దీపావళికి ఈ టాప్-5 స్కూటర్లలో ఏదైనా ఒక దానిని కొంటే చాలు మీ ఇంట్లో సిరుల పంట పండినట్లే!
ప్రతీ సంవంత్సరం చివరి నెలల్లో ఆటోమొబైల్ రంగానికి మంచి మార్కెట్ ఉంటుంది. పండుగ సీజన్‌లో జనాలు ఎక్కువగా కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. దీంతో ఈ సీజన్‌లో మార్కెట్‌ని ఒడిసిపట్టుకునేందుకు వాహనాల ఉత్పత్తి సంస్థలు కూడా కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తూ ఉంటాయి. కొత్త వెహికిల్స్ లాంచ్ చేయడం ద్వారా వాహన తయారీ సంస్థలు తమ సేల్స్‌ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తాయి. ప్రస్తుతం దేశంలో పండుగ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే దసరాకు వాహనాల సేల్స్ ఊపందుకున్నట్లు తెలుస్తోంది. ఇక దీపావళి లోపు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ప్రస్తుతం జనాలు ఎక్కువగా పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ఆసక్తి చూపిస్తున్నారు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ స్కూటర్లు కీలకంగా మారనున్నాయి. మీరు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లతో ఈ దీపావళిని జరుపుకోవడానికి సిద్ధంగా ఉంటే మార్కెట్‌లో మీకు టాప్ కంపెనీల నుంచి భారీ రేంజ్‌తో స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ పండుగ సీజన్‌లో మీరు కూడా స్కూటర్లు కొనాలని భావిస్తే ఈ టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లపై కచ్చితంగా ఓ లుక్కేయాల్సిందే.

ఓలా S1 ఎక్స్ (Ola S1X): ఈ బేస్ వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏడు కలర్ ఆఫ్షన్‌లో లభిస్తుంది. ఈ స్కూటర్ శక్తివంతమైన 2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఫుల్ ఛార్జ్‌పై 151 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు. ఈ నెలలో 'బాస్' సేల్‌లో భాగంగా కేవలం రూ.49,999కే కొనుగోలు చేయవచ్చు.
టీవీఎస్ ఐక్యూబ్: ఈ పండుగ సీజన్‌లో ఓ మంచి ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని చూస్తే ఇది మీకు సరిపోతుంది. దీని ప్రారంభ ధర రూ. 89,999 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ పండుగ సీజన్‌లో డిస్కౌంట్స్, ఇతర ఆఫర్లు, ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ ద్వారా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కేవలం రూ.84,999 లకే కొనుగోలు చేయవచ్చు.

ఈ ఐక్యూబ్ అన్ని వేరియంట్లు 4.4 kWh ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తాయి. ఐక్యూబ్ బేస్ వేరియంట్ 2.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 75 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. మిడ్ స్పెక్ 3.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ 100 కిలోమీటర్ల రేంజ్‌ని కలిగి ఉంటుంది. అలాగే పెద్ద బ్యాటరీ ప్యాక్ 150 కిలోమీటర్ల రేంజ్‌ని కలిగి ఉంటుంది.
లెక్ట్రిక్స్ LXS G 3.0: మంచి రేంజ్, తక్కువ ఛార్జింగ్ సమయం పట్టే స్కూటర్ కోసం చూస్తున్న వారికి ఇది సరిపోతుంది. ఈ స్కూటర్లను యూత్ కోసం ప్రత్యేకంగా కంపెనీ డిజైన్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్‌పై 115 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. దీనిని 18ఏ ఛార్జర్ సహాయంతో మూడు గంటల్లో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.

ఈ స్కూటర్ గంటకు 54 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్‌ని ఐదు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్స్‌లో ఎంచుకోవచ్చు. ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధరను రూ.96,900గా నిర్ణయించారు. లెక్ట్రిక్స్ అడ్వాన్స్‌డ్ బ్యాటరీ యాస్ ఏ సర్వీస్ (BaaS) ఆప్షన్ ద్వారా తక్కువ ధరలో ఈ స్కూటర్లను కొనుగోలు చేయవచ్చు. ఇది వినియోగదారులకు కలిసి వస్తుంది.
యాంపియర్ మాగ్నస్ EX: యాంపియర్ మాగ్నస్ EX అనేది రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉన్న మోడల్‌గా ఉంది. ఇది మీరు ఎక్కడైనా సులభంగా ఛార్జ్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ స్కూటర్‌ని ఫుల్ ఛార్జ్ చేస్తే 80 నుంచి 100 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.84,913 నుంచి ప్రారంభమౌతోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 45 కిలోమీటర్లుగా ఉంది.

లెక్ట్రిక్స్ LXS G 2.0: లెక్ట్రిక్స్ నుంచి అందుబాటులో ఉన్న మరో మోడల్ LXS G 2.0 స్కూటర్. 2.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కలిగిన ఈవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 98 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మెరుగైన పనితీరును అందించే ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్న వారికి ఇది మంచి ఆప్షన్‌ని అందిస్తుంది. ఇది రూ. 84994 వద్ద కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications








