దీపావళికి తక్కువ ధరలో, ఎక్కువ రేంజ్ అందించే టాప్-5 ఈవీ స్కూటర్లు ఇవే.. వీటి ఫెర్ఫామెన్స్ మాములుగా ఉండదు..
ఇప్పటికే కూరగాయలు, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. వీటికి తోడు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా ఎక్కువగా ఉన్నాయి. లీటర్‌కు రూ.100కు పైగా ఉన్న ఇంధన ధరలతో మధ్యతరగతి ప్రజలు తమ వాహనాలను ఇంటి నుంచి బయటకు తీయలేని పరిస్థితి నెలకొంది. దీంతో అందరి చూపు ఎలక్ట్రిక్ వాహనాలపై పడింది. వీటికి ఎలాంటి పెట్రోల్, డీజిల్ అవసరం లేదు. కేవలం బ్యాటరీ ద్వారా రన్ అవుతాయి. పైగా వీటి ధరలు కూడా తక్కువగా ఉండటంతో దేశంలో ఇటీవల కాలంలో ఈవీ వాహనాల వాడకం విపరీతంగా పెరిగింది. మార్కెట్లో చాలా ఈవీ బైకులు, స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు దీపావళి పండుగ సీజన్ నడుస్తోంది. ఈ సమయంలో వాహనాల కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి.
కొత్త ఈవీలను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ఈ పండుగ సీజన్‌లో తక్కువ ధరకు ఈవీలను తమ ఇంటికి తీసుకెళ్లవచ్చు. ప్రస్తుతం కొత్త కొత్త ఈవీ స్కూటర్లను ఉండగా, వాటిలో తక్కువ ధరలో, మంచి రేంజ్, బెస్ట్ ఫెర్మానెన్స్ ఇచ్చే కొన్ని టాప్ 5 ఈవీ స్కూటర్లను క్రింది కథనంలో ఇవ్వడం జరిగింది. వాటి వివరాలను ఒకసారి చూద్దాం..

LXS G2.0: లెక్ట్రిక్స్(Lectrix) కంపెనీకి చెందిన ఎల్‌ఎక్స్‌ఎస్ జీ2.0(LXS G2.0) ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ పండుగ సీజన్‌లో బెస్ట్ ఈవీ టూవీలర్‌గా ఉంది. దీని ధర రూ.1,17,352. ఒకే వేరియంట్‌లో లభిస్తున్న ఈ స్కూటర్ ఆరు కలర్స్‌లలో అందుబాటులో ఉంది. 2.3 KW బ్యాటరీ ప్యాక్‌ను స్కూటర్‌లో ఏర్పాటు చేశారు. బ్యాటరీ పనితీరు కూడా అద్భుతంగా ఉంటుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 98 కి.మీ వరకు ప్రయాణిస్తుంది.
ఈ రేంజ్ అంటే మామూలు విషయం కాదు. దగ్గర ఉన్న ప్రాంతాలతో పాటు కొంచెం ఎక్కువ దూరం ప్రదేశాలకు సైతం సింగిల్ ఛార్జింగ్ చేస్తే సునాయసంగా వెళ్లవచ్చు. రైడర్లకు అవసరమయ్యే అన్ని ఫీచర్లు కూడా దీనిలో ఉన్నాయి. ఎమర్జెన్సీ SOS అలర్ట్, ఫైండ్ మై స్కూటర్, ముందు వెనుక డ్రమ్ బ్రేక్‌లతో రెండు చక్రాలకు ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి అధునాతన ఆప్షన్స్ కూడా ఉన్నాయి.

LXS G3.0: లెక్ట్రిక్స్(Lectrix) నుంచి వచ్చిన మరో ఈవీ స్కూటర్ ఎల్‌ఎక్స్‌ఎస్ జీ3.0(LXS G3.0) ఒక వెర్షన్ కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఐదు కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది. ముఖ్యంగా ఇది బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BAAS) అనే సదుపాయంతో వచ్చింది. ఈ ఆప్షన్‌లో బ్యాటరీని అద్దె ప్రతిపాదికన కొనుగోలు చేయవచ్చు. బ్యాటరీతో కలిపి ఒక ధర, బ్యాటరీ లేకుండా మరో ధరలో అందుబాటులో ఉంది.
BAAS ఆప్షన్ ఎంచుకున్నట్లయితే బ్యాటరీని నెలకు రూ.999 తో అద్దెకు తీసుకోవచ్చు. బ్యాటరీని వేగంగా ఛార్జింగ్ చేయడానికి అధునాతన సాంకేతికతో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఈ స్కూటర్‌లో ఉంది. దీన్ని 18A ఛార్జర్‌ని ఉపయోగించి కేవలం మూడు గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఒక్కసారి ఛార్జింగ్‌తో దాదాపు 115 కి.మీల దూరం ప్రయాణిస్తుంది.
OLA S1 X: ఓలా ఎస్1 ఎక్స్(OLA S1 X) ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువగా అమ్ముడుపోతున్న మోడల్స్‌లో మొదటి స్థానంలో ఉంది. దీని ప్రారంభ ధర రూ.87,796. ఇది లేటెస్ట్ ట్రెండ్‌కు అనుగుణంగా అధునాతన సాంకేతికతను కలిగి ఉంది. ఏడు కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది. స్కూటీలో 2kW బ్యాటరీ ప్యాక్ ఉంది. సింగిల్ ఛార్జింగ్‌తో ఈ మోడల్ దాదాపు 151 కి.మీ రేంజ్ అందిస్తుంది.

అలాగే, OLA S1X 3kW, S1X 4kW,S1X ప్లస్ మోడళ్లు కూడా దేశంలో ఎక్కువ డిమాండ్ కలిగి స్కూటీలుగా ఉన్నాయి. వీటి బ్యాటరీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. వేరియంట్‌ను బట్టి సింగిల్ ఛార్జింగ్‌తో 110 కి.మీకు పైగా ప్రయాణిస్తాయి. టాప్ స్పీడ్ 90kmph గా ఉంది.
పైన పేర్కొన్న మోడల్స్ అన్ని కూడా పెట్టిన ప్రతి రూపాయికి కూడా రెండింతలు ప్రయోజనాన్ని అందిస్తాయి. వీటితో పాటు కంపెనీలు మరిన్ని కొత్త ఈవీలను దీపావళికి ముందు మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. కస్టమర్లు తమకు నచ్చిన మోడల్‌ను ఈ పండుగ సీజన్‌లో తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








