షార్ట్ రైడర్స్ కోసం.. బెస్ట్ బైకులు - తప్పకుండా నచ్చేస్తాయ్!
బైక్ రైడింగ్ చేయడం అందరికి ఇష్టమే. అయితే అన్ని బైకులను పొట్టిగా ఉన్న వ్యక్తులు రైడ్ చేయడం సాధ్యం కాదు. ఈ కథనంలో పొట్టిగా ఉన్న రైడర్స్‌కు తగిన మోటార్‌సైకిల్స్ ఏవి? వాటి వివరాలు ఏంటి అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
జావా 42 బాబర్ (Jawa 42 Bobber)
పొట్టి రైడర్లకు ఉత్తమమైన బైకులలో ఒకటి జావా కంపెనీకి చెందిన 42 బాబర్. ఈ బైక్ సీటు ఎత్తు కేవలం 740 మిమీ మాత్రమే. కాబట్టి పొట్టిగా ఉన్న రైడర్లు కూడా ఈ బైకును సులభంగా రైడింగ్ చేసుకోవచ్చు. హ్యాండ్లింగ్ కూడా చాలా సులభంగా ఉంటుంది. విభిన్న భూభాగాల్లో కూడా ఈ బైకును సులభంగా రైడ్ చేసుకోవచ్చు. ఈ బైక్ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 (Royal Enfield Meteor 350)
మన జాబితాలో చెప్పుకోదగ్గ మరో బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350. ఈ బైకు ప్రారంభం నుంచి ఎంతోమంది వాహన ప్రేమికుల మనసు దోచింది. ఇది కేవలం పొట్టిగా ఉన్న రైడర్లకు మాత్రమే కాకుండా.. పొడవుగా ఉన్నవారికి కూడా అనుకూలంగానే ఉంటుంది. అయితే ఈ బైక్ సీటు ఎత్తు 765 మిమీ ఉండటం వల్ల ప్రత్యేకించి పొట్టి రైడర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
బీఎండబ్ల్యూ జీ310 ఆర్ (BMW G310 R)
బీఎండబ్ల్యూ మోటొరాడ్ కంపెనీకి చెందిన 'జీ310 ఆర్' బైక్ కూడా పొట్టి రైడర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ బైక్ సీటు ఎత్తు 785 మిమీ వరకు ఉంటుంది. కాబట్టి ఈ బైకును రైడర్ సులభంగా రైడింగ్ చేయవచ్చు. ఇది 313 సీసీ ఇంజిన్ కలిగి అత్యత్తమ పనితీరును అందిస్తుంది. ఈ బైక్ వెయిట్ కూడా తక్కువగా ఉండటం వల్ల అద్భుతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

హోండా హార్నెట్ 2.0 (Honda Hornet 2.0)
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన హోండా మోటార్‌సైకిల్ యొక్క హార్నెట్ 2.0 బైక్ కూడా పొట్టిగా ఉన్న రైడర్లకు ఖచ్చితంగా సరిపోయే విధంగా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా సీబీ300ఎఫ్ కూడా వాహన వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది. హార్నెట్ 2.0 బైక్ సీటు ఎత్తు 790మిమీ కాగా.. సీబీ300ఎఫ్ సీటు ఎత్తు 789మిమీ వరకు ఉంటుంది. కాబట్టి ఈ రెండు బైకులు పొట్టి రైడర్లకు ఖచ్చితంగా సరిపోయే విధంగా ఉంటాయి.
బజాజ్ అవెంజర్ క్రూయిజ్ 220 (Bajaj Avenger Cruise 220)
బజాజ్ కంపెనీకి చెందిన అవెంజర్ బైక్ కూడా పొట్టిగా ఉన్న రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ బైక్ సీటు ఎత్తు కేవలం 737 మిమీ మాత్రమే. అంతే కాకుండా హ్యాండిల్ బార్, వీల్‌బేస్ వంటివి కూడా చాలా అనుకూలంగా ఉండేలా రూపొందించబడి ఉన్నాయి. నిజానికి పొట్టి రైడర్ల వినియోగానికి ప్రత్యేకించి ఈ బైక్ చాలా అద్భుతంగా ఉంటుందని మాత్రం చెప్పవచ్చు.

బజాజ్ అవెంజర్ క్రూయిజ్ 220 బైక్ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 220 సీసీ ఆయిల్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 18.7 Bhp పవర్ మరియు 17.5 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైకులో సింగిల్ ఛానల్ ఏబీఎస్ ఉంటుంది. ఈ బైక్ బరువు 163 కేజీల వరకు ఉంటుంది. ఇది అన్ని విధాలా రైడర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








