'ఆల్ట్రావయొలెట్ ఎఫ్77 మ్యాక్ 2' బైక్ గురించి తెలుసుకోవలసిన 5 విషయాలు
ఇటీవల బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ అల్ట్రావయొలెట్ ఆటోమోటివ్ తన 'ఎఫ్77 మ్యాక్ 2' లాంచ్ చేసింది. ఈ బైక్ కొనుగోలు చేయాలనుకునే వారు తప్పకుండా కొన్ని విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ధర & డెలివరీ
దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త 'అల్ట్రావయొలెట్ ఎఫ్77 మ్యాక్ 2' రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఒరిజినల్ మరియు రీకాన్. వీటి ధరలు రూ.2.99 లక్షలు, రూ.3.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ ధరలు మొదటి 1000 మంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయి. ఆ తరువాత తరువాత ధరలు రూ.80000 నుంచి రూ.1 లక్ష వరకు ధరల పెరుగుదల ఉండవచ్చని తెలుస్తోంది. డెలివరీలు మేలో ప్రారంభమవుతాయి.

డిజైన్
కొత్త ఆల్ట్రావయొలెట్ ఎఫ్77 మ్యాక్ 2 మంచి డిజైన్ కలిగి చూడగానే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. ఈ బైక్ యొక్క ఛార్జింగ్ ఫోర్ట్ కోసం అల్యూమినియం క్యాప్ ఉంది. హెడ్ లైట్, టెయిల్ లైట్ మరియు అప్డేటెడ్ గ్రాఫిక్ డిజైన్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇది తప్పకుండా వాహన వినియోగదారులను ఆకర్శించడంలో విజయం పొందుతుందని భావిస్తున్నాము.
ఫీచర్స్
ఫీచర్స్ విషయానికి వస్తే.. ఆల్ట్రావయొలెట్ ఎఫ్77 మ్యాక్2 ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం, హిల్ హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, డిస్‌ప్లే థీమ్, ఆన్‌బోర్డ్ న్యావిగేషన్, క్రాష్ అలర్ట్, యాన్తి కొలిజన్ వర్కింగ్ సిస్టం వంటివి ఉన్నాయి. రీకాన్ మోడల్ 10 లెవెల్ రీజనరేటివ్ బ్రేకింగ్ పొందుతుంది. అంతే కాకుండా ఈ బైక్ మూడు రైడింగ్ మోడ్స్ పొందుతుంది. అవి స్పోర్ట్/ట్రాక్, సిటీ/స్ట్రీట్ మరియు రెయిన్/ఐస్.

కలర్ ఆప్షన్స్
ఆల్ట్రావయొలెట్ ఎఫ్77 మ్యాక్2 రెండు వేరియంట్లలో.. ప్రతి ఒక్క వేరియంట్ మూడు వెర్షన్లలో లభిస్తుంది. అవి స్టెల్త్, లేజర్ మరియు ఎయిర్‌స్ట్రైక్. స్టెల్త్ వెర్షన్ ఆస్టరాయిడ్ గ్రే, కాస్మిక్ బ్లాక్, స్టెల్త్ గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. లేజర్ వెర్షన్ టర్బో రెడ్, ఆఫ్టర్‌బర్నర్ ఎల్లో, ప్లాస్మా రెడ్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇక చివరగా ఎయిర్‌స్ట్రైక్ వెర్షన్ లైట్నింగ్ బ్లూ, స్టెల్లార్ వైట్, సూపర్‌సోనిక్ సిల్వర్ అనే రంగులలో లభిస్తుంది.
బ్యాటరీ ప్యాక్ & పర్ఫామెన్స్
పనితీరుపరంగా ఒరిజినల్ మరియు రీకాన్ రెండూ వేరువేరుగా ఉంటాయని తెలుస్తోంది. మొదటి మోడల్ 7.1 కిలోవాట్ బ్యాటరీ కలిగి ఒక సింగిల్ చార్జితో 211 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది 36.21 Bhp పవర్ మరియు 90 Nm టార్క్ అందిస్తుంది. రీకాన్ వేరియంట్ 10.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి 323 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది 40.23 Bhp పవర్ మరియు 100 Nm టార్క్ అందిస్తుంది.

ఆల్ట్రావయొలెట్ ఎఫ్77 మ్యాక్ 2 కోసం కంపెనీ బుకింగ్స్ కూడా ప్రారంభించింది. ఈ బైక్ డెలివరీలు వచ్చే నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ బైక్ దాని మునుపటి మోడల్స్ కంటే ఉత్తమ డిజైన్ కలిగి, అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఇవన్నీ రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తాయి. ఎక్కువ రేంజ్ అందించడం వల్ల ఈ బైకును ఎక్కువ మంది ఈ బైక్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారని భావిస్తున్నాము.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








