర్లు ఉన్నాయి.
ఆ తర్వాత జాబితాలో ఉన్న స్కూటర్ హోండా యాక్టివా 125 (Honda Activa 125) ఉంది. ఇది 124 సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 8.3 పిఎస్ శక్తిని మరియు 10.4 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ పాపులర్ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.83,084 నుంచి రూ.92,257 మధ్య ఉంది.

ఈ సరికొత్త హోండా యాక్టివా లీటరుకు 60 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఇందులో LED హెడ్ లైట్లు, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఇందులో రైడర్ల రక్షణ కోసం డిస్క్ బ్రేక్‌ని అందిచారు. 109 కిలోల బరువున్న ఈ స్కూటర్‌లో 5.3 లీటర్ల కెపాసిటీ ఉన్న ఫ్యూయెల్ ట్యాంక్ ఉంది.
ఇక మరొక స్కూటర్ సుజుకి యాక్సెస్ 125 (Suzuki Access 125) స్కూటర్ 124 సీసీ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 8.7 పిఎస్ శక్తిని మరియు 10 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇక దీని ఎక్స్-షోరూమ్ ధర రూ .82,586 నుంచి రూ .94,082 మధ్య ఉంది.

ఈ స్కూటర్ లీటరుకు 45 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఎల్ఈడీ హెడ్‌లైట్స్, సెమీ డిజిటల్ ఇన్ఫర్మేషన్ ప్యానల్, సుజుకి రైడ్ కనెక్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ముందు భాగంలో సేఫ్టీ కోసం డిస్క్/డ్రమ్ బ్రేక్ ఆప్షన్‌తో కూడిన టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ సెటప్‌ని అందించారు.
వీటితో పాటు టీవీఎస్ జూపిటర్, యమహా ఫాసినో, ఇక ప్రీమియ స్కూటర్ల కోసం చూస్తే వెస్పా స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం చాలా కంపెనీల నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చితే వాటిని కూడా కొనుగోలు చేయవచ్చు. అందులో ముఖ్యంగా ఓలా, ఏథర్, టీవీఎస్ కంపెనీల నుంచి మంచి ఎలక్ట్రిక్ స్కూటర్స్ అందుబాటులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








