లైట్ వెయిట్ స్కూటర్లు కావాలా..? మార్కెట్‌లో తక్కువ బరువు స్కూటర్లలో టాప్ 5 ఇవే.. అవెంటో మీరు ఓ లుక్కేయండి

దేశంలో బైకుల కంటే కూడా స్కూటర్ల వాడకం విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే ఇవి దగ్గరి ప్రయాణాలకు అనుకూలంగా ఉండటం, ఎలాంటి రోడ్లపై అయిన కూడా సులభంగా వెళ్లడంతో పాటు సామాన్లు తీసుకెళ్లడానికి కూడా అనువుగా ఉండటం వలన చాలా మంది ప్రజలు స్కూటీలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇవి స్త్రీలు ఉపయోగించడానికి బెస్ట్ ఆప్షన్. మగవారు కూడా ప్రస్తుతం స్కూటీలనే అధికంగా కొంటున్నారు. అందుకే బైకుల కంటే కూడా స్కూటీల వాడకం అధికం అయింది. దీంతో బైకులను తయారు చేసే కంపెనీలు స్కూటీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి టాప్ ఫీచర్లతో వరుసగా కొత్త కొత్త మోడళ్లను లాంచ్ చేస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల స్కూటీలు అందుబాటులో ఉన్నాయి.

ఇవి రోజువారీ ప్రయాణాలకు చాలా మంచి ఎంపిక. గ్రామాలు, పట్టణాలు, నగరాల రోడ్లపై రయ్ మంటూ దూసుకుపోతాయి. అయితే తక్కువ బరువును కలిగి ఉండే స్కూటర్లను చాలా మంది ఇటీవల కోరుకుంటున్నారు. అలాంటి తక్కువ బరువుతో మార్కెట్లో ఉన్న టాప్ 5 స్కూటర్లను క్రింది కథనంలో ఇవ్వడం జరిగింది.

Top 5 Lightweight Scooters S1x Rayzr Access 125 Jupiter

ఓలా ఎస్‌1ఎక్స్( Ola S1X 2kWh): ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ఇండియాలోనే ఓలా కంపెనీ ప్రముఖ స్థానాన్ని సంపాదించింది. ఈ కంపెనీ నుంచి వచ్చే అన్ని ఈవీ స్కూటర్లు తక్కువ బరువును కలిగి ఉంటాయి. ముఖ్యంగా Ola S1X మోడల్ మరింత తక్కువ బరువుతో వచ్చింది. ఇది 100 కిలోల మార్కు కంటే కొంచెం ఎక్కువగా 101 కిలోల బరువును కలిగి ఉంది.

ఈ ఈవీ-స్కూటర్ నగర రోడ్లకు, పట్టణాలను అనుకూలంగా ఉంటుంది. రోజువారి పనులు, ఉద్యోగాలు, కాలేజ్‌లకు వెళ్లేవారికి ఈ స్కూటర్ మంచి ఆప్షన్. దాని బరువు తక్కువగా కారణంగా బరువును మోయలేని వారికి ఇది బాగా సెట్ అవుతుంది. ఓలాలో ఈ మోడల్‌తో పాటు ఇతర స్కూటర్లు సైతం తక్కువ బరువుతో వచ్చాయి.

Top 5 Lightweight Scooters Ola S1X

యమహా రేజెడ్ఆర్(Yamaha RayZR): యమహా కంపెనీ రేజెడ్ఆర్ బరువు కేవలం 99 కిలోలు. తక్కువ బరువుతో ఉన్నప్పటికి 125cc ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ రేంజ్ సీసీ ఇంజిన్ పనితీరు అద్భుతంగా ఉంటుంది. అన్ని రకాల రోడ్లపై సాఫీగా ప్రయాణిస్తుంది. దీని డిజైన్ కూడా చాలా అందంగా ఉంటుంది. కంపెనీ టూవీలర్ విభాగంలో రేజెడ్ఆర్ ప్రత్యేకంగా ఉంది. స్కూటీలో బ్లూటూత్ కనెక్టివిటీ, సైలెంట్ స్టార్ట్ మోటార్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Top 5 Lightweight Scooter Yamaha

హోండా యాక్టివా హెచ్-స్మార్ట్(Honda Activa H-Smart): దీని బరువు కేవలం 105 కేజీలు మాత్రమే. ఇది ప్రధానంగా నగర రోడ్లకు చాలా అనువుగా ఉంటుంది. యాక్టివా హెచ్-స్మార్ట్ రైడింగ్ కూడా చాలా ఈజీ. ఇది అత్యంత అధునాతనమైన ఫీచర్లతో వచ్చంది. అల్లాయ్ వీల్స్ చాలా ఆకర్షణీయంగా ఉండటంతో పాటు, కీలెస్ స్టార్ట్‌ను కూడా ఈ స్కూటీలో అందించారు.

Top 5 Lightweight Scooters Honda H Smart

సుజుకి యాక్సెస్ 125(Suzuki Access 125): ఇండియాలో సుజుకి యాక్సెస్ 125 అత్యంత నమ్మకమైన స్కూటర్లలో ఒకటిగా ఉంది. ఈ మోడల్ ఇతర కంపెనీలకు గట్టి పోటీ నిస్తూ అమ్మకాల పరంగా దూసుకుపోతోంది. దీని బరువు కేవలం 104 కిలోలు మాత్రమే. ఇది రోజువారీ ప్రయాణాలకు చాలా అనువుగా ఉంటుంది.

Top 5 Lightweight Scooter Suzuki Access

ఈ మోడల్‌లో కంపెనీ ఎప్పటికప్పుడు అన్ని అప్‌డేటేడ్ ఫీచర్లను అందిస్తుంది. యాక్సెస్ 125లో ముందు LED లైటింగ్, డిజిటల్ క్లస్టర్, పెట్రోల్ ట్యాంక్ బయటివైపు, సీటు క్రింది భాగంలో ఎక్కువ లగేజీని పెట్టడానికి అధిక స్థలం, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

TVS జూపిటర్ 110(TVS Jupiter 110): టీవీఎస్ కంపెనీ జూపిటర్ మోడల్ అన్ని రకాల రోడ్లకు అనువుగా ఉంటుంది. దీని బరువు 106 కిలోలు. ఇది కూడా లేటెస్ట్ టెక్నాలజీతో అందుబాటులో ఉంది. ఇంజిన్ పనితీరు కూడా అద్భుతంగా ఉంటుంది. జూపిటర్ ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న విభాగంలో టాప్ 5 ప్లేస్‌లో ఉంది.

Top 5 Lightweight Scooter Tvs Jupiter

More from DriveSpark

Article Published On: Tuesday, November 5, 2024, 14:06 [IST]
English summary
Top 5 lightweight scooters s1x rayzr access 125 jupiter in india check all details
Read more on: #india #auto
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+